భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ మిడ్ సైజ్ సెడాన్ కారు రివీల్!

Written By:

ప్యాసింజర్ కార్లను వాటి ఆకారాన్ని బట్టి వివిధ కెటగిరీలుగా విభజించడం జరిగింది. అందులో ప్రధానంగా హ్యాచ్‌బ్యాక్, సెడాన్, కాంపాక్ట్ సెడాన్, మిడ్ సైజ్ సెడాన్, ఎస్‌యూవీ, ప్రీమియమ్ ఎస్‌యూవీ వంటి కెటగిరీలలో కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి.

వీటిలో మిడ్ సైజ్ సెడాన్ కార్లకు మంచి వ్యాల్యూ ఉంది. మిడ్ సైజ్ కార్లకు ఉదాహరణ, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటి మరియు మారుతి సియాజ్‌లుగా చెప్పుకోవచ్చు. అయితే వీటిలో భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ మిడ్ సైజ్ సెడాన్ కారుగా హోండా సిటి తొలి స్థానంలో నిలిచింది.

భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ సెడాన్

హోండా మోటార్స్ విడుదల చేసిన సేల్స్ వివరాలను గమనిస్తే, జూన్ 2017 నెలలో మాత్రమే 5,187 యూనిట్ల సిటి కార్లు మరియు 4,243 యూనిట్ల డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ కార్లు అమ్మడయ్యాయి. సిటి సెడాన్ కేవలం హోండా మోటార్స్‌కు మాత్రమే కాదు, భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ మిడ్ సైజ్ సెడాన్‌గా నిలిచింది.

భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ సెడాన్

మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా సియాజ్ ఉండేది. అయితే గత ఏడాది నుండి సిటి అమ్మకాలు పుంజుకుని 2017 ప్రారంభం నాటికి మళ్లీ తగ్గడం జరిగింది. మార్కెట్ నాడి పసిగట్టిన హోండా ఈ ఏడాది ప్రారంభంలో 2017 సిటి కారును ఫేస్‌లిఫ్ట్ రూపంలో మళ్లీ విడుదల చేసింది.

భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ సెడాన్

దీంతో 2017 సంవత్సంరంలోని తొలి ఆరు మాసాల్లో 34,125 యూనిట్ల సిటి కార్లను విక్రయించింది. సియాజ్ మరియు వెర్నా విక్రయాలతో పోల్చుకుంటే సిటి కార్ల సేల్స్ అధికంగా ఉన్నాయి. ఇక జూన్ 2017 నెలలో హోండా వారి జాజ్ హ్యాచ్‌బ్యాక్ 1,307 యూనిట్లు మరియు హోండా అమేజ్ 1,193 యూనిట్లకు అమ్ముడయ్యాయి.

భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ సెడాన్

దేశీయంగా నమోదైన విక్రయాలు మరియు ఎగుమతి అయిన 450 యూనిట్లతో కలుపుకుని జూన్ 2017 లో 12.2 శాతం వృద్దిని సాధించింది హోండా మోటార్స్. అంతే కాకుండా హోండా 2015లో విడుదల చేసిన ఫోర్త్ జనరేషన్ సిటి సెడాన్ జూన్ 2017 విక్రయాలతో సహా మొత్తం 2.5 లక్షల యూనిట్ల వరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.

భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ సెడాన్

హోండా లైనప్‌లోని ఇతర మోడళ్లు అయిన బిఆర్-వి 567 యూనిట్లు, బ్రియో 283 యూనిట్లు మరియు సిఆర్-వి 24 యూనిట్ల వరకు అమ్ముడయ్యాయి. 2017 తొలి సంగంలో హోండా అత్యుత్తమ సేల్స్ జరిపింది. ఇక మలిసగం మొత్తం పండుగ సీజన్ కావడంతో సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ సెడాన్

దీనికి తోడు భారత ప్రభుత్వం నూతన పన్ను విధానం జిఎస్‌టిని అమలు చేయడంతో దాదాపు అన్ని కార్ల తయారీ సంస్థలకు మంచి ప్రయోజనాలు చేరుతున్నాయి. ప్యాసింజర్ కార్ల మీద ట్యాక్స్ తగ్గడంతో, హోండా మోటార్స్ తమ కార్ల మీద గరిష్టంగా రూ. 1.31 లక్షల వరకు ధరలు తగ్గించింది.

English summary
Read In Telugu: India's Best-Selling Mid-Size Sedan Revealed
Story first published: Saturday, July 8, 2017, 12:36 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark