ఆ ఒక్క ఫీచర్ ఉండటంతో తునాతునకలైన కారులో నుండి సురక్షితంగా బయటపడిన డ్రైవర్

Written By:

తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు మొత్తం నుజ్జునుజ్జయిపోయింది. అయితే తునాతునకలైన కారులో నుండి డ్రైవర్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.

ప్రమాదం ఎలా జరిగింది ? ప్రమాదానికి గురైన కారు ఏది...? అంత ప్రమాదంలో కూడా ఎలా ప్రాణాలతో తప్పించుకున్నాడు...? వంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పటికే మీ మదిలి మెదిలుంటాయి. వాటన్నింటికి జవాబు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
నుజ్జునుజ్జయిన కారులో నుండి సురక్షితంగా బయటపడిన డ్రైవర్

ఫియట్ పుంటో హ్యాచ్‌బ్యాక్ కారు రెండవ నెంబర్ జాతీయ రహదారి మీద భారీ ప్రమాదానికి గురైంది, అధిక వేగం మీద ఉన్నపుడు ఎదురుగా ఉన్న ట్రక్కును ఢీకొని కారు మొత్తం నుజ్జునుజ్జయ్యింది. అదృష్టవశాత్తు కారు నడుపుతున్న వ్యక్తి ప్రాణాలతో నడుచుకుంటూ వచ్చేశాడు. ఈ ప్రమాదానికి సంభందించి రెండు కథనాలు ఉన్నాయి.

Recommended Video
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
నుజ్జునుజ్జయిన కారులో నుండి సురక్షితంగా బయటపడిన డ్రైవర్

మొదటి కథనం మేరకు...

డ్రైవర్ గంటకు 150కిలోమీటర్ల వేగంతో ఉన్నపుడు కంట్రోల్ తప్పి ఎదురుగా ఉన్న ట్రక్కును ఢీకొట్టాడు. వెంటనే అక్కడ నుండి అధిక వేగంతో పల్టీలుకొడుతూ ప్రక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లి చెట్టును ఢీకొని ఆగిపోయింది.

నుజ్జునుజ్జయిన కారులో నుండి సురక్షితంగా బయటపడిన డ్రైవర్

రెండవ కథనం మేరకు...

పుంటో కారు డ్రైవర్ గంటకు 80కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నపుడు ప్రక్క లైన్‌లో నుండి ఓ ట్రక్కు ఉన్నట్లుండి తన లైన్‌లోకి రావడంతో, ట్రక్కును తప్పించేందుకు స్వల్పంగా ఎడమవైపుకు తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ వేగం వద్ద కారు అదుపు తప్పి పల్టీలుకొడుతూ చెట్లపొదల్లో ఉన్న పెద్ద చెట్టును ఢీకొని ఆగిపోయినట్లు తెలిసింది.

నుజ్జునుజ్జయిన కారులో నుండి సురక్షితంగా బయటపడిన డ్రైవర్

ప్రమాదానంతరం....

ఫోటోలను పరీశిలిస్తే, రెండవ సంఘటనే నిజమని చెప్పవచ్చు. ప్రమాదం జరిగిన తీరు ఏదైనప్పటికీ కారు మాత్రం నుజ్జునుజ్జయిపోయింది. కారు పల్టీలు కొట్టినపుడు బానెట్ క్రింద ఉన్న ఇంజన్ మరియు కారు చక్కం కూడా విడిపోయి దూరంగా పడ్డాయి.

నుజ్జునుజ్జయిన కారులో నుండి సురక్షితంగా బయటపడిన డ్రైవర్

ప్రమాద ఫలితం...

ఫోటోల ద్వారా ప్రమాదానికి గురైన కారును పరిశీలిస్తే, కారు ముందు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ కారు క్యాబిన్ మీద దాని ప్రభావం పడలేదు. ఫియట్ వారి నిర్మాణ నాణ్యత ఇక్కడ తెలుస్తోంది. ధృడమైన శరీరం కారణంగా కారు క్యాబిన్‌ దాదాపు అలాగే ఉంది.

నుజ్జునుజ్జయిన కారులో నుండి సురక్షితంగా బయటపడిన డ్రైవర్

ప్రమాదానంతరం డ్రైవర్ ఎలా తప్పించుకున్నాడు...?

కారు యాక్సిడెంట్ అయిన వెంటనే పల్టీలు కొడుతున్నప్పటి నుండి ఆగిపోయేంత వరకు డ్రైవర్ కారులోనే ఉన్నాడు. అయితే సీట్ బెల్ట్ ధరించడంతో సేఫ్‌గా బయటపడ్డాడు. ప్రమాదానికి గురైన కారు సైడ్ ఫోటోలు లేకపోవడంతో ఎయిర్ బ్యాగులు విచ్చుకున్నాయా... లేదా... అన్న విశయం తెలియడం లేదు.

నుజ్జునుజ్జయిన కారులో నుండి సురక్షితంగా బయటపడిన డ్రైవర్

ఫియట్ పుంటో హ్యాచ్‌బ్యాక్ కారు సురక్షితమైనదేనా....?

ఫియట్ కంపెనీ తయారు చేసిన పుంటో నిజానికి ర్యాలీ ఫాస్ట్ వేగాన్ని కలిగి ఉంది. ఫియట్ పుంటో సునాయసంగా గంటకు 180కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సేల్స్ పరంగా ఆశించిన ఫలితాలు సాధించనప్పటికీ భద్రత పరంగా ఈ శ్రేణిలో వీటిని మించిన కార్లు లేవు.

కాబట్టి కారు డ్రైవ్ చేస్తున్నపుడు సీట్ బెల్ట్ ధరించడం, బైక్ రైడ్ చేస్తున్నపుడు హెల్మెట్ ధరించడం మరువకండి....

ఈ కథనం మీద మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ సెక్షన్‌లో తెలుపగలరు...!!

English summary
Read In Telugu: Fiat Punto Abarth Driver Escapes Unhurt After Brutal Crash
Story first published: Thursday, September 7, 2017, 16:03 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark