క్విడ్‌ను అనుసరిస్తున్న రెడి గో

డాట్సన్ ఇండియా తమ రెడి గో ఎంట్రీ లెవల్ హ్యచ్‌బ్యాక్ ను 1.0 లీటర్ ఇంజన్‌తో మోర్కెట్లోకి విడుదల చేయనుంది, దీనికి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా అనుసంధానం చేస్తోంది.

By Anil

అత్యంత సరసమైన ధరలతో ఎంట్రీ లెవల్ కార్ల తయారీ సంస్థ డాట్సన్ తమ రెడి గో హ్యాచ్‌బ్యాక్ ను మరో ఇంజన్ వేరియంట్లో విడుదల చేయడానిసి సిద్దమైంది. ప్రస్తుతం 0.8-లీటర్ ఇంజన్‌తో లభించే దీనిని త్వరలో 1.0-లీటర్ వేరియంట్లో విడుదల చేయనుంది, దీనిని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జోడింపుతో కూడా పరిచయం చేయడానికి సిద్దమైనట్లు తెలిసింది.

డాట్సన్ రెడి గో 1.0-లీటర్

గతంలో రెనో ఇండియా తమ క్విడ్ కారును 800సీసీ సామర్థ్యం గల ఇంజన్‌తో విడుదల చేసింది. అయితే ఏడాదిలోపే దీనిని 1.0-లీటర్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లలో ప్రవేశపెట్టింది. బుల్లి కారుతో రెనో ఇండియా మంచి పేరుతో పాటు భారీ అమ్మకాలను కూడా మూడగట్టుకుంది.

డాట్సన్ రెడి గో 1.0-లీటర్

క్విడ్ లోని అదే 800సీసీ ఇంజన్‌తో అందుబాటులో ఉన్న రెడి గో ఇప్పుడు 1.0-లీటర్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లో విడుదలవ్వడానికి గల ముఖ్య కారణం క్విడ్ తరహా విక్రయాలు సాధించాలని స్పష్టమవుతోంది.

డాట్సన్ రెడి గో 1.0-లీటర్

ప్రస్తుతం రెడి గో లోని టాప్ ఎండ్ వేరియంట్ ఎస్ లో మాత్రమే ఈ 1.0-లీటర్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేయాలని చూస్తోంది డాట్సన్ మరియు దీని విడుదల జూన్ 2017 లో ఉండనుంది.

డాట్సన్ రెడి గో 1.0-లీటర్

డాట్సన్ నూతనంగా పరిచయం చేయనున్న ఇంజన్‌ను రెనో నుండి సేకరిస్తోంది, ఈ 1.0-లీటర్ ఇంజన్ గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ప్రస్తుతం రెనో లైనప్‌లో ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో అందుబాటులో ఉంది.

డాట్సన్ రెడి గో 1.0-లీటర్

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్న కార్లలో విప్లవాత్మక మార్పుకు రెనో శ్రీకారం చుట్టింది, ఇందుకోసం గేర్‌లివర్ స్థానానికి బదులుగా డ్యాష్‌బోర్డ్‌లో రోటరీ డయల్‌ను పరిచయం చేసింది, ఇందులో డ్రైవ్, న్యూట్రల్ మరియు ఆటోమేటిక్ అనే ఆప్షన్లు అందించిది. ఇదే పరిజ్ఞానాన్ని డాట్సన్ తమ రెడి గో ఆటోమేటిక్ వేరియంట్లో పరిచయం చేయనుంది.

డాట్సన్ రెడి గో 1.0-లీటర్

ప్రస్తుతం రూ. 2.8 నుండి 3.54 లక్షల మధ్య ధరతో అందుబాటులో ఉన్న రెడి గో 800సీసీ సామర్థ్యం గల ఇంజన్‌ను కలిగి ఉంది. అయితే 1.0-లీటర్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లో వచ్చే రెడి గో సుమారుగా 3.85 నుండి 4 లక్షల మధ్య ప్రారంభ ధరతో రానుంది.

డాట్సన్ రెడి గో 1.0-లీటర్

డాట్సన్ ఇండియా దేశీయంగా తమ రెడి గో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ను మూడవ ఉత్పత్తిగా జూలై 2016 లో విడుదల చేసింది. అనతి కాలంలోనే స్పెషల్ ఎడిషన్‌గా రెడి గో స్పోర్ట్ పేరుతో మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది.

డాట్సన్ రెడి గో 1.0-లీటర్

డాట్సన్ ఇండియా 2016 ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో మొత్తం 20,144 యూనిట్లు విక్రయాలు జరిపింది. మరియు 1,652 యూనిట్లను ఎగుమతి చేసింది. నిస్సాన్‌తో భాగస్వామ్యంతో కలిసి ఉన్న డాట్సన్ రెడి గో ద్వారా అమ్మకాలు పెంచుకుంటున్న తరుణంలో ఇరు సంస్థల మార్కెట్ విలువ రోజురోజుకీ పెరుగుతోంది.

డాట్సన్ రెడి గో 1.0-లీటర్

ప్రస్తుతం డాట్సన్ ఇండియా లైనప్‌లో గో హ్యాచ్‌బ్యాక్ మరియు గో ప్లస్ ఫ్యామిలీ సెడాన్ కారుతో పాటు రెడి గో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ అందుబాటులో ఉంచింది.

డాట్సన్ రెడి గో 1.0-లీటర్

మారుతి ఆల్టో 800 ని చంపేసిన రెనొ క్విడ్ ?: అసలు ఏమైంది....

రెనో క్విడ్ వర్సెస్ మారుతి ఆల్టో 800

డాట్సన్ రెడి గో 1.0-లీటర్

బడ్జెట్ బాయ్స్ కు పక్కా కారు.....డాట్సన్ రెడి గో టెస్ట్ డ్రైవ్‌ రిపోర్ట్

మారుతి సుజుకి స్విఫ్ట్ కొనాలనుకుంటున్నారా...? అయితే కొద్ది రోజులు వేచి ఉండండి. త్వరలో 2017 స్విప్ట్ మార్కెట్లోకి విడుదల కానుంది. నూతన డిజైన్ శైలిలో విడుదల కానున్న స్విఫ్ట్ ఎలా ఉందో ఇక్కడ ఉన్న ఫోటోల మీద క్లిక్ చేయండి....

Most Read Articles

English summary
Datsun rediGO 1.0-Litre And AMT Variants Launch Details Revealed
Story first published: Wednesday, January 11, 2017, 15:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X