బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ 330ఐ విడుదల: ప్రారంభ ధర రూ. 42.4 లక్షలు

Written By:

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా విభాగం తమ 330ఐ లగ్జరీ సెడాన్ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. డీజల్ కార్లకు ప్రత్యామ్నాయంగా పెట్రోల్ కార్లను ఎంచుకుంటున్న తరుణంలో తమ 3-సిరీస్ సెడాన్ కారును పెట్రోల్ వేరియంట్లలో విడుదల చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ 330ఐ పెట్రోల్ వేరియంట్ విడుదల

పెట్రోల్ వేరియంట్లో విడుదలైన 3-సిరీస్ 330ఐ లగ్జరీ సెడాన్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి, స్పోర్ట్ లైన్ మరియు ఎమ్ స్పోర్ట్, వీటి ధరలు వరుసగా రూ. 42.4 లక్షలు మరియు 44.9 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ 330ఐ పెట్రోల్ వేరియంట్ విడుదల

సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 330ఐ 3-సిరీస్‌ పెట్రోల్ వేరియంట్లో 2.0-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ కలదు. స్పోర్ట్ లైన్ మరియు ఎమ్ స్పోర్ట్ రెండింటిలో కూడా ఇదే ఇంజన్ అందివ్వడం జరిగింది.

బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ 330ఐ పెట్రోల్ వేరియంట్ విడుదల

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 5,200ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 248బిహెచ్‌పి పవర్ మరియు 1,450-4,800ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 350ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ 330ఐ పెట్రోల్ వేరియంట్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ తమ 3-సిరీస్ పెట్రోల్ మోడల్‌లో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అందించింది. ఇది పవర్ మరియు టార్క్ రియర్ వీల్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రాలకు సరఫరా అవుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ 330ఐ పెట్రోల్ వేరియంట్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 330ఐ కేవలం 5.8 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు ఇది లీటర్‌కు 16.05కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదని బిఎమ్‌డబ్ల్యూ పేర్కొంది.

బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ 330ఐ పెట్రోల్ వేరియంట్ విడుదల

330ఐ లోని రెండు వేరియంట్లు డిజైన్ మరియు ష్టైలింగ్ పరంగా విభిన్నంగా ఉంటాయి. బిఎమ్‌డబ్ల్యూ 330ఐ స్పోర్ట్ లైన్ వేరియంట్లో ఎరుపు రంగు దారంతో కుట్టబడిన లెథర్ తొడుగు గల స్టీరింగ్ వీల్ మరియు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ 330ఐ పెట్రోల్ వేరియంట్ విడుదల

ఇక బిఎమ్‌డబ్ల్యూ 330ఐ లోని ఎమ్ స్పోర్ట్ వేరియంట్ ఫ్రంట్ గ్రిల్ మీద ఎమ్ బ్యాడ్జింగ్ కలదు. 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ గల ఈ వేరియంట్లోని స్టీరింగ్ వీల్ లెథర్ తొడుగుతో లభిస్తుంది. ఇందులో పార్కింగ్ సెన్సార్లు మరియు కెమెరాలతో పాటు ఫుల్ కలర్ హెడ్స్ అప్ డిస్ల్పే కలదు.

బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ 330ఐ పెట్రోల్ వేరియంట్ విడుదల

పెట్రోల్ వేరియంట్ బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ 330ఐ స్పోర్ట్ లైన్ వేరియంట్ మూడు విభిన్న రంగుల్లో లభించును. అవి,

  • ఆల్పైన్ వైట్,
  • బ్లాక్ సఫైర్
  • మెడిటెర్రేనియన్ బ్లూ.
బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ 330ఐ పెట్రోల్ వేరియంట్ విడుదల

ఇదే బిఎమ్‌డబ్ల్యూ 330ఐ లోని ఎమ్ స్పోర్ట్ వేరియంట్ కేవలం ఆల్పైన్ వైట్ మరియు బ్లాక్ సఫైర్ రంగుల్లో మాత్రమే లభించును.

English summary
Read In Telugu BMW 330i Launched In India; Prices Start At Rs 42.4 Lakh
Story first published: Monday, May 15, 2017, 17:57 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark