భారీ డిస్కౌంట్లతో దీపావళి ఆఫర్లు ప్రకటించిన మారుతి

Written By:

పండుగ సీజన్‌ను పురస్కరించుకుని మారుతి సుజుకి తమ అన్ని కార్ల మీద భారీ డిస్కౌంట్లు మరియు పండుగ ఆఫర్లను ప్రకటించింది. భారత్-జపాన్ దేశాల ద్వంద్వం బంధంతో ఏర్పాటైన మారుతి సుజుకి కస్టమర్లకు అత్యుత్తమ ఆఫర్లను ప్రవేశపెట్టి, కొత్త కారును కొనడానికి ఇదే సమయం అని సూచిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న మారుతి విక్రయ కేంద్రాలను సంప్రదించి, మారుతి డీలర్లు తమ కార్ల మీద ఎంత మేరకు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నయో తెలుసుకుని నేటి కథనంలో అందిస్తోంది. ఈ ఆఫర్లు, డిస్కౌంట్లు వివిధ నగరాలు, డీలర్ల మధ్య వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.

మారుతి సుజుకి లోని ఏయే కార్ల మీద ఎలాంటి డిస్కౌంట్లు మరియు ఆఫర్లున్నాయో... చూద్దాం రండి...

 మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

మారుతి సుజుకి ఆల్టో 800 మరియు ఆల్టో కె10

మారుతి 800 తరువాత ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న బ్రాండ్ మోడల్ ఆల్టో. ఆల్టో బ్రాండ్ పేరుతో 800 మరియు కె10 కార్లను మారుతి విక్రయిస్తోంది. దీనికి తోడు ఈ పండుగ సీజన్‌లో వీలైనన్ని ఎక్కువ యూనిట్లను విక్రయించేందుకు మారుతి ఈ రెండింటి మీద దీపావళి ఆఫర్లు ప్రకటించింది.

Recommended Video - Watch Now!
2017 Skoda Octavia RS Launched In India | In Telugu - DriveSpark తెలుగు
 మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

మారుతి ఆల్టో మీద గరిష్ట క్యాష్ బ్యాక్ రూ. 20,000 లతో పాటు అదనంగా, రూ. 15,000 నుండి రూ. 20,000 మధ్య ఆల్టో హ్యాచ్‌బ్యాక్‌ మీద ఎక్స్‌చ్చేంజ్ బోనస్ పొందవచ్చు.

అదే విధంగా, మారుతి ఆల్టో కె10 మీద ఆల్టో 800 లో ఉన్న అదే ఎక్స్‌చ్ఛేంజ్ ఆఫర్‌తో పాటు 10,000 ల విలువైన క్యాష్ డిస్కౌంట్ కలదు. ఆల్టో కె10 ఏఎమ్‌టి మోడల్ మీద రూ. 15,000 ల క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 20,000 ల ఎక్స్‌చ్చేంజ్ బోనస్ కలదు.

 మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

మారుతి వ్యాగన్ఆర్

మారుతి 800 మరియు ఆల్టో తరువాత వ్యాగన్ఆర్ భారతదేశపు మూడవ అతి పెద్ద బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. వ్యాగన్ఆర్ ఇండియన్ మార్కెట్లోకి పరిచయమైనప్పటి నుండి 20 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి.

 మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ మీద అచ్చం ఆల్టో తరహా డిస్కౌంట్లు మరియు ఆఫర్లను అందిస్తోంది. రూ. 20,000 నుండి రూ. 30,000 ల మధ్య క్యాష్ డిస్కౌంట్‌ లభిస్తోంది. అదే విధంగా వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి మీద రూ. 20,000 లు మరియు వ్యాగన్ఆర్ మ్యాన్యువల్ వేరియంట్ మీద రూ. 25,000 ల వరకు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ లభిస్తోంది.

 మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

మారుతి సెలెరియో

ఈ పండుగ సీజన్‌లో సెలెరియో కారును ఎంచుకునేవారు గరిష్టంగా రూయ 30,000 ల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

మారుతి సెలెరియో మీద ఎక్స్‌చ్ఛేంజ్ ఆఫర్ క్రింద రూ. 15,000 ల వరకు బోనస్ పొందవచ్చు. అదే విధంగా ఎక్స్‌చ్ఛేంజ్ ద్వారా సెలెరియో ఆటోమేటిక్ ఎంచుకునేవారికి రూ. 22,000 ల బోనస్ మరియు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.

 మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

మారుతి స్విఫ్ట్

భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ మీద 20,000 రుపాయల క్యాష్ డిస్కౌంట్, గోల్డ్ కాయిన్ మరియు రూ. 15,000 లు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ అందిస్తోంది.

స్విఫ్ట్ లోని డీజల్ వేరియంట్ల మీద రూ. 20,000 నుండి రూ. 22,000 ల మధ్య క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 15,000 ల ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ లభిస్తోంది.

 మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

మారుతి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ సెడాన్ కారును ఆగష్టు 2017 న విపణిలోకి సరికొత్త రూపంలో లాంచ్ చేసింది. మోస్ట్ పాపులర్ కాంపాక్ట్ సెడాన్ అనతి కాలంలోనే భారీ విజయాన్ని అందుకుంది. మారుతి డిజైర్ టూర్ మీద గరిష్టంగా రూ. 20,000 ల క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది.

 మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

మారుతి సుజుకి ఎర్టిగా

ఇండియన్ మార్కెట్లో టయోటా ఇన్నోవా తరువాత అధికంగా అమ్ముడవుతున్న ఎమ్‌పీవీ ఎర్టిగా. ఎర్టిగా ఎమ్‌పీవీ పెట్రోల్, డీజల్ మరియు సిఎన్‌జి ఇంధన వేరియంట్లలో లభిస్తోంది. పెట్రోల్ ఎర్టిగా మీద గరిష్టంగా రూ. 5,000 క్యాష్ డిస్కౌంట్ మరియు ఎర్టిగా పెట్రోల్ వేరియంట్ మీద ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ రూ. 20,000 లు పొందవచ్చు.

మారుతి ఎర్టిగా డీజల్ వేరియంట్ మీద క్యాష్ డిస్కౌంట్ రూ. 30,000 లు మరియు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ రూ. 20,000ల ఆఫర్లు లభిస్తున్నాయి.

 మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

మారుతి సుజుకి సియాజ్

సాధారణ సియాజ్ కార్లు రెగ్యులర్ మారుతి సుజుకి విక్రయ కేంద్రాలలో లభించేది. అయితే, మార్చి 2017లో విడుదలైన సరికొత్త సియాజ్ ఇప్పుడు మారుతి ప్రీమియమ్ షోరూమ్ నెక్సా విక్రయ కేంద్రాలలో లభిస్తోంది. ప్రస్తుతం సియాజ్ మీద భారీ డిస్కౌంట్లు అందిస్తోంది.

 మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

మారుతి సియాజ్ మీద ఎలాంటి డిస్కౌంట్లు లేవు. అయితే, ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్‌గా రూ. 30,000 లు పెట్రోల్ సియాజ్ మీద లభిస్తోంది. సియాజ్ డీజల్ వేరియంట్ల మీద క్యాష్ డిస్కౌంట్ రూ. 40,000 లు మరియు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ రూ. 50,000 ల వరకు లభిస్తున్నాయి.

 మారుతి సుజుకి దీపావళి ఆఫర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో మారుతి సుజుకి అత్యుత్తమ సేల్స్ సాధిస్తోంది. ఈ పండుగ సీజన్‌లో మారుతి కార్లకు డిమాండ్ విపరీతంగా పెరగనుంది. ఈ నేపథ్యంలో మారుతి తమ కార్ల మీద భారీ డిస్కౌంట్లు మరియు ఆఫర్లను ప్రకటించింది. కాబట్టి మారుతి కార్లను ఎంచుకోవాలనుకునే వారికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు.

English summary
Read In Telugu: Diwali Discount Offers On Maruti Suzuki Cars In India
Story first published: Thursday, September 28, 2017, 15:07 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark