మూడేళ్ల గరిష్టానికి పెట్రోల్ మరియు డీజల్ ధరలు

Written By:

పెట్రోల్, డీజల్ రోజువారీ ధరల సమీక్ష విధానం ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై చాలా ప్రభావం చూపుతోంది. ఈ విధానంతో ఇంధన ధరలు రోజు రోజుకీ పెరగడం తప్పితే, తగ్గిన సంధర్భాలు చాలా తక్కువ.

రోజుకిన్ని పైసలు చొప్పున పెరుగుతూ వచ్చిన పెట్రోల్ మరియు డీజల్ ధరలు మూడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో ఇంధన ధరలు చుక్కలనుంటుతున్నాయి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
పెట్రోల్ మరియు డీజల్ ధరలు

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి....

పెట్రోల్:

  • ముంబాయ్ రూ. 79.54 లు
  • ఢిల్లీ రూ. 70.43 లు
  • కలకత్తా రూ. 73.17 లు
  • హైదరాబాద్ రూ. 74.58 లు
డీజల్:
  • హైదరాబాద్ రూ. 63.89 లు
  • ఢిల్లీ రూ. 58.80 లు
  • కలకత్తా రూ. 61.46 లు
  • ముంబాయ్ రూ. 62.46 లు
పెట్రోల్ మరియు డీజల్ ధరలు

గత మూడేళ్ల కాలంలో పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఎన్నడూ ఈ స్థాయికి చేరుకోలేదు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేసిన రోజువారీ ఇంధన ధరల సమీక్ష విధానంతో ఇంధన ధరలు మూడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి.

Recommended Video - Watch Now!
2017 Skoda Octavia RS Launched In India | In Telugu - DriveSpark తెలుగు
పెట్రోల్ మరియు డీజల్ ధరలు

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గడిచిన మూడు సంవత్సరాలలో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయంగా ఉన్న క్రూడ్ ఆయిల్ ధరల పతనంతో ఇండియాలో పెట్రోల్ మరియు డీజల్ ధరలు గణనీయంగా తగ్గాల్సి ఉంది.

పెట్రోల్ మరియు డీజల్ ధరలు

2013-14 లో క్రూడ్ ఆయిల్ సగటు ధర 105.52 డాలర్లుగా ఉండేది, అదే కాలంలో ఢిల్లీ పెట్రోల్ ధర రూ. 69.75 లుగా ఉండేది. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. దీంతో 2014-15లో క్రూడ్ ఆయిల్ ధర 84.16 డాలర్లకు పడిపోయింది. ఇప్పుడు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 66.37 లకు చేరుకుంది.

పెట్రోల్ మరియు డీజల్ ధరలు

ఆ తర్వాత ఏడాది 2015-16లో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 46.17 డాలర్లకు పడిపోయింది. అయినప్పటికీ ఇండియాలో పెట్రోల్ ధరలో పెద్ద మార్పులేవీ జరగలేదు. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ. 61.72 లుగా ఉండేది.

పెట్రోల్ మరియు డీజల్ ధరలు

2016-17 ఏడాదిలో ముడి చమురు ధరలు 47.56 డాలర్లుగా ఉంటే, ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 64.84 లుగా ఉంది. గడిచిన మూడేళ్ల కాలంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు విపరీతంగా తగ్గుతూ వచ్చాయి, వాటిని అనుసరిస్తే ఇండియాలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ 32 రుపాయల ధరతో లభించాల్సి ఉంది.

పెట్రోల్ మరియు డీజల్ ధరలు

అడ్డూ అదుపు లేకుండా పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు, జూన్ 16 నుండి రోజూ వారీ ఇంధన ధరలను సమీక్షించే విధానాన్ని అమలు చేయడంతో ప్రతి రోజూ కొన్ని పైసలు చొప్పున పెరిగిన ధరలు ఇప్పుడు మూడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి.

English summary
Read In Telugu: Petrol and diesel prices at 3 year high in India. Petrol and Diesel Rates change every day.
Story first published: Friday, September 15, 2017, 17:23 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark