21 ఇయర్స్ తరువాత మూతపడిన గుజరాత్ మొట్టమొదటి ఆటోమొబైల్ ప్లాంటు

Written By:

సరిగ్గా 21 సంవత్సరాల క్రితం గుజరాత్‌లో నెలకొల్పిన ప్లాంటు ఇప్పుడు మూత పడనుంది. దేశవ్యాప్తంగా అభివృద్దిలో మొదటి స్థానంలో ఉన్న గుజరాత్‌లో మొట్టమొదటి ప్రొడక్షన్ ప్లాంటు ఇదే కావడం గమనార్హం. వడోదరకు సమీపంలో ఉన్న హలోల్ ప్రాంతంలో ఉన్న జనరల్ మోటార్స్ ప్లాంటు తెరచుకుని ఈ ఏప్రిల్ 2017 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మూసివేత దిశగా గుజరాత్ షెవర్లే ప్లాంటు

జనరల్ మోటార్స్ ఏంటబ్బా అనుకుంటున్నారు కదా..? జనరల్ మోటార్స్ తమ కార్లను షెవర్లే పేరుతో విక్రయిస్తోంది. అమ్మకాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోకపోవడంతో అమెరికాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ తమ గుజరాత్ ప్లాంటును శాశ్వతంగా మూసివేనుంది.

మూసివేత దిశగా గుజరాత్ షెవర్లే ప్లాంటు

గత ఏడాది జనరల్ మోటార్స్ చేసిన ప్రకటన ప్రకారం, 2016 మధ్య భాగానికి తమ ప్రొడక్షన్ ప్లాంటులో శాశ్వతంగా ఉత్పత్తిని నిలిపివేసి, ప్లాంటును మూసివేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఉద్యోగుల తరలింపు, సప్లయర్స్ మరియు స్టాక్ హోల్డర్స్ మధ్య సెటిల్ అవ్వాల్సిన అనేక అంశాల కారణంగా మార్చి 2017 నాటికి ప్లాంటును మూసివేయనున్నారు.

మూసివేత దిశగా గుజరాత్ షెవర్లే ప్లాంటు

ఈ మధ్యనే కంపెనీకి చెందిన అధికారులు ప్రభుత్వ పెద్దలతో సమీక్ష నిర్వహించారు. ఇందులో సుమారుగా 650కు పైగా ఉద్యోగులు ఉద్యోగాన్నికోల్పోవాల్సి వస్తుంది. అయితే వీరిని వాలంటరీ సెపరేషన్ పథకం క్రింద తొలగించడానికి వీలు కలగడం లేదనే అంశం మీద మాట్లాడినట్లు తెలిసింది.

మూసివేత దిశగా గుజరాత్ షెవర్లే ప్లాంటు

హలోల్ ప్లాంటు వద్ద ఓ ఉద్యోగి మాట్లాడుతూ, సరిగ్గా నెల క్రితం వాలంటరీ సెపరేట్ స్కీమ్ క్రింది సూపర్ వైజర్లకు 35 నుండి 40 లక్షలు మధ్య ఆఫర్ చేశారు అదే అయితే సాధారణ ఉద్యోగులకు 8 నుండి 10 లక్షలు మాత్రమే అందిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

మూసివేత దిశగా గుజరాత్ షెవర్లే ప్లాంటు

గుజరాత్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జెఎన్ సింగ్ మాట్లాడుతూ, జనరల్ మోటార్స్ సంస్థ బిజినెస్‌ నిర్ణయంలో భాగంగా గుజరాత్‌లో ఉన్న ప్లాంటును మూసివేయడానికి నిర్ణయించింది. ఉద్యోగుల సమస్యలకు భరోసా ఇస్తూ, తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయవచ్చని గుజరాత్ ప్రభుత్వం తెలిపినట్లు ఆయన సూచించాడు.

మూసివేత దిశగా గుజరాత్ షెవర్లే ప్లాంటు

జనరల్ మోటార్స్ ఇప్పుడు అవసరంలో లేని ఆస్తులను చైనాకు చెందిన ఎస్ఏఐసి మోటార్ కార్ప్ సంస్థకు అమ్మివేయడానికి సిద్దపడింది.

మూసివేత దిశగా గుజరాత్ షెవర్లే ప్లాంటు

ఎస్ఏఐసి మోటార్ కార్ప్ సంస్థ మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి ఈ ప్లాంటుకు సంభందించి ఎలాంటి అభ్యంతరాలు లేవు అని తెలిపే సర్టిఫేట్ ఇస్తే, గుజరాత్‌లోని జనరల్ మోటార్స్ ప్లాంటును కొనుగోలు చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపింది.

మూసివేత దిశగా గుజరాత్ షెవర్లే ప్లాంటు

కొనసాగింపుగా గ్రీన్ ఫీల్డ్ కార్ ప్రొడక్షన్ ప్లాంటు కోసం మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ మరియు గుజరాత్ ప్రభుత్వాలతో ఎస్ఏఐసి అధికారులు సంప్రదింపులు జరపనున్నారు.

మూసివేత దిశగా గుజరాత్ షెవర్లే ప్లాంటు

గుజరాత్‌లోని జనరల్ మోటార్స్ ప్లాంటు పూర్తిగా మూసివేయబడితే, టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా మరియు ఇతర ఆటోమొబైల్ దిగ్గజాలు తమ తలుపులను ఇక్కడ తెరవనున్నాయి. అంతే కాకుండా ఈ ప్లాంటుకు సమీపంలో హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ తమ ప్రొడక్షన్ ప్లాంటును నిర్మిస్తోంది.

మూసివేత దిశగా గుజరాత్ షెవర్లే ప్లాంటు

మీరు షెవర్లే కార్లకు వీరాభిమానులా...అయితే షెవర్లే ఇండియా వద్ద ఉన్న ఉత్పత్తుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

 

English summary
Gujarat's First Automotive Factory Set To Shut Down After 21 Years!
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark