డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచమిస్తున్నారా...? ఇక ముందు సులభంగా లభించనున్న డ్రైవింగ్ లైసెన్స్

Written By:

పచ్చనోటు చూపించందే పనులు జరగవు అని భాదపడేవారు చాలా మంది ఉంటారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ మరియు వెహికల్ రిజిస్ట్రేషన్ పనులయితే ఈ విషయంలో చెప్పాల్సిన పనే లేదు. అయితే కేంద్రం ఇప్పుడు నూతన ఆన్‌లైన్ సిస్టమ్ ప్రవేశపెట్టింది.

వెహికల్ రిజిస్ట్రేషన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియకు నూతన విధానం

వాహన రిజిస్ట్రేషన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు అదే విధంగా అవినీతిని అదుపులోకి తెచ్చేందుకు ఈ నూతన ఆన్‌లైన్ వ్యవస్థను కేంద్రం ప్రారంభించింది.

వెహికల్ రిజిస్ట్రేషన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియకు నూతన విధానం

లెర్నర్ లైసెన్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ జారీ ద్వారా జరుగుతున్న అవినీతిని రూపుమాపేందుకు వాహనం చట్టంలోకి రెండు కొత్త వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చాము. అవి వాహన్ 4.0 మరియు సారథి 4.0. వినియోగదారులు ఆయా పనులకు గాను ధరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.

వాహన్ 4.0 అంటే ఏమిటి ?

వాహన్ 4.0 అంటే ఏమిటి ?

రవాణా శాఖలో ప్రధానమైన విభాగం వాహనాలకు సంభందించిన కార్యకలాపాలు నిర్వహించడం, ఇందులో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంభందించిన పనులు జరుగుతాయి.

సారథి 4.0 అనగా...

సారథి 4.0 అనగా...

కేంద్రం ప్రారంభించిన సారథి 4.0 వెబ్‌సైట్ ఆధారంగా వినియోగదారులు తమ లెర్నర్ లైసెన్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ జారీతో పాటు లైసెన్స్ రెన్యువల్ వంటి కార్యకలాపాలు జరుగుతాయి.

వెహికల్ రిజిస్ట్రేషన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియకు నూతన విధానం

నూతన వాహనాల రిజిస్ట్రేషన్ మరియు లెర్నర్ లైసెన్స్ అదే విధంగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను సరళతరం చేస్తూ, అదే విధంగా డిజిటైజేషన్‌ భాగస్వామ్యంతో వాహన్4.0 మరియు సారథి 4.0 లను ప్రారంభించినట్లు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రి పొన్ రాధాకృష్ణన్ లోక్ సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

వెహికల్ రిజిస్ట్రేషన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియకు నూతన విధానం

మంత్రి మాట్లాడుతూ, 85 రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులను వాహన్ 4.0 మరియు 235 రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులను సారథి 4.0 కేంద్రీకృత వేదిక క్రిందకు తెచ్చినట్లు పేర్కొన్నారు.

వెహికల్ రిజిస్ట్రేషన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియకు నూతన విధానం

అయితే వాహనాల ఫిట్‌మెంస్ సర్టిఫికేట్లను మాత్రం ఆ యా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని తమ పరధిలోకి వచ్చే రవాణా శాఖ కార్యాలయాల నుండి పొందవచ్చని మంత్రి తెలిపారు.

వెహికల్ రిజిస్ట్రేషన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియకు నూతన విధానం

కేంద్ర రహదారి నిధుల చట్టం ప్రకారం, రాష్ట్ర రహదారుల భద్రత పెంపొందించేందుకు గాను కేంద్ర రహదారి నిధి నుండి 10 శాతం నిధులను అందించే విధంగా సవరణ చేసినట్లు తెలిపాడు.

వెహికల్ రిజిస్ట్రేషన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియకు నూతన విధానం

ఈ సిఆర్ఎఫ్ చట్ట సవరణ ప్రకారం 2017-2018 ఏడాదికి గాను రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని రహదారుల భద్రత కోసం సుమారుగా 720 కోట్ల వరకు సమకూరుతున్నట్లు అంచనా...

English summary
Centre Openup Online Tools For Vehicle Registration Driving Licence
Story first published: Monday, March 27, 2017, 10:34 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark