రాంగ్ పార్కింగ్‌లో ఉన్న కార్ల ఫోటోలు తీసినోళ్లకు డబ్బులే డబ్బులు

Written By:

భారత్‌లో రోజు రోజుకీ వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ, పార్కింగ్ స్థలం పెద్ద సమస్యగా మారిపోయింది, ప్రత్యేకించి మెట్రో నగరాల్లో ఈ సమస్య పెద్ద సవాళుగా మారింది. ఈ కాలంలో ఏ రోడ్డు మీద చూసినా అనధికారిక ప్రదేశాల్లో పార్కింగ్ చేసిన వాహనాలు దర్శనమిస్తాయి. నో పార్కింగ్‌లో పార్కింగ్ చేయడం భారత నగరాలలో సర్వసాధారణం అని చెప్పవచ్చు.

రాంగ్ పార్కింగ్ చేసిన కార్లు

పార్కింగ్ స్పేస్ లేకుండానే కార్లను కొనుగోలు చేయడం రోడ్డు మీద పార్క్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు తప్పవని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే, ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓ విన్నూత్న ఆలోచనతో ముందుకొచ్చారు.

Recommended Video - Watch Now!
[Telugu] 2017 Skoda Octavia RS Launched In India - DriveSpark
రాంగ్ పార్కింగ్ చేసిన కార్లు

అనధికారిక ప్రదేశాల్లో పార్కింగ్ మరియు నో పార్కింగ్ ప్రదేశాల్లో పార్కింగ్ చేసి వాహన మరియు పాదచారులకు ఇబ్బందులు కలిగించడాన్ని పూర్తిగా ఎదుర్కోవడానికి ఈ ఐడియా చక్కగా పనిచేస్తుందని గడ్కరీ తెలిపారు. ఇంతకీ ఆ ఐడియా ఏంటా... అనుకుంటున్నారా...? ఇవాళ్టి కథనంలో పూర్తి వివరాలు చూద్దాం రండి...

రాంగ్ పార్కింగ్ చేసిన కార్లు

అనధికారిక ప్రదేశాల్లో పార్కింగ్ చేసిన వాహనాల ఫోటోలను తీసి, అధికారులకు పంపించాలని భారత ప్రజలను నితిన్ గడ్కరీ కోరాడు. ఇలా చేసిన వారికి, వాహన యజమానికి విధించే రూ. 500 ల జరిమానాలో 10 శాతాన్ని ఫోటోలు తీసి పంపిన వారికి రివార్డు క్రింద అందజేస్తామని తెలిపాడు.

రాంగ్ పార్కింగ్ చేసిన కార్లు

తన మంత్రిత్వ శాఖ నివాసం వెలుపల పార్కింగ్ స్పేస్ లేకపోవడంతో పెద్ద పెద్ద వాహనాలు రోడ్డు మీద పార్కింగ్ చేయడంతో పార్లమెంట్‌కు వెళ్లే మార్గం మొత్తాన్ని బ్లాక్ చేస్తున్నారని గడ్కరీ చెప్పుకొచ్చారు.

రాంగ్ పార్కింగ్ చేసిన కార్లు

నా ప్రకారం, మోటార్ వాహన చట్టంలో ఓ కొత్త నియమాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపాడు. "ఏ కారైనా రోడ్డు మీద అడ్డదిడ్డంగా, అనధికారిక, నోపార్కింగ్ ప్లేస్‌లో మరియు ప్రజా రవాణాకు ఇబ్బంది కలిగించేలా పార్కింగ్ చేసిన వాహనాల ఫోటోలను మొబైల్ ఫోన్‌లో తీసి సంభందిత పోలీసులు విభాగానికి పంపితే, నో పార్కింగ్ కోసం విధించే రూ. 500 ల జరిమానాలో 10 శాతానికి వారికి రివార్డుగా అందించే విధంగా చట్టాన్ని తీసుకొస్తానని చెప్పుకొచ్చాడు."

రాంగ్ పార్కింగ్ చేసిన కార్లు

నితిన్ గడ్కరీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, " మంత్రి వర్గ నివాసంలో పార్కింగ్ లాట్ ఏర్పాటు కోసం పునాది రాయి వేస్తూ, మంత్రి వర్గ నివాసంలో ఆటోమేటెడ్ పార్కింగ్ లాబీని నిర్మించడం కోసం తొమ్మిది నెలల పాటు వేచి ఉన్నట్లు తెలిపాడు.

రాంగ్ పార్కింగ్ చేసిన కార్లు

ట్రాన్స్‌పోర్ట్ భవన్‌లో ఆటోమేటెడ్ పార్కింగ్ లాబీని నిర్మిస్తున్నారు. ఇండియాలో ఆటోమేటెడ్ పార్కింగ్ సౌకర్యం గల తొలి పార్కింగ్ లాబీ ఇదే. దీని నిర్మాణం కోసం సుమారుగా 9 కోట్ల రుపాయల వరకు వెచ్చిస్తున్నట్లు తెలిపాడు.

రాంగ్ పార్కింగ్ చేసిన కార్లు

ఈ నూతన పార్కింగ్ లాబీలో మొత్తం ఏడు అంతస్థులు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ విస్తీర్ణం 314 చదరపు మీటర్లు మరియు 22 మీటర్ల ఎత్తు ఉంది. ఈ పార్కింగ్ లాట్‌లో మొత్తం 112 కార్లను ఓకే సారి పార్కింగ్ చేయవచ్చు. కేవలం 120 సెకండ్లలోనే వెలుపలికి వచ్చే సదుపాయం దీని ప్రత్యేకత.

రాంగ్ పార్కింగ్ చేసిన కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రస్తుతం కాలంలో ఓ కారుకు కావాల్సిన పార్కింగ్ స్పేస్ లభించడం పెద్ద సవాళుగా మారిపోయింది. రోజు రోజుకీ వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ రోడ్డు మీద పార్కింగ్ స్పేస్ వెతుక్కోవడం కత్తి మీద సాము అని చెప్పవచ్చు.

రాంగ్ పార్కింగ్ చేసిన కార్లు

నో పార్కింగ్ ప్లేస్‌లో పార్కింగ్ మరియు అనధికారిక పార్కింగ్ సమస్యలను ఎదుర్కోవడానికి నితిన్ గడ్కరీ ఓ కొత్త నియమాన్ని తీసుకొచ్చారు. ఇది కనుక సక్సెస్ అయితే, పార్కింగ్ సమస్య ఓ కొలిక్కివచ్చినట్లే. కాబట్టి మీకు వీలైనప్పుడల్లా నో పార్కింగ్ ప్రదేశాల్లో పార్క్ చేసిన కార్ల ఫోటోలు మీ ఫోన్లతో క్లిక్'మనిపించండి డబ్బు సంపాదించండి.

English summary
Read In Telugu: Clicking Pictures Of Illegally Parked Cars Can Earn You Money — Here’s How
Story first published: Wednesday, November 22, 2017, 21:50 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark