సౌత్-ఆఫ్రికాలో మేడిన్ ఇండియా ఫోర్డ్ కార్లు రీకాల్

Written By:

అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్ కంపెనీ దక్షిణాఫ్రికాలో సుమారుగా 16,000 వరకు మేడిన్ ఇండియా ఫిగో మరియు ఐకాన్ కార్లను రీకాల్ చేసింది. రికాల్ చేసిన వాటిలో మంటలు చెలరేగే అవకాశం ఉన్నట్లు గుర్తించి, వాటిని వెనక్కి పిలిచింది ఫోర్డ్.

మేడిన్ ఇండియా ఫోర్డ్ కార్లు రీకాల్

పవర్ స్టీరింగ్ కోసం వాడే ఆయిల్ లీక్ అయ్యే ఇంజన్ మీద ఎక్కువ పొగతో కూడిన మంటలు చేలరేగే అవకాశం ఉన్నట్లు గుర్తించిన వాటిని రీకాల్ చేసినట్లు ఫోర్డ్ తెలిపింది. 2004 నుండి 2012 మధ్య తయారైన కొన్ని కార్లలో ఈ సమస్య ఉన్నట్లు గుర్తించడం జరిగింది.

మేడిన్ ఇండియా ఫోర్డ్ కార్లు రీకాల్

ఫోర్డ్ వెల్లడించిన తదుపరి వివరాల మేరకు, "పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్ లీక్ అయ్యి, సెలెన్సర్(ఎగ్జాస్ట్) మీద పడటంతో దట్టమైన పొగలు వ్యాపించి మంటలు చెలరేగే అవకాశం ఉన్నట్లు గుర్తించడం జరిగిందని పేర్కొంది."

మేడిన్ ఇండియా ఫోర్డ్ కార్లు రీకాల్

ఈ ఏడాది ప్రారంభంలో కుగా ఎస్‌యూవీలో ఉన్నట్లుండి మంటలు వ్యాపిస్తున్నాయనే కారణంతో 4,500"కుగా" ఎస్‌యూవీలను ఫోర్డ్ సౌత్ ఆఫ్రికా విభాగం రీకాల్ చేసింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

విదేశీ మార్కెట్లలోని తమ ఉత్పత్తుల్లో లోపాలున్నయని తెలిస్తే, కార్ల తయారీ సంస్థలు వెంటనే రీకాల్ చేస్తాయి. కానీ ఇండియాలో మాత్రం లోపాలు ఉన్నట్లు తయారీ సంస్థల దృష్టికి తీసుకెళ్లినా రీకాల్ చేయవు. లోపాలను గుర్తించి, మళ్లీ అలాంటి లోపాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

English summary
Read In Telugu: Ford Recalls India-Made Figo And Ikon In South Africa
Story first published: Saturday, June 24, 2017, 8:30 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark