స్వల్ప మార్పులతో వచ్చే నెలలో విడుదల కానున్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్

Written By:

మీడియా ప్రతినిధుల సమాచారం మేరకు ఫోర్డ్ మోటార్స్ ఈ 2017 ఏడాదిలో రెండు ఎకో స్పోర్ట్ వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేరియంట్‌కు స్వల్ప మార్పులు, చేర్పులు చేసి ఫిబ్రవరి 2017 నాటికి అదే విధంగా గత ఏడాది లాస్ ఏంజిల్స్ మోటార్ వాహనాల ప్రదర్శన వేదిక మీద ప్రదర్శించిన 2017 వెర్షన్ ఎకోస్పోర్ట్ వేరియంట్‌ను వచ్చే దీపావళికి ఖాయం చేసినట్లు తెలిసింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్

భారీ మార్పులతో విపణిలోకి ఎకోస్పోర్ట్ ను విడుదల చేస్తామని ఇది వరకే పోర్డ్ ప్రకటించింది. అయితే రెండు వేరియంట్లుగా విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రస్తుతం స్వల్ప ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ అప్‌డేట్స్‌తో అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం అయ్యింది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్

ఫోర్డ్ గత ఏడాది లాస్ ఏంజిల్స్‌లో జరిగిన వాహన ప్రదర్శన వేదిక మీద 2017 ఎకోస్పోర్ట్ మోడల్‌ను ప్రదర్శించింది. ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్‌గా విడుదల కానున్న ఇందులో డిజైన్ పరంగా భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్‌ను దేశీయంగా ఉత్పత్తి చేసి అమెరికాకు ఎగుమతి చేయనుంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్

వచ్చే ఫిబ్రవరి 2017 నాటికి విడుదల కానున్న మొదటి ఎకోస్పోర్ట్ ఎస్‌యువి లో ఇంటీరియర్ పరంగా దీనికున్న పోటీదారులను ఎదుర్కునేందుకు ప్రత్యేక ఫీచర్లను పరిచయం చేస్తోంది. అందులో ఒకటి ఆప్షనల్‌ ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్

ప్రస్తుతం ఎకోస్పోర్ట్ కు వితారా బ్రిజా గట్టి పోటీగా నిలిచింది. ఇందులో ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి అప్లికేషన్లను సపోర్ట్ చేయగల తాకే తెర ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్

2017 దీపావళి నాటికి విడుదల కానున్న ఫేస్‌లిఫ్ట్ ఎకోస్పోర్ట్ వేరియంట్లో న్యూ స్టీరింగ్ వీల్, అప్‌డేట్స్ నిర్వహించిన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్ కన్సోల్ మరియు సింక్2 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి రానున్నాయి.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్

ఎక్ట్సీరియర్ పరంగా ఈ 2017 ఫేస్‌లిఫ్ట్ ఎకోస్పోర్ట్ పూర్తిగా స్పోర్టివ్ డిజైన్ శైలిలో మార్కెట్లోకి విడుదల కానుంది. సాంకేతిక వివరాల పరంగా ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. తాజా ఆటోమొబైల్ కథనాలు మరియు వార్తలు కోసం చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌స్పార్క్ (telugu.drivespark)

మారుతి సుజుకి స్విఫ్ట్ కొనాలనుకుంటున్నారా...? అయితే కొద్ది రోజులు వేచి ఉండండి. త్వరలో 2017 స్విప్ట్ మార్కెట్లోకి విడుదల కానుంది. నూతన డిజైన్ శైలిలో విడుదల కానున్న స్విఫ్ట్ ఎలా ఉందో ఇక్కడ ఉన్న ఫోటోల మీద క్లిక్ చేయండి.... 

 

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford EcoSport Gets Minor Updates; Launch Next Month
Story first published: Saturday, January 7, 2017, 13:55 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark