సరికొత్త ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల తేదీ ఖాయం చేసిన ఫోర్డ్ ఇండియా

ఫోర్డ్ ఇండియా సరికొత్త ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. భారీ మార్పులకు గురైన ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ నవంబర్ 9, 2017 మార్కెట్లోకి విడుదలవ్వనుంది.

By Anil

ఫోర్డ్ ఇండియా సరికొత్త ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇంటీరియర్, ఎక్ట్సీరియర్, డిజైన్, ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ పరంగా భారీ మార్పులకు గురైన ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ నవంబర్ 9, 2017 మార్కెట్లోకి విడుదలవ్వనుంది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ డిజైన్ మార్పులతో పాటు కొత్త ఇంజన్ అప్‌డేట్స్ మరియు విభిన్న ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‍‌‌యూవీ నవంబర్ 09, 2017 న ఇండియన్ మార్కెట్లోకి విడుదలవ్వనుంది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌లో జరిగిన ప్రధాన మార్పుల్లో ఎక్ట్సీరియర్‌లోని ఫ్రంట్ డిజైన్‌ మీద ఎక్కువగా దృష్టి సారించింది. రీఫ్రెష్డ్ లుక్‌లో వస్తున్న ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో సింగల్ పీస్ క్రోమ్ లైన్ ఫ్రంట్ గ్రిల్, విశాలమైన హెడ్ ల్యాంప్స్, పొజిషన్ మార్చి పెద్ద పరిమాణంలో వచ్చిన ఫాగ్ ల్యాంప్స్ గుర్తించవచ్చు.

Recommended Video

Mahindra KUV100 NXT Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లను ఎకోస్పోర్ట్ లోని టాప్ ఎండ్ వేరియంట్లలో అందిస్తోంది. ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ రియర్ డిజైన్‌లో టెయిల్ గేట్ మీద అటాచ్ చేసిన స్పేర్ వీల్ కోసం సరికొత్త వీల్ కవర్ వంటివి ఉన్నాయి.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఎక్ట్సీరియర్ డిజైన్‌లో ఇది వరకు చెప్పిన మార్పులతో పాటు, ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌లో సరికొత్త బ్లాక్ హెడ్ ల్యాంప్ తొడుగులు, డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్, నూతన అల్లాయ్ వీల్స్ కలవు. ఎకోస్పోర్ట్ లోని సరికొత్త టైటానియమ్ ఎస్ ట్రిమ్‌లో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

Trending On DriveSpark Telugu:

రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్లు జర హుషార్: ఈ తప్పు చేస్తే మీ బైకుకూ ఇదే గతి...!!

కనీవిని ఎరుగుని సేల్స్: మారుతికి ముచ్చెమటలు పట్టిస్తున్న డిజైర్

8 లక్షల వరకు డిస్కౌంట్లు: భారీ దీపావళి ఆఫర్లతో ముందుకొచ్చిన పది మోడళ్లు

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌లో రీడిజైన్ చేయబడిన అధునాతన సెంటర్ కన్సోల్, ఫోర్డ్ సింక్3 సాఫ్ట్‌వేర్, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల సరికొత్త ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు నూతన స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌లో రీడిజైన్ చేయబడిన అధునాతన సెంటర్ కన్సోల్, ఫోర్డ్ సింక్3 సాఫ్ట్‌వేర్, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల సరికొత్త ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు నూతన స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఈ ఇంజన్‌తో పాటు అదనంగా 1.5-లీటర్ డీజల్ మరియు 1.0-లీటర్ కెపాసిటి గల ఎకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్‌లను కూడా ఫోర్డ్ ఇందులో పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెనో డస్టర్ ఎస్‌యూవీ తరువాత ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన రెండవ కాంపాక్ట్ ఎస్‌యూవీ పోర్డ్ ఎకోస్పోర్ట్. విడుదలైన తొలినాళ్లలో భారీ విక్రయాలు సాధించినప్పటికీ, ఈ సెగ్మెంట్లో పోటీ పెరగడం మరియు ఎకోస్పోర్ట్‌లో ఎలాంటి అప్‌డేట్స్ చోటు చేసుకోకపోవడంతో వీటి సేల్స్ క్రమంగా తగ్గుముఖం పట్టాయి.

అయితే, పూర్వవైభవం కోసం ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో భారీ మార్పులు చేసి ఫేస్‌లిఫ్ట్ రూపంలో వచ్చే నెల 9 వ తారీఖున విడుదలకు సిద్దం చేసింది. ఇది పూర్తి స్థాయిలో విడుదలైతే, మారుతి సుజుకి వితారా బ్రిజా, మహీంద్రా టియూవీ300, టాటా నెక్సాన్ వంటి ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Ford EcoSport Facelift India Launch Date Revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X