నెక్సాన్ దెబ్బకు ఎకోస్పోర్ట్‌ ఫేస్‌లిఫ్ట్‌‌ను సిద్దం చేస్తున్న ఫోర్డ్

Written By:

టాటా నెక్సాన్ గురించి ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ, ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లకు గుబలు పుట్టిస్తోంది. ఎస్‌యూవీ ట్రెండ్ నెక్సాన్‌ మీదకు మళ్లిందంటే ఎకోస్పోర్ట్ తీవ్రంగా నష్టపోవడం ఖాయం.

అయితే, ఫోర్డ్ తాజాగా ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను పరీక్షిస్తూ మీడియా కంటబడింది. ఇప్పటి వరకు ఉలుకూ పలుకు లేకుండా ఉన్న ఫోర్డ్ నెక్సాన్‌ను ఎదుర్కోవడానికి ఉన్నఫలంగా దీనిని పరీక్షిస్తున్నట్లు తెలిసింది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

మునుపటి ఎకోస్పోర్ట్‌తో పోల్చితే, ఫ్రంట్ డిజైన్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. క్రోమ్ స్లాట్స్ ఉన్న హెక్సా గోనల్ ఫ్రంట్ గ్రిల్, రీ డిజైన్ చేయబడిన ప్రొజెక్టర్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లను అందించింది.

Recommended Video - Watch Now!
Volkswagen Tiguan Review In Telugu - DriveSpark తెలుగు
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఫ్రంట్ గ్రిల్‌కు క్రిందగా అమర్చిన బంపర్‌లో సరిగ్గా హెడ్ ల్యాంప్స్‌కు క్రింద వైపు ఫాగ్ ల్యాంప్స్ అందివ్వడం జరిగింది. మరియు ఫ్రంట్ బంపర్ మీద ఫాక్స్ సిల్వర్ స్కఫ్ ప్లేటును కూడా అందివ్వడం జరిగింది.

ఎకోస్పోర్ట్ పేస్‌లిఫ్ట్ బాడీ మునుపటి డిజైన్‌నే పోలి ఉన్నప్పటికీ ఎక్ట్సీరియర్ మీద స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఇంజన్‌ విషయానికి వస్తే, గతంలో లభించే 1.0-లీటర్ ఎకోబూస్ట్ పెట్రోల్, 1.5-లీటర్ టిఐ-విసిటి పెట్రోల్ మరియు 1.5-లీటర్ టిడిసిఐ డీజల్ ఇంజన్‌లతో రానుంది.

అయితే, ఫోర్డ్ 1.5-లీటర్ డ్రాగన్ పెట్రోల్ ఇంజన్‌ను పెడల్ షిఫ్టర్స్ గల ఆటోమేటికిగ్ గేర్‌బాక్స్‌తో అందించే అవకాశం ఉన్నట్లు రిపోర్ట్స్ తెలిపాయి.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త లేదా ఫేస్‌లిఫ్ట్‌గా చెప్పుకునే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ గత వెర్షన్‌తో పోల్చితే, వెడల్పుగా, పెద్దదిగా ఉంది. ఎక్ట్సీరియర్ మరియు ఫ్రంట్ డిజైన్ పరంగా మార్పులు జరిగాయి. ప్రస్తుతం ఎకోస్పోర్ట్ వితారా బ్రిజా తీవ్ర పోటీని ఎదుర్కుంటోంది. పేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదలైతే కాస్త నిలదొక్కుకునే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Spy Pics: Ford EcoSport Facelift Spotted Testing Without Camouflage In India
Story first published: Friday, July 28, 2017, 15:24 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark