1 సిరీస్‌కు శాశ్వత వీడ్కోలు పలికిన బిఎమ్‌డబ్ల్యూ

బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్‌ను ఇండియాలో తొలగించింది. బవేరియన్ మోటార్ కంపెనీ తమ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను బిఎమ్‌డబ్ల్యూ ఇండియన్ వైబ్‌సైట్ నుండి శాస్వతంగా తొలగించింది.

By Anil

బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్‌ను ఇండియాలో తొలగించింది. బవేరియన్ మోటార్ కంపెనీ తమ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను బిఎమ్‌డబ్ల్యూ ఇండియన్ వైబ్‌సైట్ నుండి శాస్వతంగా తొలగించింది. ఇప్పుడు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌యూవీ భారత్‌లో తమ ప్రారంభ మోడల్‌గా నిలిచింది.

బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్

జనవరి 2017 లోనే 1 సిరీస్ కార్ల ప్రొడక్షన్‌ను బిఎమ్‌డబ్ల్యూ నిలిపివేసింది, మరియు దీనిని మార్కెట్ నుండి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు 2017 ఆగష్టులో ఓ వార్త వెలువడింది.

బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్

ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ ఇండియాలో ఎనిమిది మోడళ్లను తమ చెన్నై ప్లాంటులో తయారు చేస్తోంది. మరియు బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ మరియు విక్రయాలు ఇప్పుడు శాశ్వతంగా నిలిచిపోయాయి.

Recommended Video

2017 Mercedes-Benz GLC AMG 43 Coupe Launched In India | In Telugu - DriveSpark తెలుగు
బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్

బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ ప్రీమియమ్‌ హ్యాచ్‌బ్యాక్ కారును 2013లో మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ తరువాత 2015లో ఫేస్‌లిఫ్ట్‌లో మళ్లీ విడుదలయ్యింది. బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ 118డి స్పోర్ట్ లైన్ ట్రిమ్ అనే సింగల్ వేరియంట్లో తెలుపు మరియు ఎరుపు రంగు కలర్ ఆప్షన్‌లో మాత్రమే లభించేది.

బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్

సాంకేతికంగా బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్‌ 118డి మోడల్‌లో 2.0-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌ ఉండేది. ఇంజన్ ఉత్పత్తి చేసే 148బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రాలకు సరఫరా అవుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్

1 సిరీస్ శక్తివంతమైన పర్ఫామెన్స్ హ్యాచ్‌బ్యాక్ బిఎమ్‌డబ్ల్యూలోని ఎంట్రీ లెవల్ వేరియంట్‌గా రూ. 31 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరతో అందుబాటులో ఉండేది.

బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ విపణిలో ఉన్న ఒక శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్. అయితే ఈ 1 సిరీస్ 118డి స్పోర్ట్‌లైన్ మోడల్‌కు కస్టమర్ల నుండి ఆశించిన స్పందన లభించకపోవడంతో దీనిని విపణి నుండి తొలగించినట్లు తెలుస్తోంది. 1 సిరీస్ కేవలం ఒక్క వేరియంట్లో మాత్రమే లభించడంతోనే సక్సెస్ కాలేదని తెలుస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu: BMW Discontinues 1 Series Premium Hatchback In India
Story first published: Monday, September 18, 2017, 18:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X