డాట్సన్ గో లైవ్ కాన్సెప్ట్: కళ్లు చెదిరే బడ్జెట్ ఫ్రెండ్లీ కారు

Written By:

బడ్జెట్ కార్ల తయారీ సంస్థ డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ ఆధారిత గో లైప్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. ఇండోనేషియాలో జరుగుతున్న 2017 గైకిండో ఇండోనేషియాలో ఇంటర్నేషనల్ ఆటో షో వేదిక మీద డాట్సన్ గో లైవ్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది.

డాట్సన్ గో లైవ్ కాన్సెప్ట్

యువ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ భవిష్యత్ డిజైన్ లక్షణాలతో గో లైవ్ కాన్సెప్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను డాట్సన్ అభివృద్ది చేసింది. ఇంకా చెప్పాలంటే కార్లను కస్టమైజేషన్ చేయించుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని దీనిని ఆవిష్కరించింది.

Recommended Video - Watch Now!
2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
డాట్సన్ గో లైవ్ కాన్సెప్ట్

డాట్సన్ లైనప్‌లోని గో హ్యాచ్‌హ్యాక్ స్టాండర్డ్‌తో పోల్చుకుంటే గో లైవ్ కాన్సెప్ట్ ఫ్రంట్ సైడ్ పదునై డిజైన్ గీతలతో పాటు అగ్రెసివ్ డిజైన్ కలిగి ఉంది. ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, సింగల్ పీస్ ఫ్రంట్ గ్రిల్ మరియు నియాన్ కలర్ మేళవింపుతో ఉన్న ఫ్రంట్ బంపర్ ఉన్నాయి.

డాట్సన్ గో లైవ్ కాన్సెప్ట్

డాట్సన్ గో లైవ్ ముందు మరియు వైనుక బంపర్, ప్రక్క వైపుల సైడ్ స్కర్ట్స్, రూఫ్ స్పాయిలర్ మరియు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటివి నియాన్ కలర్‌తో ప్రత్యేకాకర్షణగా ఉన్నాయి. కాన్సెప్ట్ గో లైవ్ కారు స్టాండర్డ్ గో హ్యాచ్‌బ్యాక్‌తో పోల్చితే విశాలంగా ఉంటుంది.

డాట్సన్ గో లైవ్ కాన్సెప్ట్

ఇండోనేషియా స్పెక్ డాట్సన్ గో కాన్సెప్ట్ కారులో సాంకేతికంగా 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది 68బిహెచ్‌పి పవర్ మరియు 104ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌‌కు 5-స్పీడ్ మ్యాన్యుల్ గేర్‌బాక్స్‌ అనుసంధానం ఉంది.

డాట్సన్ గో లైవ్ కాన్సెప్ట్

డాట్సన్ ఎక్జ్సిక్యూటివ్ డిజైన్ డైరక్టర్ కెయి కైయు మాట్లాడుతూ," డాట్సన్ లైనప్‌లో ఇదివరకే ఉన్న ఈ మోడల్, విభిన్న కస్టమర్లను డిజైన్ అంశం పరంగా చేరుకునేందుకు ఓ సరికొత్త రూపంలో గో లైప్ కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించడం జరిగింది. సరికొత్త డిజైన్ భాషలో మరియు నూతన కలర్ ఆప్షన్‌లో లభించే ఇది కస్టమర్ల వ్యక్తిగత అభిరుచికి అతి దగ్గరగా ఉంటుందని చెప్పుకొచ్చాడు."

డాట్సన్ గో లైవ్ కాన్సెప్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డాట్సన్ గో లైప్ ఒక కాన్సెప్ట్ మోడల్, అయితే అది గో ఫేస్‌లిఫ్ట్ అనే అనుమానం కూడా ఉంది. నియాన్ మరియు గ్రే కలర్ ఆప్షన్‌లో కాన్సెప్ట్ దశలో ఉన్న గో లైవ్ కారు గురించిన ప్రొడక్షన్ వివరాలు ఇంకా వెల్లడికాలేదు. కాబట్టి డాట్సన్ తమ గో లైవ్ కారును ఇండియన్ మార్కెట్లోకి పరిచయం చేస్తుందో లేదో వేచి చూడాలి మరి.

English summary
Read In Telugu: Datsun GO Live Concept Unveiled In Indonesia
Story first published: Monday, August 14, 2017, 11:17 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark