"ఫిగో క్రాస్" క్రాసోవర్‌ను పరీక్షిస్తున్న ఫోర్డ్

Written By:

ఫోర్డ్ ఇండియా తమ ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరియు ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్‌లను అప్‌డేట్ చేసే పనిలో నిమగ్నమయ్యింది. అయితే ఫోర్డ్ తాజాగా ఫిగో ఆధారిత సరికొత్త వేరియంట్‌ను ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తూ మీడియా కంటపడింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఫోర్డ్ ఫిగో క్రాస్ క్రాసోవర్‌

ఫోర్డ్ రహస్యంగా పరీక్షించిన మోడల్ బాడీ చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ కలిగి ఉంది. భారత్ మార్కెట్ కోసం క్రాసోవర్ స్టైల్లో ఫిగో ఫేస్‌లిఫ్ట్ కారును ఫోర్డ్ సిద్దం చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ మోడల్ ప్రస్తుతం విపణిలో ఉన్న హ్యుందాయ్ ఐ20, టయోటా ఎటియోస్ క్రాస్ మరియు హోండా డబ్ల్యూఆర్-వి వంటి క్రాసోవర్ సెగ్మెంట్ వాహనాలకు గట్టి పోటీనివ్వనుంది.

Recommended Video
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ఫోర్డ్ ఫిగో క్రాస్ క్రాసోవర్‌

ఫిగో క్రాస్ కారులో బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కారు ఎటవాలు తలం మీద ఉన్నందున మునుపటి ఫిగో కారులోని చక్రాలతో పోల్చుకుంటే చిన్నగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ క్రాసోవర్‌లో రూఫ్ రెయిల్స్ కూడా ఉన్నాయి. బాడీ మొత్తాన్ని నలుపు మరియు తెలుపు రంగు చారలున్న పేపర్‌తో కప్పేయడం ద్వారా డిజైన్ లక్షణాలను గుర్తించడం సాధ్యపడలేదు.

ఫోర్డ్ ఫిగో క్రాస్ క్రాసోవర్‌

ఫోర్డ్ ఇప్పటికే ఫిగో ఆధారిత క్రాసోవర్ కారును దక్షిణ అమెరికా మరియు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది. ఫోర్డ్ ఫిగో(Ka) ఆధారంగా అభివృద్ది చేసిన ఫిగో క్రాస్(Ka Trial) క్రాసోవర్ కారును ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్దం అవుతోంది.

ఫోర్డ్ ఫిగో క్రాస్ క్రాసోవర్‌

గతంలో ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరియు ఫిగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ కార్లు ఫోర్డ్ వారి డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్‌లతో రానున్నాయి అనే సమాచారం ఉండేది. అయితే ఇప్పుడు ఫిగో క్రాస్ కూడా వాటితో పాటు విడుదలకు సిద్దమవుతోంది.

ఫోర్డ్ ఫిగో క్రాస్ క్రాసోవర్‌

డ్రైవ్‍‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫోర్డ్ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ ఫిగో కారును 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించడానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఫిగో ఫేస్‌లిఫ్ట్ మరియు ఫిగో క్రాస్ క్రాసోవర్ కార్లు 2018లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్నాయి.

English summary
Read In Telugu: Ford Figo Cross Spotted Testing In India
Story first published: Wednesday, August 16, 2017, 11:19 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark