హైవేల కోసం భారత్ మాలా ప్రాజెక్ట్: 7 లక్షల కోట్ల బృహత్తర ప్రణాళికకు కేబినేట్ ఆమోదం

Written By:

దేశవ్యాప్తంగా హైవేల నిర్మాణం మరియు అభివృద్ది కోసం నరేంద్ర మోదీ సర్కారు 7 లక్షల కోట్ల రుపాయల బడ్జెట్‌తో భారత్ మాలా అనే ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టుంది. ఐదేళ్ల కాలంలో సుమారుగా 83,677 కిలోమీటర్ల హైవేలను అభివృద్ది చేయనున్నారు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
హైవేల కోసం భారత్ మాలా ప్రాజెక్ట్

రూ. 5.35 లక్షల కోట్లతో తొలిదశలో 2022 లోపు దేశవ్యాప్తంగా 34,800 కిలోమీటర్ల కొత్త హైవేలను నిర్మించనున్నారు. వచ్చే ఐదేళ్లలోపు దేశవ్యాప్తంగా మొత్తం 83,000 కిలోమీటర్ల రహదారుల మరమత్తు మరియు అభివృద్దికి 7 లక్షల కోట్ల రుపాయలతో కేంద్రం రూపొందించిన బృహత్తర ప్రణాళికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Recommended Video
[Telugu] Bajaj Platina Comfortec Launched In India - DriveSpark
హైవేల కోసం భారత్ మాలా ప్రాజెక్ట్

మంగళవారం(24 అక్టోబర్, 2017) నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆర్థిక సలహాదారుడు అశోక్ లవాసా మాట్లాడుతూ, మెరుగైన మౌళిక వనరుల సదుపాయ కల్పనకు దేశవ్యాప్కంగా 9,000 కిలోమీటర్ల ఎకనామిక్ కారిడార్లను నిర్మించనున్నట్లు తెలిపాడు.

హైవేల కోసం భారత్ మాలా ప్రాజెక్ట్

గతంలో ఎన్‌హెచ్‌డీపీ ప్రాజెక్ట్ క్రింద కేంద్రం 50,000 కిలోమీటర్ల రహదారులను నిర్మించింది. ఇప్పుడు 80,000 కిలోమీటర్ల నిర్మాణానికి భారీ నిధులతో భారత్‌మాల ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టిందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. భారత్‌మాల భారతదేశపు రెండవ అతి పెద్ద హైవే నిర్మాణ ప్రాజెక్ట్.

హైవేల కోసం భారత్ మాలా ప్రాజెక్ట్

ఈ ప్రాజెక్టులో భాగంగా దేశం మొత్తం 44 ఎకనామిక్ కారిడర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. వీటిలో ప్రధానంగా ముంబాయ్-కొచ్చి-కన్యాకుమారి, బెంగళూరు-మంగళూరు, హైదరాబాద్-పనాజీ, సబల్‌పూర్-రాంచీ కారిడార్లను నిర్మించనున్నారు.

హైవేల కోసం భారత్ మాలా ప్రాజెక్ట్

భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా 2022 నాటికి హైవేల నిర్మాణం మరియు అభివృద్దితో పాటు వివిధ దశల వారీగా దేశ ఆర్థిక మరియు వాణిజ్య ప్రాంతాలను దేశసరిహద్దులు, అంతర్జాతీయ పోర్టులు, తీర ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ హైవే కారిడార్ల నిర్మాణం మరియు అభివృద్దిని లక్ష్యంగా చేసుకుంది.

హైవేల కోసం భారత్ మాలా ప్రాజెక్ట్

ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తూనే, ఈ ప్రాజెక్ట్ ద్వారా 2022 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న శ్రామికులకు 32 కోట్ల పనిదినాలు కల్పన జరగనుంది. ప్రధాన రహదారుల్లో రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక మౌళిక సదుపాయ కల్పనకు కూడా ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది.

Trending On DriveSpark Telugu:

కొత్త కార్ల రిజిస్ట్రేషన్ నిలిపేసిన సింగపూర్

మహీంద్రా & టాటా లకు మారుతి సుజుకి దిమ్మతిరిగే షాక్

విదేశాల్లో నీరాజనాలు పడుతున్న ఆ కారుకు ఇండియాలో ఘోర పరాభవం

English summary
Read In Telugu: Modi govt approves mega Rs 7-lakh crore project to develop 83,000 km highways in 5 years
Please Wait while comments are loading...

Latest Photos