టైటానియం ఎస్ వేరియంట్లో పట్టుబడిన ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఫోర్డ్ ఇండియా తమ ఫేస్‌లిఫ్టెడ్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని విపణలోకి లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

By Anil

ఫోర్డ్ ఇండియా తమ ఫేస్‌లిఫ్టెడ్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని విపణలోకి లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. తాజాగా టైటానియమ్ ఎస్ వేరియంట్ పేరుతో రహస్యం పరీక్షలకొచ్చిన ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను ఓ ఆటోమొబైల్ మీడియా గుర్తించింది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

టైటానియం ప్రక్కన వచ్చిన ఎస్ అనగా స్పోర్ట్ అని తెలిసింది. గతంలో ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరియు ఫిగో ఆస్పైర్ సెడాన్ కార్లలో ఎస్ అక్షరాన్ని చేర్చి స్పోర్ట్ వేరియంట్లలో లాంచ్ చేసింది. ఎకోస్పోర్ట్ టైటానియం ఎస్‌ వేరియంట్లో 99బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ డీజల్ ఇంజన్ కలిగి ఉంది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

టైటానియం ఇతర వేరియంట్లతో పోల్చుకుంటే స్పోర్ట్ వెర్షన్‌లో ఎక్ట్సీరియర్ మీద క్రోమ్ పరికరాలు చాలా తక్కువ. ఇందులో డార్క్ గ్రే గ్రిల్, స్మోక్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు ఉన్నాయి.

Recommended Video

Tata Nexon Review: Specs
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్ వేరింయట్లో 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక వైపున సరికొత్త వీల్ కవర్, రూఫ్ స్పాయిలర్, ముందు మరియు వెనుక వైపున స్టాండర్డ్ ప్లాస్టిక్ బంపర్ ప్లాస్టిక్ బాడీ క్లాడింగ్, రూఫ్ మరియు రూఫ్ రెయిల్స్ బ్లాక్ కలర్‌లో ఉన్నాయి.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఎకోస్పోర్ట్ ఎస్ వేరియంట్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 8-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్కీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఈ ఫీచర్ మినహాయిస్తే పెద్దగా గుర్తించదగిన మార్పులేవీ చోటు చేసుకోలేదు.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

సాంకేతికంగా ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం ఎస్ వేరియంట్ అధునాతన 1.5-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల సామర్థ్యం ఉన్న డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. ఇది 121బిహెచ్‌‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీనితో పాటు 1-లీటర్ ఎకోబూస్ట్ ఇంజన్ వేరియంట్లో కూడా వచ్చే అవకాశం ఉంది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పూర్తి స్థాయిలో అప్‌డేట్ అయిన సరికొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఈ ఏడాది ముగిసేలోపు మార్కెట్లోకి విడుదల కానుంది. ఫేస్‌లిప్ట్ ఎకోస్పోర్ట్‌లో కాస్మొటిక్, ఫీచర్లు మరియు ఇంజన్ పరంగా కీలకమైన మార్పులకు గురవుతోంది. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి వస్తే, మార్కెట్లో ఉన్న మారుతి వితారా బ్రిజా, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా టియువి300 లతో పోటీపడనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Ford EcoSport Facelift Titanium S Trim Spotted Ahead Of Launch
Story first published: Friday, October 13, 2017, 18:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X