బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్ ఎస్‌యూవీ విడుదల: ధర రూ. 35.75 లక్షలు

Written By:

జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ తమ ఎక్స్1 ఎస్‌యూవీని పెట్రోల్ వేరియంట్లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ ఎక్స్1 పెట్రోల్ వేరియంట్ మిడ్ లెవల్ ఎక్స్‌లైన్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఎక్స్1 పెట్రోల్ ధర, ఇంజన్ మరియు ఇతర వివరాలు....

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్ ఎస్‌యూవీ

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్ మోడల్ ధర రూ. 35.75 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. ఈ ధర డీజల్ వేరియంట్ ఎక్స్1 ధరకు చాలా దగ్గరగా ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్ ఎస్‌యూవీ

2016 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్‌ను ఎస్‌డ్రైవ్20ఐ బ్యాడ్జి పేరుతో ఖాయం చేసింది. తరువాత ఇందులో 2.0-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ అందించింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్ ఎస్‌యూవీ

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 188బిహెచ్‌పి పవర్ మరియు 280ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసింది. ఈ ఇంజన్‌కు అనుసంధానం చేసిన 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ చక్రాలకు సరఫరా అవుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్ ఎస్‌యూవీ

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్ మోడల్ ఎస్‌యూవీ కేవలం 7.7 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు ఇది లీటర్‌కు 16.30కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్ ఎస్‌యూవీ

డిజైన్ విషయానికి వస్తే, బిఎమ్‌డూబ్ల్యూ ఎక్స్1 ఎక్స్‌లైన్ వేరియంట్‌లో అండర్ రైడ్ ప్రొటెక్షన్ కోసం మ్యాట్ ఫినిషింగ్ గల సిల్వర్ బంపర్ కలదు. 14 స్లాట్లతో డిజైన్ చేసి కిడ్నీ గ్రిల్, మరియు పెద్ద పరిమాణంలో ఉన్న బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్ గల ఎయిర్ ఇంటేకర్ కలదు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్ ఎస్‌యూవీ

బిఎమ్‌డబ్ల్యూ హోదాను తెలిపే విధంగా ఎక్స్1 ఎస్‌యూవీ ప్రక్కవైపుల డోర్ల వద్ద మరియు డోర్ హ్యాండిల్స్ మీద అల్యూమినియం సొబగులను అందివ్వడం జరిగింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్ ఎస్‌యూవీ

ఎక్స్1 రియర్‌ డిజైన్‌లో అండర్ బాడీ ప్రొటెక్షన్ కోసం బ్లాక్ మరియు సిల్వర్ మ్యాట్ బంపర్ కలదు, బంపర్‌లోని క్రోమ్ భాగంలో రెండు ఎగ్జాస్ట్ గొట్టాలను అందించారు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్ ఎస్‌యూవీ

ఇంటీరియర్‌ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 2-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్యానరోమా గ్లాస్ రూఫ్, ముందు మరియు వెనుక డోర్ల వద్ద ఫుట్ వెల్ లైట్లు కలవు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్ ఎస్‌యూవీ

ఇంస్ట్రుమెంట్ ప్యానల్‌లో ఆరేంజ్ లేజా వైట్ కలర్‌ లైటింగ్‌ను ఎంచుకునేందుకు ఆంబియంట్ లైటింగ్ సిస్టమ్ కలదు. అదనంగా క్రోమ్ ఫినిషింగ్ మరియు ఎరుపు, నలుపు దారంతో కుట్టబడిన లెథర్ తొడుగుతో మల్టీ ఫంక్షన్ స్పోర్ట్ స్టీరింగ్ వీల్ కలదు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్ ఎస్‌యూవీ

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎక్స్‌లైన్‌లో బ్లూటూత్ కనెక్టివిటి మరియు రియర్ వ్యూవ్ కెమెరాను సపోర్ట్ చేయగల 16.5సె.మీ డిస్ల్పే ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్ ఎస్‌యూవీ

భద్రత పరంగా సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1లో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటి కంట్రోల్, మరియు డైనమిక్ ట్రాక్షన్ కంట్రల్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 పెట్రోల్ ఎస్‌యూవీ

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎక్స్‌లైన్ ఐదు విభిన్న రంగుల్లో లభించును. అవి,

  • ఆల్పైన్ వైట్,
  • బ్లాక్ సఫైర్,
  • స్పార్కిలింగ్ బ్రౌన్,
  • మెడిటెర్రేనియన్ బ్లూ,
  • చెస్ట్‌‌నట్ బ్రాంజ్.
English summary
Read In Telugu BMW X1 Petrol Model Launched In India; Priced At Rs 35.75 Lakh
Story first published: Tuesday, May 16, 2017, 11:10 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark