షాకింగ్ ధరతో పుంటో ఎవో ప్యూర్ హ్యాచ్‌బ్యాక్ విడుదల చేసిన ఫియట్

Written By:

ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్ ఇండియా విభాగం ప్రస్తుతం ఉన్న పుంటో ప్యూర్ మోడల్‌కు బదిలీగా పుంటో ఎవో ప్యూర్ విడుదల చేసినట్లు ఫియట్ తెలిపింది. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి ఫియట్ బ్రాండ్ తమ పుంటో ప్యూర్ స్థానంలోకి ఆశ్చర్యకరమైన ధరతో పుంటో ఎవో ప్యూర్‌ను విడుదల చేసింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఫియట్ పుంటో ఎవో ప్యూర్ హ్యాచ్‌బ్యాక్ విడుదల

పుంటో ఎవో ప్యూర్ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 4.92 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నట్లు ఫియట్ తెలిపింది.

ఫియట్ పుంటో ఎవో ప్యూర్ హ్యాచ్‌బ్యాక్ విడుదల

ఫియట్ పుంటో ఎవో ప్యూర్ కారును ఆరు విభిన్నమైన రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, ఎక్సోటిక్ రెడ్, బస్సోనోవా వైట్, హిప్ హాప్ బ్లాక్, మినిమల్ గ్రే, బ్రాంజో టాన్ మరియు మెగ్నీషియం గ్రే.

ఫియట్ పుంటో ఎవో ప్యూర్ హ్యాచ్‌బ్యాక్ విడుదల

ఫియట్ పుంటో ఎవో ప్యూర్ కారు ఫ్రంట్ గ్రిల్‌లో ఫియట్ వారి సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, హెడ్ ల్యాంప్స్, క్రోమ్ సొబగుల మధ్యలో ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

ఫియట్ పుంటో ఎవో ప్యూర్ హ్యాచ్‌బ్యాక్ విడుదల

ఫియట్ పుంటో ఎవో ప్యూర్ హ్యాచ్‌బ్యాక్ కారులో బ్లాక్ కలర్‌లో ఉన్న డోర్ హ్యాండిల్స్, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లు, బాడీ కలర్ బి-పిల్లర్లు మరియు వీల్ తొడుగులు ఉన్నాయి.

ఫియట్ పుంటో ఎవో ప్యూర్ హ్యాచ్‌బ్యాక్ విడుదల

ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్ తమ పుంటో ఎవో ప్యూర్ కారులో 1.2-లీటర్ సామర్థ్యం గల ఫైర్ పెట్రోల్ ఇంజన్ అందించింది.

ఫియట్ పుంటో ఎవో ప్యూర్ హ్యాచ్‌బ్యాక్ విడుదల

5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 96ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఫియట్ పుంటో ఎవో ప్యూర్ హ్యాచ్‌బ్యాక్ విడుదల

పుంటో ఎవో ప్యూర్ ఇంటీరియర్‌‌లో ఎయిర్ కండీషన్, హైడ్రాలిక్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్లు ఉన్నాయి.

ఫియట్ పుంటో ఎవో ప్యూర్ హ్యాచ్‌బ్యాక్ విడుదల

ఫియట్ సంస్థ పుంటో ఎవో ప్యూర్ మీద మూడు సంవత్సరాల పాటు వారంటీ మరియు 15,000 కిలోమీటర్లకు ఒక సారి ఉచతి సర్వీసింగ్ అందిస్తోంది.

ఫియట్ పుంటో ఎవో ప్యూర్ హ్యాచ్‌బ్యాక్ విడుదల

పుంటో ఎవో ప్యూర్ విడుదల వేదిక మీద ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్ ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ కెవిన్ ఫ్లిన్ మాట్లాడుతూ, ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లోకి దీని విడుదలతో ప్రారంభ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో ఫియట్ మరింత శక్తివంతంగా మారినట్లు వెల్లడించాడు.

ఫియట్ పుంటో ఎవో ప్యూర్ హ్యాచ్‌బ్యాక్ విడుదల

ఫియట్ కార్ల డిజైన్, స్టైలింగ్ మరియు అద్బుతమైన పనితీరు గురించి కస్టమర్ల నుండి మన్ననలు పొందుతున్నట్లు ఆయన తెలిపాడు. డబ్బుకు తగ్గ విలుగల గొప్ప హ్యాచ్‌బ్యాక్ ఈ పుంటో ఎవో ప్యూర్ అని చెప్పుకొచ్చారు.

 
English summary
Read in Telugu to know about Fiat Punto Evo Pure Launched In India. Get more details about all new Fiat Punto Evo Pure Price, Engine, Features, Specifications and more details.
Story first published: Thursday, April 20, 2017, 16:29 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark