మారుతిని తీవ్ర నష్టాల్లోకి నెట్టిన ఈ ఏడు కార్ల గురించి మీకు తెలుసా...?

తొలినాళ్లలో మారుతికి కొన్ని కార్లు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. విపణిలో పూర్తి స్థాయిలో నిలదొక్కుకునే క్రమంలో సుమారుగా ఏడు కార్లను అభివద్ది చేసిన మారుతికి తీవ్ర నిరాశ మిగిలింది.

By Anil

ఈ పోటీ ప్రపంచంలో, రాత్రికి రాత్రే అంబానీ అయిపోవడం ఎంత అసాధ్యమో... తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం కూడా అంతే అసాధ్యం. నిజమే, బల్బును కనుగొన్న ఎడిసన్ కూడా ఎన్నో ప్రయోగాల అనంతరమే దానిని కనుగొన్నట్లు కథనాలు ఉన్నాయి.

ఇదంతా అంటుంచి, భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన మారుతి సుజుకి విషయానికి వస్తే. మారుతి కూడా తొలి ఎంట్రీతోనే విజయాన్ని అందుకోలేదు. ఎన్నో ప్రయోగాలు, అపజయాలు, కోలుకోలేని ఎదురు దెబ్బలను రుచిచూసిన తర్వాతే ఇప్పుడు ఈ స్థానానికి ఎదిగింది.

మారుతి సుజుకి ప్లాప్ కార్లు

మారుతి ప్రస్తుతం ఏ కొత్త కారు లాంచ్ చేసినా, దాని సక్సెస్ మారుతి వడిలో ఇట్టే వాలిపోతుందంటే నమ్మండి. అందుకు నిదర్శనం ప్రస్తుతం మారుతి కార్లకు ఉన్న డిమాండ్. అయితే, తొలినాళ్లలో మారుతికి కొన్ని కార్లు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. విపణిలో పూర్తి స్థాయిలో నిలదొక్కుకునే క్రమంలో సుమారుగా ఏడు కార్లను అభివద్ది చేసిన మారుతికి తీవ్ర నిరాశ మిగిలింది.

గతంలో మారుతి వద్ద ఎలాంటి ఫెయిల్యూర్ కార్లు ఉండేటివో... చూద్దాం రండి...

మారుతి సుజుకి ప్లాప్ కార్లు

జెన్ క్లాసిక్

మారుతి సుజుకి స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారును రెట్రో డిజైన్ స్టైల్లో భారీ అంచనాల మధ్య మార్కెట్లోకి లాంచ్ చేసింది. అయితే, మారుతి అనుకున్నంత సేల్స్ జెన్ క్లాసిక్ సాధ్యపడలేదు. శరీరాన్ని మార్చి క్లాసిక్ స్టైల్లో లాంచ్ చేసినప్పటికీ, జెన్ క్లాసిక్ మారుతి నిరాశనే మిగిల్చింది.

Picture credit: Team BHP

మారుతి సుజుకి ప్లాప్ కార్లు

మారుతి వెర్సా

ఆటోమోటివ్ పరిశ్రమలో మారుతి వెర్సా కారును ప్రపంచపు తొలి లగ్జరీ కార్ వ్యాన్‌గా చెప్పవచ్చు. అంతర్జాతీయంగా సుజుకి క్యారీ అనే పేరుతో అమ్ముడయ్యే దీనిని 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌తో వెర్సా పేరుతో లాంచే చేసింది. ఇదే ఇంజన్ మారుతి ఎస్టీమ్ మరియు జిప్సీ కార్లలో కూడా ఇదే ఇంజన్ ఉండేది. అయితే భారీ ధర కారణంగా పెద్ద ఫెయిల్యూర్‌గా నిలిచిపోయింది. ఆ తరువాత కాలంలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఇఎకో పేరుతో పరిచయం చేసింది.

మారుతి సుజుకి ప్లాప్ కార్లు

బాలెనో అల్టారా

బాడీ స్టైల్ ఆధారంగా పాశ్య్చాత కార్ల పరిశ్రమలో ఇలాంటి కార్లను స్టేషన్ వ్యాగన్ అని పిలుస్తారు. ఇండియాలో ఒక్క సంస్థ కూడా ఆశించిన మేర తమ స్టేషన్ వ్యాగన్ కార్లను విక్రయించకలేకపోయాయి. మారుతి సుజుకి డిజైన్, ఫీచర్లు మరియు ఇంజన్ వంటి అంశాల పరంగా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా బాలెనో అల్టారాను లాంచ్ చేసింది. 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చిన ఇది మారుతి పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

Picture credit: bestcarmag

మారుతి సుజుకి ప్లాప్ కార్లు

జెన్ ఎస్టిలొ

జెన్ ఎస్టిలో రాకతో జెన్ కారుకు ఉన్న పేరు మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క విధంగా చెప్పాలంటే జెన్ ఎస్టిలో టాటా నానో జిరాక్స్ అని చెప్పవచ్చు. వ్యాగన్ఆర్ కంటే సరసమైనది కాదు, ఆశించిన మేర ఫీచర్లు రాలేదు. దానికి తోడు, వికృతమైన డిజైన్. ఇలా ఏ ఒక్క విషయంలో కూడా జెన్ ఎస్టిలో కస్టమర్లను మెప్పించలేకపోయింది.

Recommended Video

Tata Tiago XTA AMT Variant Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మారుతి సుజుకి ప్లాప్ కార్లు

ఎ-స్టార్

ఆల్టో పేరుతో అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించబడిన ఎ-స్టార్ మారుతికి మంచి సంపాదన తెచ్చిపెట్టింది. యూరోపియన్ మార్కెట్ ఎ-స్టార్ ఎగుమతికి నెలవుగా మారింది. చూడటానికి పురుగు కన్ను రూపంలో ఉండే ఎ-స్టార్ స్మాల్ క్యాబిన్‌తో బుడ్డ కారుగా పేరుగాంచింది. అయితే, ధర విషయంలో మారుతి ఇంకా ఆలోచించి ఉంటే బాగుండేది. ఏదేమైనప్పటికీ, మారుతి చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్ల జాబితాలో తన స్థానాన్ని పధిలం చేసుకోలేకపోయింది.

మారుతి సుజుకి ప్లాప్ కార్లు

గ్రాండ్ వితారా

మారుతి సుజుకి అంటే సరసమైన ధరలతో, మంచి మైలేజ్‌తో ఫ్యామిలీ కార్లను తయారు చేసే సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఒక్కసారిగా భారీ పరిమాణంలో శక్తివంతమైన ఇంజన్‌తో ఇండియన్ ఎస్‌యూవీ మార్కెట్లోకి గ్రాండ్ వితారా వాహనాన్ని విడుదల చేసి నిండా మునిగిపోయింది.

మారుతి సుజుకి ప్లాప్ కార్లు

20 లక్షలు విలువ చేసే ఇది 2.4-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ మరియు ఎన్నో ఆఫ్ రోడింగ్ లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ, విపణిలో 10 లక్షల ధరల శ్రేణిలో ఉన్న టయోటా మరియు హోండా ఎస్‌యూవీలతో పోటీపడటం మారుతి గ్రాండ్ వితారాకు పరాభవం అని చెప్పాలి.

మారుతి సుజుకి ప్లాప్ కార్లు

మారుతి కిజాషి

కొన్నేళ్ల క్రితం విపణిలోకి కిజాషి విడుదలైనప్పుడు, ఇండియా దిగుమతి చేసుకుంటున్న కార్లలో అత్యుత్తమ విలువ కలిగిన కారుగా గుర్తింపు పొందింది. ఒకానొక సందర్భంలో వోల్వో తో పోటీపడింది. అయితే, కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుండటంతో, పెట్రోల్ బంక్ యజమానులకు తప్పితే, ఇతరులకు సెట్ అవ్వదనే అపవాదాన్ని మూటగట్టుకుంది. 15 లక్షల కన్నా ఎక్కువ ధరతో వచ్చినప్పటికీ, ఇంటర్నేషనల్ మార్కెట్ తరహాలోనే ఇండియాలో కూడా ఇది ఫెయిల్ అయ్యింది.

మారుతి సుజుకి ప్లాప్ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కష్టే ఫలి అన్న నానుడి, ఇప్పుడు మారుతి సుజుకి విషయంలో అక్షరాలా నిజమైందని చెప్పవచ్చు. ఎన్నో ప్రయోగాలు, ఎన్నో ఓటముల అనంతరం ఇప్పుడు తిరుగులేని సంస్థగా అవతరించింది. దేశవ్యాప్తంగా మారుతి కార్ల సేల్స్, అన్ని కార్ల తయారీ సంస్థల మొత్తం సేల్స్‌కు సమానవుతున్నాయంటే... మారుతి ఏ మేరకు పాతుకుపోయిందో తెలుస్తోంది.

కాబట్టి వెంటనే వరించే విజయం మూణ్ణాళ్ల ముచ్చట, ఆలస్యంగా వెతుక్కుంటూ వచ్చే విజయం శాస్వతం అని సింపుల్‌గా చెప్పువచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki’s biggest ever flops
Story first published: Tuesday, September 26, 2017, 16:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X