షెవర్లే బీట్, ఎసెన్షియా ఇండియాలోనే తయారవుతాయి, కానీ ఇండియన్ మార్కెట్ కోసం కాదు

Written By:

ఇండియన్ మార్కెట్ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సంగతి విధితమే, అతి విక్రయాలు నమోమదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కార్ల తయారీ మీద తీవ్ర ప్రభావం చూపింది.

షెవర్లే బీట్, ఎసెన్షియా ఇండియాలోనే తయారవుతాయి

అయితే తరువాత తరం షెవర్లే బీట్ హ్యాచ్‌బ్యాక్ మరియు షెవర్లే ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్‌లను కొనుగోలు చేయడానికి ఎదురుచూసిన వారికి మరో చేదు వార్త. ఏమిటంటే, తాము ఈ రెండింటిని ఇండియాలోనే ఉత్పత్తి చేసినా, ఇండియన్ మార్కెట్ కోసం కాదని షెవర్లే తెలిపింది.

షెవర్లే బీట్, ఎసెన్షియా ఇండియాలోనే తయారవుతాయి

బీట్ హ్యాచ్‌బ్యాక్ ఆధారిత క్రాసోవర్ మోడల్ బీట్ ఆక్టివ్‌ను కూడా దేశీయంగా ఉత్పత్తి చేయనుంది. ఇలా ఇండియాలో తయారయ్యే వాటిని విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయనుంది షెవర్లే.

షెవర్లే బీట్, ఎసెన్షియా ఇండియాలోనే తయారవుతాయి

షెవర్లే బీట్ ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్‌ను తొలుత 2016 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద ఆవిష్కరించింది. నిజానికి ఇది విపణిలోకి వచ్చి ఉంటే షెవర్లే మార్కెట్ వాటాను కాస్తంతయినా పెంచే అవకాశం ఉండేది.

షెవర్లే బీట్, ఎసెన్షియా ఇండియాలోనే తయారవుతాయి

మహారాష్ట్రలోని తలెగావ్ ప్రొడక్షన్ ప్లాంటులో షెవర్లే తయారు చేసే కార్లను మెక్సికో, దక్షిణ మరియు మధ్య అమెరికా మార్కెట్లకు ఎగుమతి చేయనుంది. ఇప్పటికే ఇతర మార్కెట్లలో బీట్ ఆక్టివ్ విడుదలయ్యింది, ఎసెన్షియా విడుదల వచ్చే ఏడాదిలో ఉండనుంది.

షెవర్లే బీట్, ఎసెన్షియా ఇండియాలోనే తయారవుతాయి

ఇది వరకు ఉన్న బీట్‌ మోడల్‌తో పోల్చుకుంటే ఫేస్‌లిఫ్ట్ బీట్ అనేక మార్పులతో రానుంది. అందులో ప్రధానంగా ప్రీమియమ్ ఇంటీరియర్స్ మరియు షెవర్లే వారి మైలింక్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి రానున్నాయి.

English summary
Read In Telugu Chevrolet Beat And Essentia To Be Made In India, But Not For India!
Story first published: Saturday, May 20, 2017, 10:46 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark