భారత దేశపు మొదటి అర్బన్ క్రాసోవర్ "రెడి గో" విజయం వెనకున్న ముఖ్యమైన కారణాలు

Written By:

జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ దేశీయంగా విపణిలోకి జూన్ 7, 2016 న భారతదేశపు మొట్టమొదటి అర్బన్ క్రాసోవర్ కారు రెడి గో (redi-Go) ను విడుదల చేసింది.

రూ. 2.38 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదలైన అర్బన్ క్రాసోవర్ ఇటు పట్టణ మరియు అటు పల్లె ప్రాంత కస్టమర్లకు చేరువయ్యింది. పల్లె ప్రాంత అమ్మకాలు పట్టణ అమ్మకాలతో పోటీ పడ్డాయి. బుకింగ్స్ ప్రారంభించిన సమయం నుండి ఇదే తంతు కొనసాగింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
డాట్సన్ రెడి గో

దేశీయంగా మరే ఇతర కార్ల తయారీ సంస్థ కూడా ఇవ్వలేనటువంటి అద్బుతమైన ఆఫర్ ఐదు సంవత్సరాలు లేదంటే పొడగించబడిన అన్‌లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ. వారంటీ మీద దృష్టి పెట్టే ఎంట్రీ లెవల్ కారును కొనుగులు చేసే వారిని ఈ ఆఫర్‌తో తనవైపు లాక్కునేలా చేసింది.

అంతే కాకుండా అతి తక్కువ ధరతో ఒక కారుకు యాజమాన్ని అయ్యే అవకాశాన్ని డాట్సన్ తమ రెడి గో ద్వారా కల్పించింది. దీనికి ఉన్న పోటీదారులతో పోల్చుకుంటే 32 శాతం తక్కువ ధరతో కారును సొంతం చేసుకోవచ్చు.

డాట్సన్ రెడి గో

డాట్సన్ తమ రెడి గో ద్వారా అందించిన మరో బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్, 25.17 కిలోమీటర్/లీటర్. క్విడ్ కూడా ఇదే మైలేజ్ మరియు మారుతి ఆల్టో 800 24.9 కిలోమీటర్/లీటర్ మైలేజ్ ఇస్తుంది.

భారత ఆటోమొబైల్ పరిశ్రమలో ఏ ఎంట్రీ లెవల్ ఉత్పత్తి సాధించాలంటే అత్యుత్తమ మైలేజ్ తప్పనిసరి. ఈ నాడిని ముందుగా పసిగట్టిన డాట్సన్ మైలేజ్ విషయంలో రెడి గో ను మొదటి స్థానంలో నిలిపింది.

డాట్సన్ రెడి గో

పేరుకు అర్బన్ క్రాసోవర్ అయినప్పటికీ అన్ని రకాల ఇండియన్ రహదారులను ఎదుర్కోవడానికి అత్యుత్తమ 185ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇందులో కలదు. దీనికి పోటీగా ఉన్న మారుతి సుజుకి ఆల్టో మరియు రెనో క్విడ్ కన్నా ఎక్కువ కలిగింది. (భూతలం నుండి కారు బాడీకి మధ్య గల దూరాన్ని గ్రౌండ్ క్లియరెన్స్ అంటారు)

డాట్సన్ రెడి గో

డిజైన్ అంశంగా పరంగా కూడా ఇండియన్స్‌ను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. ఎంట్రీలెవల్ సెగ్మెంట్లో మరే ఇతర ఉత్పత్తికి పొంతన లేకుండా డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఫీచర్‌తో వచ్చింది. ఈ సెగ్మెంట్లో ఈ ఫీచర్ పరిచయం చేసిన మొదటి కారు కూడా ఈ రెడి గో. దేశీయంగా మిగతా సంస్థలు కూడా తమ కార్లలో ఈ ఫీచర్ అందించినప్పటికీ ధర ఎక్కువగా నిర్ణయించాయి.

డాట్సన్ రెడి గో

డాట్సన్ రెడి గో సక్సెస్ స్టోరీలో ఫీచర్లకు ఓ స్థానం ఇవ్వాల్సిందే. ఈ శ్రేణిలో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లను పరిచయం చేయడం ద్వారా వివిధ ఇండియన్ సిటీలల్లో ఉన్న రూరల్ ఏరియాల్లో భారీ సంఖ్యలో డెలివరీ ఇవ్వడం జరిగింది. గతంలో ఇలా మరే సంస్థకూ సాధ్యపడలేదు.

డాట్సన్ రెడి గో

ఒకే రోజు ఎక్కువ రెడి గో కార్ల డెలివరీ ఇచ్చే కార్యక్రమాలను కూడా డాట్సన్ నిర్వహించింది. అందులో ఒకటి హైదరాబాద్‌లో ఆధ్వర్యంలో డాట్సన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బ్యాట్మింటన్ స్టార్ మరియు 2016 రియో ఒలంపిక్స్‌లో రజత పథకం సాధించిన పివి. సిందు పాల్గొన్నారు.

డాట్సన్ రెడి గో

మార్కెట్లో రెడి గో మీద ఏర్పడుతున్న డిమాండ్‌ను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ వచ్చిన డాట్సన్ విభిన్నమైన కస్టమర్ల కోసం సెప్టెంబర్ 29, 2016 న డాట్సన్ రెడి గో హ్యాచ్‌బ్యాక్‌ను రెడి గో స్పోర్ట్ పేరుతో స్పెషల్‌ ఎడిషన్‌గా మార్కెట్లోకి విడుదల చేసింది.

డాట్సన్ రెడి గో

2016 రియో ఒలంపిక్స్‌లో రెజ్లింగ్ పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించిన సాక్షి మాలిక్ సమక్షంలో రెడి గో స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్‌ను డాట్సన్ విడుదల చేసింది. మరియు దీని విడుదల వేదికగా సరికొత్త రెడి గో స్పోర్ట్ కారుకు సాక్షి మాలిక్ బ్రాండ్ అంబాసిడర్‌ అని డాట్సన్ ప్రకటించింది. రియో ఒలంపిక్స్‌లో అద్బుతమైన ప్రదర్శనకు గాను సాక్షి మాలిక్ కు మొదటి రెడి గో స్పోర్ట్ కారును బహుకరించింది డాట్సన్.

డాట్సన్ రెడి గో

ప్రారంభంలో విడుదల చేసిన రెడి గో కన్నా ప్రత్యేకంగా ఉండేందుకు లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్ వెర్షన్‌లో చాలా వరకు కాస్మొటిక్ మార్పులకు గురిచేసింది. అందుకోసం ముందు, ప్రక్క మరియు రూఫ్ టాప్ మీదుగా నల్లటి రంగులో ఉన్న స్ట్రిప్‌లను అందించింది. తేనెపట్టు తరహాలో ఉన్న బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, ముందు మరియు వెనుక వైపున కారుకు అంచున ఉన్న బ్లాక్ బంపర్, అల్లాయ్ వీల్స్ మీద ఎర్రటి రంగులో దృష్టిని ఆకర్షించే పెయింట్ వంటివి ఈ రెడి గో స్పోర్ట్ వేరియంట్లో ప్రధానంగా గుర్తించవచ్చు.

డాట్సన్ రెడి గో

ఫీచర్ల పరంగా డాట్సన్ రెడి గో స్పోర్ట్ లో కొన్ని సౌకర్యవంతమైన మరియు భద్రతపరమైన అంశాలను జోడించింది. బ్లూ టూత్ ప్లే మరియు కీ లెస్ ఎంట్రీ కలదు. అంతే కాకుండా ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్లో రియర్ పార్కింగ్ సెన్సార్లను అందించింది. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మొదటి సారిగా డాట్సన్ పరిచయం చేసిన మరో ఫీచర్ ఇది.

డాట్సన్ రెడి గో

డాట్సన్ ఇండియా రెడి గో స్పెషల్ ఎడిషన్ స్పోర్ట్ ను విడుదల చేసిన కేవలం నాలుగు రోజుల్లో మొత్తం లిమిటెడ్ ఎడిషన్ కార్లు అమ్ముడయ్యాయి. అనూహ్యంగా వచ్చిన ఈ స్పందనకు డాట్సన్ అన్‌లిమిటెడ్ ప్యాసన్ (#UnlimitedPassion) సంభోదించింది.

స్పెషల్ ఎడిషన్ కారుకు అనుకున్న దానికన్నా ఎక్కువగా వచ్చిన స్పందనకు తగ్గట్టుగా మరిన్ని రెడి గో స్పోర్ట్ కార్లను ఉత్పత్తి చేసి అందుబాటులో ఉంచింది.

డాట్సన్ రెడి గో

ఇండియన్స్ రెడి గో ను ఎలా ఆదరిస్తున్నారనేది తెలుసుకోవడానికి #DatsunLove అనే కాటెస్ట్ నిర్వహించింది దాట్సన్. ఓనర్లు తమ రెడి గో ఫోటోను ఈ కాంటెస్ట్ లో పోస్ట్ చేయాలి.

అన్ని ఖర్చులను డాట్సన్ భరించే విధంగా విజేతను డాట్సన్ జపాన్ ట్రిప్‌కు పంపుతుంది. దేశ వ్యాప్తంగా ఈ రెడి గో ఓనర్లు భారీ ఎత్తున్న ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్నారు.

డాట్సన్ రెడి గో

మొత్తానికి ఈ కాంటెస్ట్ విజేత ఢిల్లీకి చెందిన విశాల్ వత్స్. ఇతను తన రెడి గో ద్వారా హిమాలయాల్లోని లేహ్-లఢక్ తన డాట్సన్ రెడి గో ను డ్రైవ్ చేసాడు.

డాట్సన్ రెడి గో

ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో వాహనాన్ని నడపగలిగే ప్రదేశమైన కర్దుంగ్ లా ని రెడి గో ద్వారా దాటడం మరో రికార్డ్. ఈ రైడింగ్ ద్వారా రెడి గో యొక్క విశ్వసనీయమైన పనితీరు ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది.

డాట్సన్ రెడి గో

డాట్సన్ రెడి గో షోరూమ్ ల ద్వారా మాత్రమే కాకుండా డిజిటల్ వేదికల మీద కూడా విక్రయాలకు వచ్చింది. తద్వారా దేశంలో ఈ మూల నుండైనా రెడి గో ను బుక్ చేసుకునే అవకాశం కస్టమర్లకు కల్పించింది. భారత దేశపు దిగ్గజ ఈ-కామర్స్ వేదిక స్నాప్‌డీల్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం లభించింది.

డాట్సన్ రెడి గో

స్నాప్‌డీల్ ద్వారా కాకుండా డాట్సన్ అధికారిక వెబ్ సైట్ మీద కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. ప్రత్యేకంగా గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డాట్సన్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని కూడా మొబైల్ నుండి బుక్ చేయవచ్చు.

డాట్సన్ రెడి గో

సరిగ్గా మూడు దశాబ్దాల అనంతరం మళ్లీ పుట్టిన డాట్సన్ 2014 ఏడాదిలో తనను తాను ఆవిష్కరించుకుంది. ఇందుకు సాంఘిక ప్రసార మాధ్యమాలను విరివిగా వినియోగించుకుంది. ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవడంలో ఇది ఎంతగానో ఉపకరించింది.

డాట్సన్ రెడి గో

చవక కార్ల తయారీ సంస్థగా 2014 లో ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలను ప్రారంభించిన డాట్సన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాలకు విస్తరించింది. ఇందులో రష్యా, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, నేపాల్, శ్రీలంక మరియు లెబనన్ వంటి దేశాలు ఉన్నాయి. మరియు గడిచిన రెండున్నరేళ్ల కాలంలో మొత్తం ఏడు కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది.

భారీ అమ్మకాలు సాధిస్తూ ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో ధరకు తగ్గ విలువలను కలిగి ఉన్న రెడి గో ఫోటోలు...

 

English summary
Also Read In Telugu: Datsun redi-GO: The Reason Behind The Success Story Of India's First Urban Crossover
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark