డాట్సన్ రెడి-గో గోల్డ్ ఎడిషన్ విడుదల: ధర రూ. 3.69 లక్షలు

Written By:

డాట్సన్ ఇండియా, దేశీయంగా పండుగ సంబరాలను పురస్కరించుకుని రెడి-గో హ్యాచ్‌బ్యాక్ కారును సరికొత్త గోల్డ్ ఎడిషన్‌లో మార్కెట్లోకి విడుదల చేసింది. పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే రెడి-గో గోల్డ్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 3.69 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు డాట్సన్ ప్రతినిధులు పేర్కొన్నారు.

డాట్సన్ రెడి-గో గోల్డ్ ఎడిషన్

రెగ్యులర్ వెర్షన్ రెడి-గో తో పోల్చుకుంటే ఎంతో భిన్నంగా ఉండేలా, గోల్డ్ ఎడిషన్ రెడి-గో ఎక్ట్సీరియర్ మీద అనేక మార్పులు చేశారు. అందరి దృష్టిని ఆకర్షించేలా గోల్డ్ థీమ్ ప్రేరిత డీకాల్స్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో కూడా గోల్డ్ థీమ్‌ సీట్లు మరియు ఇతర ఫీచర్లు ఉన్నాయి.

రెడి-గో గోల్డ్ ఎడిషన్ మూడు విభిన్న బాడీ కలర్ ఆప్షన్స్‌లో లభించును. అవి, గ్రే, సిల్వర్, మరియు వైట్.

Recommended Video - Watch Now!
2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
డాట్సన్ రెడి-గో గోల్డ్ ఎడిషన్

రెడి-గో కార్లలో కస్టమర్ల మొబైల్ ఫోన్ల కోసం ఫస్ట్ ఇన్ క్లాస్ ఆంబియంట్ లైటింగ్ అప్లికేషన్ అందించింది. కారులో ప్రయాణించేటపుడు తమ ఇష్టానికి తగ్గట్లుగా క్యాబిన్ లైటింగ్‌ను మొబైల్ యాప్ ద్వారా మార్చేసుకునే వెసులుబాటు కల్పించింది.

డాట్సన్ రెడి-గో గోల్డ్ ఎడిషన్

సాధారణ రెడి-గో లోని టి(ఒ) వేరియంట్ ఆధారంగా రెడి-గో గోల్డ్ ఎడిషన్‌ను డాట్సన్ అభివృద్ది చేసింది. ఇందులో బ్లూటూత్, ఆడియో సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మరియు ఎన్నో ఇతర ఫీచర్లు ఉన్నాయి.

డాట్సన్ రెడి-గో గోల్డ్ ఎడిషన్

డాట్సన్ తమ రెడి-గో గోల్డ్ లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్‌లో ఉన్న 1.0-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌లో ఇంటెలిజెంట్ స్పార్క్ ఆటోమేటెడ్ టెక్నాలజీ(iSAT) అందించింది.

డాట్సన్ రెడి-గో గోల్డ్ ఎడిషన్

5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు ఏఆర్ఏఐ ప్రకారం, ఇది లీటర్‌కు 22.5కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

డాట్సన్ రెడి-గో గోల్డ్ ఎడిషన్

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ గోల్డ్ ఎడిషన్ ఎంచుకునే కస్టమర్లు "డాట్సన్ కేర్" సమగ్ర సర్వీస్ ప్యాకేజ్ ఉచితంగా పొందవచ్చు. ఈ ప్యాకేజీలో మూడు, నాలుగు లేదా ఐదేళ్ల సర్వీస్ ఆప్షన్స్ లభిస్తున్నాయి.

పీరియాడిక్ సర్వీసుల ఖర్చులో 10 శాతం ఆదా చేసుకోవచ్చు. సాధారణ రిపేరీలు మరియు డాట్సన్ కేర్ గురించిన పూర్తి వివరాల కోసం...

డాట్సన్ రెడి-గో గోల్డ్ ఎడిషన్

డాట్సన్ బిజినెస్ యూనిట్, నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ మరియు మార్కెటింగ్ హెడ్ జెరోమ్ సైగట్ మాట్లాడుతూ," ఈ పండుగ సీజన్‌లో కస్టమర్ల కోసం శక్తివంతమైన, స్టైలిష్ మరియు సౌకర్యవంతమైన రెడి-గో 1.0-లీటర్ హ్యాచ్‌బ్యాక్‌ను పరిమిత సంఖ్యలో గోల్డ్ ఎడిషన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపాడు."

డాట్సన్ రెడి-గో గోల్డ్ ఎడిషన్

డాట్సన్ రెడి-గో గోల్డ్ ఎడిషన్ గురించి సైగట్ మాట్లాడుతూ, "విలువలతో, ఇతరులతో పోల్చుకుంటే విభిన్న స్టైలింగ్ లక్షణాలున్న,పెప్పీ డ్రైవింగ్ పర్ఫామెన్స్, అతి నూతన ఇంటీరియర్ వంటి ఎన్నో వాటికి స్థానం కల్పిస్తూ, మరికొన్ని ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లను జోడిస్తూ కస్టమర్లు చెల్లించే సొమ్ముకు సరైన విలువను కలిగి ఉందని చెప్పుకొచ్చాడు."

డాట్సన్ రెడి-గో గోల్డ్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో అత్యంత సరసమైన కార్ల తయారీ సంస్థగా జపాన్ దిగ్గజం డాట్సన్ పేరుగాంచింది. అతి తక్కువ ధరతోనే కారును సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్ల కలను నిజం చేస్తోంది డాట్సన్. ఈ నేపథ్యంలో భారత్‌లో తనకు ఎదురయ్యే ప్రతి సందర్భాన్ని వ్యాపారానుకూలంగా మార్చేసుకుంటూ, ఎప్పటికప్పుడు లిమిటెడ్ ఎడిషన్‌లో తమ ఉత్పత్తులను ప్రవేశపెడుతుంటుంది.

తాజాగా, దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటున్న తరుణంలో, డాట్సన్ తమ బడ్జెట్ ఫ్రెండ్లీ రెడి-గో కారును లిమిటెడ్ ఎడిషన్‌గా గోల్డ్ ఎడిషన్ పేరుతో ప్రవేశపెట్టింది. ఈ పండుగ సీజన్‌లో చిన్న కారును కొంటున్నట్లయితే, ఒక్కసారి దీని గురించి ఆలోచించండి... మరిన్ని హ్యాచ్‌బ్యాక్ స్టోరీల కోసం...

English summary
Read In Telugu: Datsun rediGO Gold 1.0-Litre Launched In India; Priced At Rs 3.69 Lakh
Story first published: Tuesday, September 26, 2017, 14:25 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark