డాట్సన్ గో క్రాస్ విడుదల దాదాపు ఈ ఏడాదిలోనే...!!

Written By:

సమాచార వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు డాట్సన్ ఇండియా వారి తరువాత ప్రొడక్ట్ అయిన క్రాసోవర్ గో క్రాస్ ను ఈ ఏడాదిలోనే మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. క్రాసోవర్ సెగ్మెంట్లో డాట్సన్ తమ మొదటి మోడల్ గో క్రాస్ ను 2017 మలిసగంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
 

డాట్సన్ ఇండియా తమ క్రాసోవర్ గో క్రాస్ ను తొలిసారిగా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. తక్కువ ధరతో కార్లను తయారు చేసి అందించే లో కాస్ట్ కార్ల తయారీ సంస్థ డాట్సన్ వేగంగా తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది.

చివరి సారిగా డాట్సన్ యొక్క అనుభంద సంస్థ నిస్సాన్ తమ ఎక్స్-ట్రయల్ ను ప్రదర్శించిన వేళ డాట్సన్ తమ గో క్రాస్ క్రాసోవర్ ను 2017 మధ్య భాగానికి విడుదల చేస్తుందని అధికారిక ప్రకటన చేసింది.

నిస్సాన్ ఇండియా తమ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువిని 2017 ఏప్రిల్ నాటికి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది.

డాట్సన్ గో క్రాస్ క్రాసోవర్ రెండు విభిన్న ఇంజన్‌లతో రానుంది. అవి 1.2-లీటర్ మరియు 1.5-లీటర్ టిడిసిఐ డీజల్. నిస్సాన్ తమ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌లో వినియోగించిన ఇంజన్‌లనే ఈ గో క్రాస్ లో అందిస్తోంది.

నిర్మాణం పరంగా గో క్రాస్ బాక్సీ డిజైన్‌లో కలదు. మరియు ముందు వైపున హెక్సా గోనల్ ఫ్రంట్ గ్రిల్, స్వెప్ట్ బ్యాక్ ఎల్ఇడి లైట్లను, అధునాతన స్టైల్లో స్కిడ్ ప్లేట్లు (ప్రక్క వైపున డోర్లకు క్రింది భాగంలో సిల్వర్ రంగులో ఉన్నది) మరియు దట్టమైన ప్లాస్టిక్ క్లాడింగ్ కలదు.

ఇండియన్ మార్కెట్లోకి ఈ గో క్రాస్ ను నాలుగవ ఉత్పత్తిగా విడుదల చేస్తోంది. ప్రస్తుతం డాట్సన్ ఇండియా లైనప్‌లో గో, గో ప్లస్ మరియు రెడిగో కార్లు అందుబాటులో ఉన్నాయి.

గో క్రాస్ క్రాసోవర్ విడుదలయితే ప్రస్తుతం మార్కెట్లో హ్యుందాయ్ ఆక్టివ్ ఐ20, టయోటా ఎటియోస్ క్రాస్ మరియు మారుతి వారి అప్ కమింగ్ ఇగ్నిస్ కు గట్టి పోటీనివ్వనుంది.

ధరకు తగ్గ విలువలతో కార్లను అందించడంలో డాట్సన్ ఎప్పుడు ప్రత్యేకమే. అత్యంత సరసమైన కార్లను అందిస్తున్న ఏకైక సంస్థ డాట్సన్ అంటే నమ్మండి. ఇప్పుడు ఈ క్రాసోవర్ గో క్రాస్ ని కూడా ఐదు లక్షల లోపు బడ్జెట్‌లో విడుదల చేయనుంది.

వితారా బ్రిజాకు పోటీగా హ్యుందాయ్ క్యుఎక్స్ఐ
హ్యుందాయ్ మోటార్స్ తమ అప్‌‌కమింగ్ కాంపాక్ట్ ఎస్‌యువి మీద పనిచేస్తోంది. దీనికి క్యుఎక్స్ఐ అనే కోడ్ పేరును కూడా ఖరారు చేసినట్లు తెలిసింది.

12,000 కిమీల పొడవైన లండన్-చైనా రైలు ప్రారంభం
చైనా నుండి సుమారుగా 12,000 కిలోమీటర్ల దూరం గల లండన్‌కు గూడ్స్ రైలు సర్వీస్ ను ప్రారంభించింది. ఈ మార్గంలో అనేక దేశాలతో చైనా వాణిజ్య వ్యాపారాలను సాగించనుంది.

2017 స్కోడా ర్యాపిడ్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ ఫోటోలు.... పూర్తి ఉచితంగా
 


English summary
Report: Datsun Go Cross Likely To Hit Indian Market In 2017
Please Wait while comments are loading...

Latest Photos