రెడి-గో 1.0-లీటర్ పై బుకింగ్స్ ప్రారంభించిన డాట్సన్

డాట్సన్ తమ 1.0-లీటర్ సామర్థ్యం ఇంజన్‌ గల రెడి-గో హ్యాచ్‌బ్యాక్ కారును ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈ మోడల్ మీద ముందస్తు బుకింగ్స్ కూడా ప్రారంభించింది.

By Anil

డాట్సన్ తమ 1.0-లీటర్ సామర్థ్యం ఇంజన్‌ గల రెడి-గో హ్యాచ్‌బ్యాక్ కారును ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈ మోడల్ మీద ముందస్తు బుకింగ్స్ కూడా ప్రారంభించేసింది. జూలై 11, 2017 నుండి దేశవ్యాప్తంగా డాట్సన్ విక్రయ కేంద్రాలలో దీనిని బుక్ చేసుకోవచ్చు.

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ బుకింగ్స్

రూ. 10,000 ల మొత్తాన్ని చెల్లించి రెడి-గో 1.0-లీటర్ వెర్షన్ కారును దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్ మరియు డాట్సన్ షోరూమ్‌లలో బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ కోసం చెల్లించే మొత్తాన్ని వాపసు పొందే అవకాశం ఉంది. ఇప్పుడు బుక్ చేసుకునే కస్టమర్లకు జూలై 26, 2017 నుండి డెలివరీ ఇవ్వనున్నట్లు డాట్సన్ పేర్కొంది.

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ బుకింగ్స్

రెనో క్విడ్ 1.0-లీటర్ వేరియంట్ ఆధారంగా డాట్సన్ తమ రెడి-గో హ్యాచ్‌బ్యాక్‌ను 1.0-లీటర్ ఇంజన్ వెర్షన్‌లో రూపొందించింది. రెడి-గో లోని 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ బుకింగ్స్

ఈ నూతన ఇంజన్‌లో ఇంటెలిజెంట్ స్పార్క్ ఆటోమేటెడ్ టెక్నాలజీని అందించినట్లు డాట్సన్ తెలిపింది. ఈ పరిజ్ఞానం ద్వారా మైలేజ్ పెరిగే అవకాశం ఉంది. ఏఆర్ఏఐ సర్టిఫికేట్ ప్రకారం ఈ రెడి-గో 1.0-లీటర్ వేరియంట్ లీటర్‌కు 22.04కిమీల మైలేజ్ ఇవ్వగలదు.

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ బుకింగ్స్

గతంలో డాట్సన్ 800సీసీ ఇంజన్‌తో తొలుత రెడి-గో ను పరిచయం చేసింది. ఇందులోని టాప్ ఎండ్ వేరియంట్లు అయిన టి(ఒ) మరియు ఎస్ లో మాత్రమే ఈ 1.0-లీటర్ ఇంజన్‌ను పరిచయం చేసింది. కాబట్టి రెడి-గో 1.0-లీటర్ కేవలం T(O) మరియు S వేరియంట్లలో మాత్రమే లభించును.

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ బుకింగ్స్

రెండు వేరియంట్లు కూడా, కీ లెస్ ఎంట్రీ, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, మరియు ఆల్ బ్లాక్ ఇంటీరియర్‌తో రానున్నాయి. రెడి-గో 1.0-లీటర్ కారును వచ్చే జూలై 26, 2017 న విపణిలోకి అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం.

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ బుకింగ్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డాట్సన్ ఇండియాకు రెడి-గో మంచి సక్సెస్ ఇచ్చింది. ఇప్పుడు ఇదే వేరియంట్ 1.0-లీటర్ ఇంజన్ ఆప్షన్‌లో విడుదలైతే సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మోడల్ పూర్తిగా విపణిలోకి విడుదలైతే, రెనో క్విడ్ 1.0-లీటర్ మరియు మారుతి ఆల్టో కె10 మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది. రూ. 3.75 నుండి 4 లక్షల మధ్య ప్రారంభ ధరతో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu Datsun India Commence Pre-Bookings For redi-GO 1-Litre
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X