వితారా బ్రిజా రూపు రేఖలు మార్చేసిన డిసి డిజైన్

Written By:

భారత ప్రఖ్యాత కార్ల కస్టమైజేషన్ సంస్థ డిసి డిజైన్. భారత్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న ప్రతి కారును కూడా డిసి డిజైన్ తనదైన శైలిలో మోడిఫై చేస్తుంది. ఒక్కోసారి కార్ల తయారీ సంస్థలు సైతం డిసి డిజైన్ చేసే అద్బుతమైన మోడిఫికేషన్స్‌కు అసూయపడిపోతాయి.

అందుకు ఓ చక్కటి ఉదాహరణ డిసి డిజైన్ వారి మోడిఫైడ్ మారుతి వితారా బ్రిజా...

డిసి డిజైన్ మోడిఫైడ్ మారుతి వితారా బ్రిజా

ప్రస్తుతం ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో అత్యుత్తమ విక్రయాలు సాధిస్తున్న మోడల్ మారుతి వితారా బ్రిజా. అధిక సంఖ్యలో అమ్ముడుపోతుండటంతో రోడ్డు మంది ఎక్కువ బ్రిజాలు దర్శనమిస్తుంటాయి. అయితే వీటన్నింటిలోకెల్లా తమ వాహనం విభిన్నంగా ఉండాలి అనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని డిసి డిజైన్ బ్రిజాను సరికొత్త రూపంలో మోడిఫై చేసింది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
డిసి డిజైన్ మోడిఫైడ్ మారుతి వితారా బ్రిజా

డిసి డిజైన్ మోడిఫై చేసిన ఈ వెహికల్ చూసిన తరువాత, ఇది మారుతి వితారా బ్రిజా అని నమ్మడానికి చాలా మంది సంశయిస్తారు. ఏ కోణం నుండి చూసిన ఏదో కొత్త కంపెనీ కొత్తగా విడుదల చేసిన ఎస్‌యూవీ అనేలా వితారా బ్రిజా రూపు రేఖలు మార్చేశారు.

డిసి డిజైన్ మోడిఫైడ్ మారుతి వితారా బ్రిజా

వితారా బ్రిజాకు ముందు వైపు నిర్వహించిన మోడిఫికేషన్స్ చూస్తే, డిసి డిజైన్ వారి అనుభవం స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. బ్రిజా ముందువైపు సరికొత్త బంపర్ మరియు నూతన ఫ్రంట్ గ్రిల్ అందివ్వడం జరిగింది. ఫ్రంట్ వీల్ కు పై భాగంలో బాడీ మీద ల్యాండ్ రోవర్ నుండి సేకరించిన ఫాక్స్ ఎయిర్ వెంట్లను గమనించవచ్చు.

డిసి డిజైన్ మోడిఫైడ్ మారుతి వితారా బ్రిజా

మోడిఫైడ్ వితారా బ్రిజా బాడీ మొత్తాన్ని బంగారు వర్ణంలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అయితే సిల్వర్ కలర్‌లో మెరుస్తున్న అల్లాయ్ వీల్స్ అందివ్వడంతో కాంపాక్ట్ ఎస్‌యూవీ మరింత చక్కగా ఉంది. రియర్ డిజైన్‌లో కొత్త బంపర్ మరియు క్వాడ్ ఎగ్జాస్ట్ పైపులను అందివ్వడం మినహాయిస్తే డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు.

డిసి డిజైన్ మోడిఫైడ్ మారుతి వితారా బ్రిజా

మోడిఫికేషన్ స్వల్ప డిజైన్ మార్పులతో పాటు కలర్ ఎంపిక కూడా ప్రధానమైన అంశం. వాహన ప్రేమికులను ఆకట్టుకోవడంలో వాహనానికి అందించే కలర్ కీలక పాత పోషిస్తుంది. ఇప్పట్లో ఎక్ట్సీరియర్ బాడీ కలర్‌ను పోలిన ఇంటీరియర్‌ను కోరుకుంటున్నారు. దీంతో నలుపు మరియు పసుపు రంగు ఎక్ట్సీరియర్‌కు అనుగుణంగా బ్లాక్ ఎండ్ యెల్లో రంగుల్లో ఇంటీరియర్ మోడిఫై చేశారు.

డిసి డిజైన్ మోడిఫైడ్ మారుతి వితారా బ్రిజా

బ్లాక్ అండ్ యెల్లో డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ తర్వాతు గుర్తించే ప్రధానమైన మార్పు, ఎటు చోసినా కలపతో తీర్చిదిద్దిన ఇంటీరియర్. డోర్లు, డ్యాష్ బోర్డు మరియు స్టీరింగ్ వీల్ మీద ఉన్న కలప సొబగులను గమనించగలం.

డిసి డిజైన్ మోడిఫైడ్ మారుతి వితారా బ్రిజా

సీటింగ్ సామర్థ్యం పెంచకుండా, సీటింగ్ లేఅవుట్‌ను మార్చకుండా మునుపటి సీట్లున్న ప్రదేశంలో కొత్త సీట్లను అందివ్వడం జరిగింది. ఎక్ట్సీరియర్ బాడీ కలర్‌తో మ్యాచ్ అయ్యేలా పసుపు రంగు దారంతో కుట్టబడిన బ్లాక్ లెథర్ సీట్లు లగ్జరీ ఫీల్‌ను కలిగిస్తాయి.

డిసి డిజైన్ మోడిఫైడ్ మారుతి వితారా బ్రిజా

డిసి డిజైన్ మోడిఫికేషన్స్ వెహికల్ యొక్క ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ వరకే పరిమితం. మెకానికల్‌గా ఎలాంటి మార్పులు చేయదు. వితారా బ్రిజాలోని 1.3-లీటర్ ఫియట్ మల్టీజెట్ టుర్బో జెట్ డీజల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 90బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

డిసి డిజైన్ మోడిఫైడ్ మారుతి వితారా బ్రిజా

రోజూ మనం రోడ్డు మీద చూసే వితారా బ్రిజాలతో పోల్చితే డిసి డిజైన్ సంస్థ మోడిఫై చేసిన బ్రితా విభిన్నంగా ఉంది కదూ. మరెందుకు ఆలస్యం డిసి డిజైన్ సంస్థను సంప్రదించి ఇలాంటి బ్రిజాకు ఆర్డర్ ఇచ్చేసుకోండి. మోడిఫైడ్ వితారా బ్రిజా ఫోటోలను పంచుకున్న డిసి డిజైన్ దీని మోడిఫికేషన్‌కు అయ్యే ఖర్చును మాత్రం వెల్లడించలేదు.

English summary
Read In Telugu: DC Design Maruti Vitara Brezza Images Details
Story first published: Wednesday, August 16, 2017, 13:49 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark