కార్లు మరియు ఎస్‌యూవీల బంపర్లను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం

దేశవ్యాప్తంగా కార్లు, ఎస్‌యూవీలు మరియు వ్యాన్‌ల ముందు స్టీల్ బంపర్లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు, భారత జాతీయ రహదారులు మరియు రవాణా మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల రవాణా శాఖ కమీషనర్లకు ఉత్తర్వుల

By Anil

దేశవ్యాప్తంగా కార్లు, ఎస్‌యూవీలు మరియు వ్యాన్‌ల ముందు స్టీల్ బంపర్లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు, భారత జాతీయ రహదారులు మరియు రవాణా మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల రవాణా శాఖ కమీషనర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.

కార్లు మరియు ఎస్‌యూవీల బంపర్లు బ్యాన్ చేసిన ప్రభుత్వం

ఎస్‌యూవీలు, కార్లు మరియు వ్యాన్‌లకు ముందు వైపు ఉండే క్రాష్ గార్డులు(బుల్ బార్స్) అనధికారం. ప్రభుత్వ నిభందన మేరకు అందరూ వాటిని తొలగించాల్సి ఉంటుంది. కేంద్ర రవాణా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వెనకున్న అసలు కారణమేంటో చూద్దాం రండి...

కార్లు మరియు ఎస్‌యూవీల బంపర్లు బ్యాన్ చేసిన ప్రభుత్వం

మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 52 ప్రకారం, వాహనాల మీద అనధికారికంగా క్రాష్ గార్డులు/బంపర్లు/బుల్ బార్లను అమర్చుకున్న వారిని హెచ్చరించడం మరియు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సంభందిత అధికారులకు సూచించింది.

Recommended Video

Tata Motors Delivers First Batch Of Tigor EV To EESL - DriveSpark
కార్లు మరియు ఎస్‌యూవీల బంపర్లు బ్యాన్ చేసిన ప్రభుత్వం

ఫోర్ వీలర్ బంపర్ల గురించి కొత్త రూల్ అమల్లోకి రావడంతో ఇక మీదట వెహికల్స్ బంపర్లు కలిగి ఉండటం చట్ట విరుద్దం. ఇలాంటి వారి మీద, మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 190 మరియు 191 కింద జరిమానా కూడా విధించవచ్చు.

కార్లు మరియు ఎస్‌యూవీల బంపర్లు బ్యాన్ చేసిన ప్రభుత్వం

ప్రమాదం జరిగినపుడు తమ వెహికల్ ఎక్కువ డ్యామేజ్ కాకూడదనే ఉద్దేశ్యంతో చాలా మంది వెహికల్ ఓనర్లు తమ వాహనాలకు ముందువైపున ఇలాంటి బంపర్లను అమర్చుకుంటారు. మరికొంత మంది అయితే, మంచి లుక్ కోసం ఇలాంటి బంపర్లను ఇన్‌స్టాల్ చేయిస్తారు.

కార్లు మరియు ఎస్‌యూవీల బంపర్లు బ్యాన్ చేసిన ప్రభుత్వం

మార్కెట్లో లభించే క్రాష్ గార్డ్స్ లేదా బుల్ బార్స్‌ను వెహికల్ ఫ్రేమ్ లేదా ఛాసిస్ మీద ఫిక్స్ చేస్తారు. ఇలా చేయడంతో ప్రమాదం జరిగినపుడు ప్రమాద తీవ్రత ప్రయాణికులకు వరకు చేరకుండా ఉంటుంది. మరియు చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగినపుడు వెహికల్ ఎలాంటి డ్యామేజ్‌ కాకుండా కాపాడుతుంది.

క్రాష్ గార్డ్స్ ప్రయోజనాలు ఇవీ... మరి క్రాష్ గార్డ్స్ వాడటం ద్వారా ఉన్న అప్రయోజనాలేంటో చూద్దాం రండి...

కార్లు మరియు ఎస్‌యూవీల బంపర్లు బ్యాన్ చేసిన ప్రభుత్వం

బంపర్ క్రాష్ గార్జ్స్ మరియు ఎయిర్ బ్యాగులు

వెహికల్స్ ముందు వైపున క్రాష్ గార్డ్స్ అమర్చుకోవడంతో ప్రమాదం జరిగినా దాని తీవ్రత బంపర్ మీద పడుతుంది. అయితే, ప్రమాద తీవ్రత కారు బాడీ మీద పడినప్పుడే వెహికల్‌ లోపల ఎయిర్ విచ్చుకుంటాయి. ఈ సమయంలో కారులో ప్రయాణికులు ముందువైపుకు గుద్దుకోవడంతో గాయాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి క్రాష్ గార్డ్స్ వాడితే ఎయిర్ బ్యాగులు సమయానికి ఓపెన్ అవ్వవు.

కార్లు మరియు ఎస్‌యూవీల బంపర్లు బ్యాన్ చేసిన ప్రభుత్వం

క్రంపల్ జోన్స్ మీద ప్రభావం

వెహికల్ ఫ్రేమ్‌ను మీదున్న జాయింట్లను క్రంపల్ జోన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ క్రాష్ గార్డులను ఛాసిస్ లేదా ఫ్రేమ్ మీద అమర్చడంతో ప్రమాదం జరిగినపుడు ఆ తీవ్రత క్రాష్ గార్డ్స్ నుండి ఫ్రేమ్‌లోని జాయింట్ల మీద పడుతుంది.

సాధారణంగా వెహికల్‌కు ముందు లేదా వెనుక వైపు నుండి యాక్సిడెంట్ జరిగితే, ఆ ప్రమాద తీవ్రత డ్రైవర్ మరియు ప్రయాణికుల వరకు చేరకుండా క్రంపల్ జోన్స్ తీసుకుంటాయి. అయితే క్రాష్ గార్డ్స్ ద్వారా ఫ్రేమ్‌లోని క్రంపల్ జోన్స్ వీక్ అయిపోతాయి. ప్రమాదం జరిగినపుడు దాని తీవ్రత ఒకేసారి ప్రయాణికుల మీద పడుతుంది.

కార్లు మరియు ఎస్‌యూవీల బంపర్లు బ్యాన్ చేసిన ప్రభుత్వం

పాదచారుల మీద వెహికల్ క్రాష్ గార్డ్స్ ప్రభావం

క్రాష్ గార్డ్స్ ఉన్న వెహికల్స్ పాదచారులను ఢీకొన్నపుడు వారి మీద ప్రమాద తీవ్రత అధికంగా ఉంటుంది. తీవ్ర గాయాలతో పాటు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. ఆధునిక కార్లు పాదచారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయబడ్డాయి. ఓ మోస్తారు వేగంలో ఉన్నపుడు పాదచారులను ఢీకొడితో ఆ డిజైన్ వలన వారి మీద ప్రమాద తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది.

కార్లు మరియు ఎస్‌యూవీల బంపర్లు బ్యాన్ చేసిన ప్రభుత్వం

మైలేజ్ తగ్గిపోవడం

వెహికల్స్ ముందు భాగంలో ఉపయోగించే క్రాష్ గార్డ్స్ వలన వెహికల్ బరువు గణనీయంగా పెరిగిపోతుంది. ఒక్కోసారి ఈ క్రాష్ గార్డ్స్ బరువు 50కిలోల వరకు ఉంటుంది. ఈ బరువు మొత్తం వెహికల్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపి మైలేజ్ తగ్గిపోవడానికి కారణమవుతుంది.

కార్లు మరియు ఎస్‌యూవీల బంపర్లు బ్యాన్ చేసిన ప్రభుత్వం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎస్‌యూవీల మరియు వ్యాన్ల ముందర క్రాష్ గార్డ్స్ మరియు బుల్ బార్స్ ఫిక్స్ చేస్తే వెహికల్స్‌కి భలే లుక్ వస్తుంది. కానీ, వాటిని ఉపయోగించడం ద్వారా ఎన్ని అప్రయోజనాలున్నాయో చూశాం కదా... కాబట్టి మనకు లుక్ ఇపార్టెంట్ కాదు అన్ని వేళలా మన సేఫ్టీ, కార్ హెల్త్ ముఖ్యం.

ఇంతకు ముందులా... కార్ క్రాష్ గార్డ్స్ వినియోగించడం ఇప్పుడు ఏ మాత్రం లీగల్ కాదు. క్రాష్ గార్డ్స్‌తో పోలీసులకు లేదా ఆర్‌టిఓ అధికారులకు చిక్కారనుకోండి జరిమానా సమర్పించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ వెహికల్స్‌లో ఇలాంటివి ఉంటే వెంటనే తొలగించుకోండి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Indian Government Bans Car & SUV Crash Guard — Disadvantages Of The Macho Looking Accessory
Story first published: Monday, December 18, 2017, 16:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X