సెకండ్ హ్యాండ్ కారు కోసం చూస్తున్నారా...? అయితే వీటిని గమనించండి

ఇండియాలో లభించే పది ఉత్తమ సెకండ్ హ్యాండ్ కార్ల గురించి చూద్దాం రండి...

By Anil

కారు కొనాలనుకునే చాలా మందిలో, కొత్త కార్లను కొనే స్థోమత మరియు తగినంత డబ్బులేని కారణంగా తమ డ్రీమ్ కారును సెకండ్ హ్యాండ్ కార్ల జాబితాలో నుండి ఎంచుకుంటున్నారు. ఇలాంటి వారిలో మీరు ఒకరా...? అయితే మీ కోసమే ఈ స్టోరీ....

బడ్జెట్‌కు సరిపడా అత్యుత్తమ కార్లు ఏవి, ధైర్యంగా ఏ కారును ఎంచుకోవచ్చు అనే డైలమాలో ఎంతో మందే ఉంటారు. ఇవాళ్టి కథనంలో పది ఉత్తమ సెకండ్ హ్యాండ్ కార్ల గురించి చూద్దాం రండి....

బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

1. మారుతి సుజుకి స్విఫ్ట్

ఇండియన్ సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ బెస్ట్ సెకండ్ హ్యాండ్ కారుగా నిలిచింది. అత్యుత్తమ మైలేజ్, ఎంత పాతదైనా బోర్ కొట్టని డిజైన్ మరియు దేశవ్యాప్తంగా సర్వీస్ సెంటర్లు ఉండటంతో పాటు భారతదేశం ఎక్కువగా విశ్వసించదగ్గ సంస్థ మారుతి సుజుకి దీనిని తయారు చేయడాన్ని మరో కారణంగా చెప్పవచ్చు.

Recommended Video

2017 Skoda Octavia RS Launched In India | In Telugu - DriveSpark తెలుగు
బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

2. హోండా సిటి

ఇండియాలో లభించే మంచి సెకండ్ హ్యాండ్ కార్లలో హోండా సిటి కూడా ఒకటి. కొత్త హోండా సిటి కారుకే కాదు, యూజ్ చేసిన సిటి కార్లకు కూడా ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సెడాన్ సెగ్మెంట్లో అత్యుత్తమ విక్రయాలు సాధిస్తున్న సిటి కారును అధికంగా వ్యక్తిగత అవసరాలకు వాడుకునే కస్టమర్లే ఎంచుకుంటున్నారు. కాబట్టి సిటి కార్లను చాలా సున్నితంగా, జాగ్రత్తగా చూసుకుంటారు. దీంతో సెకండ్ హ్యాండ్ కారుగానైనా ధైర్యంతో సిటిని ఎంచుకోవచ్చు.

బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

3. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో మరో శక్తివంతమైన మరియు అత్యుత్తమ విలువలు గల బడ్జెట్ ఫ్రెండ్లీ కారు గ్రాండ్ ఐ10. ప్రస్తుతం హ్యుందాయ్ ఇండియాలో లైనప్‌లో గ్రాండ్ ఐ10 మంచి విక్రయాలు సాధిస్తోంది. తక్కువ నిర్వహణ ఖర్చు, ధృడమైన బాడీ మరియు చిన్న కార్లలో మంచి విలువున్న కారుగా పేరుగాంచింది. కాబట్టి గ్రాండ్ ఐ10 మూడవ బెస్ట్ సెకండ్ హ్యాండ్‌ కారుగా ఈ జాబితాలో నిలిచింది.

బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

4. మారుతి సుజుకి ఆల్టో

సెకండ్ హ్యాండ్ కార్లను ఎంచుకునే వారిలో ఎక్కువ మంది ఆల్టో కారుకు అధిక ప్రాధ్యాన్యతనిస్తున్నారు. చిన్న కారు, తక్కువలో తక్కువ ధర, మంచి మైలేజ్‌ మరియు మళ్లీ అమ్మేయాలనుకుంటే సులభంగా విక్రయించే అవకాశం ఉండటంతో మంచి సెకండ్ హ్యాండ్ కారుగా ఆల్టోను సెలక్ట్ చేసుకోవచ్చు.

బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

5. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

భారతదేశపు ఫేవరెట్ కాంపాక్ట్ సెడాన్ స్విఫ్ట్ డిజైర్. ఒకప్పుడు వ్యక్తిగత అవసరాలకు డిజైర్‌ను ఎక్కువగా ఎంచుకునే వారు, అయితే ఇప్పుడు ట్యాక్సీల రూపంలో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. అయినప్పటికీ స్విఫ్ట్ డిజైర్ మంచి ఫ్యామిలీ కారు.

సెకండ్ హ్యాండ్ కారుగా ఎంచుకున్నప్పుడు అత్యుత్తమ లగేజ్ స్పేస్, తక్కువ మెయింటెనెన్స్, శక్తివంతమైన ఇంజన్‌లు, అధిక మైలేజ్ పరంగా అస్సలు నిరాశపరచదు.

బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

6. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

భారతదేశపు అసలైన టాల్ బాయ్ కారు వ్యాగన్ ఆర్. డీసెంట్ విక్రయాలు సాధిస్తున్న వ్యాగన్ ఆర్‌కు భారీ సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. సులభమైన డ్రైవింగ్ చేయడానికి డ్రైవింగ్ పొజిషన్ వ్యాగన్ ఆర్‌లో ఉంటుంది. కాబట్టి కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే వారు, ఫస్ట్ టైమ్ కారు కొనేవారు వ్యాగన్ ఆర్‌ను ఎంచుకోవచ్చు.

ఇండియాలో మారుతి వ్యాగన్ ఆర్ కారును పర్సనల్ అవసరాలకు మరియు ఫ్యామిలీ కోసమే అధికంగా విక్రయించింది. దీంతో ఎలాపడితే అలా వాడేసిన వ్యాగన్ ఆర్‌ కార్లు చాలా తక్కువగానే ఉంటాయి.

బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

7. టయోటా ఇన్నోవా

క్వాలిస్ కారుతో సంచలనం సృష్టించిన టయోటా ఇన్నోవా ఎమ్‌పీవీ ద్వారా ఇండియాలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. అత్యుత్తమ క్యాబిన్ స్పేస్, శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్స్ మరియు ఆరు లేదా ఏడు మంది సీటింగ్ సామర్థ్యంతో లభించే ఇన్నోవాను బెస్ట్ సెకండ్ హ్యాండ్ కారుగా ఎంచుకోవచ్చు.

బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

8. హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నాను బహుశా చాలా మంది ఎంచుకోక పోవచ్చు. అయితే వెర్నాకు ప్రత్యేక కస్టమర్లు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వారి నుండి వెర్నా సెడాన్ కారును సెకండ్ హ్యాండ్‌గా ఎంచుకోవచ్చు. డీజల్ ఇంజన్ వేరియంట్ వెర్నాతో అధిక మైలేజ్ సాధ్యం మరియు మీ జీవన శైలికి వెర్నా ప్రీమియమ్ ఫీల్ కల్పిస్తుంది.

బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

9. హ్యుందాయ్ శాంట్రో జింగ్

ఇండియన్ మార్కెట్లో ఆల్టో తర్వాత మంచి ఆదరణ పొందిన స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారు హ్యుందాయ్ శాంట్రో. ఎలాంటి అప్‌డేట్స్ నిర్వహించకపోవడంతో క్రమంగా శాంట్రో విక్రయాలు పడిపోయాయి. దీంతో హ్యుందాయ్ శాంట్రోను విపణి నుండి తొలగించింది. అయినా కూడా శాంట్రోకు అభిమానులు తగ్గడం లేదు. దీంతో ఇంకా శాంట్రో కారు సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో విక్రయాలకు వస్తోంది.

బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

10. హ్యుందాయ్ ఐ20

స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ తరువాత అధిక ప్రాధాన్యత గల కారు హ్యుందాయ్ ఐ20. హ్యుందాయ్ ఐ20 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారుగా ప్రస్తుతం మారుతి బాలోనోను గట్టి పోటీనిస్తోంది. హ్యుందాయ్ ఐ20 కారును ఇండియన్ యూస్డ్ కార్ మార్కెట్లో సెకండ్ హ్యాండ్ కారుగా ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: Best Used Cars To Buy In India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X