Just In
- 8 min ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్‌యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 1 hr ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 1 hr ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
- 2 hrs ago
హ్యుందాయ్ క్రెటా రికార్డ్: భారత రోడ్లపై 5 లక్షల మంది హ్యాపీ కస్టమర్స్!
Don't Miss
- News
సీరం సంస్థలో అగ్ని ప్రమాదం .. కోవిషీల్డ్ వ్యాక్సిన్ స్టాక్ సేఫ్ .. ప్రాణాలు కాపాడటమే ముఖ్యమన్న సీరం సిఈవో
- Finance
భారీగా ఎగిసి, అంతలోనే పతనం: 50,000 పాయింట్లను నిలుపుకోని సెన్సెక్స్
- Movies
మెగా అభిమానులు బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన మెగాస్టార్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Sports
హైదరాబాద్ చేరుకోగానే.. తండ్రి సమాధి దగ్గరకు వెళ్లిన సిరాజ్!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2017లో భారత్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలికిన కార్లు
2017 సంవత్సరం భారత వాహన పరిశ్రమను ఎన్నో ఆటు పోట్లకు గురి చేసింది. ఇండియన్ మార్కెట్ ఊహించని కార్లు మరియు బైకులు విడుదలైతే, మరి కొన్ని ఆటోమొబైల్ ట్రెండ్స్‌నే మార్చేశాయి. వీటి మధ్య భారత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు వాహన పరిశ్రమను అతలాకుతలం చేసింది.
ఎన్ని మార్పులు సంభవించినా... ప్రతి ఆటోమొబైల్ ప్రేమికుడు మాట్లాడుకునే అంశాలు రెండే... బాగా సక్సెస్ సాధించిన బైకులు మరియు కార్ల గురించి...? కానీ ఎంతో కాలం శ్రమించి, వ్యయప్రయాసలతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు రూపొందించిన మోడళ్లు ఆదిలోనే ఫెయిల్యూర్‌గా నిలిచి మార్కెట్‌కు శాశ్వతంగా దూరమయ్యాయి. 2017లో ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్ నుండి శాశ్వతంగా వైదొలగిన కార్లు గురించి ప్రత్యేక కథనం...

మారుతి సుజుకి రిట్జ్
మారుతి సుజుకి రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ కారును 2009లో మార్కెట్లోకి పరిచయం చేసింది. తరువాత విపణిలో బెస్ట్ సెల్లింగ్ కారుగా ఉన్న స్విఫ్ట్‌గా అత్యుత్తమ ప్రత్యామ్నాయ ఎంపికగా నిలిచింది. ఇది విడుదలైన రోజుల్లో మారుతి మంచి సేల్స్ సాధించిపెట్టింది.


అయితే, కాలం ముందుకెళ్లేకొద్దీ రిట్జ్ డిజైన్‌కు వయసైపోవడంతో సేల్స్ కాస్త నెమ్మదించాయి. ఎనిమిదేళ్ల తరువాత రిట్జ్ కారును శాశ్వతంగా మార్కెట్ నుండి తొలగించింది.

హ్యుందాయ్ ఐ10
దక్షిణ కొరియా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ కారును 2007లో తొలిసారి విడుదల చేసింది. తరువాత 2013లో గ్రాండ్ ఐ10 కారును లాంచ్ చేసింది. అప్పటికే అమ్మకాల్లో ఉన్న ఐ10 స్థానాన్ని గ్రాండ్ 10 భర్తీ చేస్తుందని అందరూ భావించారు. కానీ, రెండింటిని వేర్వేరు మోడళ్లుగా విక్రయించింది.

ఐ10 ఎంట్రీ లెవల్ స్మాల్ హ్యాచ్‍బ్యాక్ మీద రోజురోజుకీ డిమాండ్ తగ్గిపోవడంతో, మార్చి 2017లో విపణి నుండి పూర్తిగా తొలగించాలని హ్యుందాయ్ నిర్ణయం తీసుకుంది.

రెనో పల్స్
ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో ప్యాసన్ ఫర్ లైఫ్ అనే ట్యాగ్ లైన్‌తో ఫ్రెంచ్ స్టైల్ మోడళ్లను ఇండియన్ మార్కెట్లో పరిచయం చేస్తూ వచ్చింది. అయితే, ఇండియన్ కస్టమర్ల అభిరుచి చాలా భిన్నమని తెలుసుకొని ఆశించిన ఫలితాలు సాధించని మోడళ్లను లైనప్ నుండి తొలగిస్తూ వచ్చింది. అందులో ఒకటి రెనో పల్స్ హ్యాచ్బ్యాక్.

నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ డిజైన్ ప్రేరణతో 2012 పల్స్ కారును రెనో తొలిసారిగా లాంచ్ చేసింది. అయితే కస్టమర్ల దృష్టిని ఆకర్షించడంలో విఫలమైన పల్స్ మోడల్‌ను 2017లో రెనో మార్కెట్ నుండి దూరం చేసింది.
Trending On DriveSpark Telugu:
స్విఫ్ట్ శకానికి ముగింపు పలికిన మారుతి సుజుకి
2017లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన బెస్ట్ కార్లు
2017లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన స్కూటర్లు మరియు బైకులు

షెవర్లే బీట్
2017లోని అతి పెద్ద ఆటోమొబైల్ న్యూస్‌లో జనరల్ మోటార్స్ ఒకటి. అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం జనరల్ మోటార్స్ దేశీయంగా షెవర్లే పేరుతో కార్యకలాపాలు సాగించేది. జనరల్ మోటార్స్ ఆశించిన ఫలితాల సాధనలో షెవర్లే విఫలం చెందడంతో దేశీయ మార్కెట్ నుండి వైదొలగింది. ఈ నిర్ణయంతో షెవర్లే విక్రయించే మోడళ్లు కూడా మార్కెట్‌కు దూరమయ్యాయి.

షెవర్లే ఇండియన్ మార్కెట్‌కు దూరం చేసిన కార్లలో బీట్ హ్యాచ్‌బ్యాక్ ఒకటి. 2010లో లాంచ్ అయిన బీట్ ఎంతో మంది ఇండియన్స్‌కు ఒక ఫేవరెట్ మోడల్‌గా నిలిచింది. బీట్ ఎన్ని విక్రయాలు సాధించినా ఒక్క మోడల్‌తోనే కంపెనీ మొత్తాన్ని నెట్టుకురావడం సాధ్యం కాదు కాబట్టి షెవర్లే బీట్ 2017లో భారత్‌కు వీడ్కోలు పలికింది.

రెనో స్కాలా
పల్స్ హ్యాచ్‌బ్యాక్‌తో పాటు స్కాలా సెడాన్‌ను కూడా మార్కెట్ నుండి తొలగించింది. నిస్సాన్ సన్నీ ఆధారంగా రెనో అభివృద్ది చేసిన స్కాలా సెడాన్ కారును 2012లో విపణలోకి ప్రవేశపెట్టింది. పల్స్ తరహాలోనే స్కాలా రెనో ఇండియాకు పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో, అక్టోబర్ 2017లో మార్కెట్ నుండి తొలగించింది.

నిస్సాన్ సన్నీలోని అవే సాంకేతిక అంశాలతో, డిఫరెంట్ ఎక్ట్సీరియర్ డిజైన్ స్టైల్లో వచ్చినప్పటికీ, కనీసం నిస్సాన్ సన్నీ తరహా ఫలితాలు సాధించలేకపోయింది. పాత డిజైన్ పద్దతులతో అభివృద్ది చేసిన పల్స్ మరియు స్కాలా కార్లను ఒకేసారి మార్కెట్‌కు దూరం చేసింది.

షెవర్లే క్రుజ్
షెవర్లే ఇండియన్ మార్కెట్లోకి అత్యంత శక్తివంతమైన క్రుజ్ సెడాన్ కారును 2009లో లాంచ్ చేసింది. అప్పటి నుండి షెవర్లే ఇందులో డిజైన్, ఇంజన్ మరియు ఫీచర్ల పరంగా పలుమార్లు అప్‌డేట్స్ చేసింది.

ధరకు తగ్గ విలువలతో, పెద్ద పరిమాణంలో ఉన్న మోస్ట్ పవర్‌ఫుల్ సెడాన్ కారుగా పేరుగడించింది. ఆటోమొబైల్ ఔత్సాహికుల్లో పర్ఫామెన్స్ కార్ల పరంగా షెవర్లే క్రుజ్ పాపులర్ మోడల్‌గా నిలిచింది. అయితే, షెవర్లే ఇండియన్ మార్కెట్‌కు గుడ్ బై చెప్పినపుడు క్రుజ్ మోడల్‌ను కూడా తనవెంట తీసుకెళ్లిపోయింది.

స్కోడా యెటి
చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన స్కోడా ఆటో తమ తొలి ఎస్‌యూవీని యెటి పేరుతో 2010లో లాంచ్ చేసింది. అత్యుత్తమ ఆఫ్ రోడింగ్ లక్షణాలతో ధరకు తగ్గ విలువలతో ప్రవేశపెట్టింది. అయితే, దేశీయంగా మంచి సేల్స్ సాధించడంలో విఫలం చెందింది.

స్కోడా యెటి మన మార్కెట్లో ఫెయిల్ అవ్వడానికి గల ప్రదాన కారణం, యెటి ఎస్‌యూవీ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. ధరకు దాని పరిమాణానికి ఎలాంటి పొందన ఉండదు. మరో ప్రయత్నంగా ఒకసారి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసినా లాభం లేకపోవడంతో, మే 2017లో మార్కెట్ నుండి తొలగించింది.

రెనో కొలియోస్
రెనో ఇండియా కొలియోస్ ప్రీమియమ్ ఎస్‌యూవీని 2011లో భారీ అంచనాలతో ప్రవేశపెట్టింది. దిగుమతి చేసుకుని విక్రయించిన ఈ కొలియోస్ ఎస్‌యూవీ ధర 20 లక్షలకు పైబడి ఉండటంతో ఆశించిన సేల్స్ సాధించలేకపోయింది.

చూడటానికి పెద్దగా ఉన్నప్పటికీ, చెల్లించిన ధరకు వ్యాల్యూ చేయకపోవడం, ఇదే ధరల శ్రేణిలో ఇతర మోడళ్ల నుండి పోటీ తీవ్రమవ్వడంతో చేసేదిలేక 2017లో పల్స్ మరియు స్కాలా కార్లతో కొలియోస్ ఎస్‌యూవీని కూడా తొలగించింది.

హ్యుందాయా శాంటా ఫి
హ్యుందాయ్ మోటార్స్ అత్యంత ఖరీదైన ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా శాంటా ఫి ఎస్‌యూవీని 2010లో లాంచ్ చేసింది. ఆ తరువాత 2014లో అప్‌డేటెడ్ వెర్షన్ శాంటా ఫి ఎస్‌యూవీని రీలాంచ్ చేసింది.

30 లక్షల ధరల శ్రేణిలో ఉండటంతో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఎన్నో మోడ్రన్ ఎస్‌యూవీలతో పోటీని ఎదుర్కోలేకపోయింది. డిజైన్ పాతదైపోవడం మరియు సేల్స్ భారీగా పతనమవ్వడంతో ఏట్టకేలకు 2017లో మార్కెట్ నుండి తొలగించింది.

టాటా సఫారీ డైకార్
దేశీయ విభిన్న వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ 1998లో లాంచ్ చేసిన సఫారీ ఎస్‌యూవీని 2017లో మార్కెట్ నుండి తొలగించింది. 1998 నుండి 2017 వరకు ఆటోమొబైల్ ట్రెండ్స్ మరియు కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ చేస్తూ వచ్చింది.

టాటా మోటార్స్ సఫారీ స్టార్మ్ వాహనాన్ని 2012లో విడుదల చేసినప్పటికీ, పాత మోడల్ 2017 వరకు మార్కెట్లోనే ఉంది. అయితే, 2018 నుండి కొత్త ఎస్‌యూవీలను ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో పాత మోడళ్ల ప్రక్షాలనలో భాగంగా సఫారీ డైకార్ ఎస్‌యూవీని తమ లైనప్‌ను తొలగించింది.

హోండా మొబీలియో
జపాన్ దిగ్గజం హోండా మోటార్స్ తమ తొలి ఎమ్‌పీవీ వాహనాన్ని 2014లో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. భారీ అంచనాలతో వచ్చిన 7-సీటర్ వెహికల్ క్లిక్ అవ్వలేదు. డిజైన్, ఎంట్రీ లెవల్ వేరియంట్లో కనీస ఫీచర్లు లేకపోవడం మరియు టయోటా, మారుతి నుండి పోటీ తీవ్రమవ్వడంతో ఫెయిల్ అయ్యింది.

సేల్స్ చాలా దారుణంగా నమోదవ్వడంతో జూలై 2017లో మొబీలియో ఎమ్‌పీవీని మార్కెట్ నుండి తొలగించడం తప్పలేదు. హోండా కొత్తగా ప్రవేశపెట్టాలని భావించిన మోడళ్ల కోసం మార్గం సుగమం చేసేందుకు విడుదలైన అనతి కాలంలోనే మార్కెట్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలికింది.

ఇతర మోడళ్లు
ఇంత వరకు సేల్స్ లభించనందుకు మార్కెట్ నుండి తొలగించబడిన కార్లను చూశాం. కానీ, ఈ కార్లు మాత్రమే, అప్‌డేటెడ్ వెర్షన్‌లో విడుదలయ్యేందుకు అదేపనిగా తప్పుకున్నాయి. అందులో కొత్త తరం డిజైర్ కోసం స్విఫ్ట్ డిజైర్ మరియు థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ కోసం ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ మార్కెట్ నుండి నిష్క్రమించాయి.
Trending DriveSpark Telugu YouTube Videos