హైబ్రిడ్ కార్ల మీద 15 శాతం సెస్ తొలిగించే ఆలోచనలో ఉన్న కేంద్రం

ఆగష్టు 5, 2017 న సమావేశం కానున్న జిఎస్‌టి మండలి హైబ్రిడ్ వాహనాల మీద సెస్ మినహాయింపు గురించి చర్చించనున్నట్లు తెలిసింది.

By Anil

భారత ఆర్థిక రంగంలో ట్యాక్స్ విధానం అత్యంత ముఖ్యమైనది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకమైన ట్యాక్స్ ఉండేది. అయితే తాజాగా కేంద్రం ప్రభుత్వం ఒకే దేశం ఒకే ట్యాక్స్ అంటూ పరిచయంచ చేసిన వస్తు మరియు సేవల పన్ను అమల్లోకి వచ్చింది. కొన్ని ప్రొడక్ట్స్ మినహా దాదాపు అన్ని ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకొచ్చారు.

హైబ్రిడ్ కార్ల మీద జిఎస్‌టి తగ్గించనున్న కేంద్రం

అయితే దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర వహించే ఆటోమొబైల్ రంగం మీద స్వాగతించిన రీతిలోనే ట్యాక్స్ నిర్ణయించారు. కానీ పర్యావరణహితమైన హైబ్రిడ్ వాహనాల మీద జిఎస్‌టి పేరుతో ట్యాక్స్ విపరీతంగా పెంచేశారు. దీంతో హైబ్రిడ్ వాహనాలను ఉత్పత్తి చేసే సంస్థలు, వాటి మీద ట్యాక్స్ తగ్గించాలని పలుమార్లు జిఎస్‌టి మండలిని అభ్యర్థించాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.

Recommended Video

Volkswagen Tiguan Review In Telugu - DriveSpark తెలుగు
హైబ్రిడ్ కార్ల మీద జిఎస్‌టి తగ్గించనున్న కేంద్రం

కానీ తాజాగా అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం, హైబ్రిడ్ వాహనాల మీద 15 శాతం మేర సెస్ తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆగష్టు 5, 2017 న సమావేశం కానున్న జిఎస్‌టి మండలి హైబ్రిడ్ వాహనాల మీద సెస్ మినహాయింపు గురించి చర్చించనున్నట్లు తెలిసింది.

హైబ్రిడ్ కార్ల మీద జిఎస్‌టి తగ్గించనున్న కేంద్రం

జిఎస్‌టి ప్రకారం, వాహనాల మీద గరిష్టంగా 28 శాతం ట్యాక్స్ నిర్ణయించిద. వాహనాలను వివిధ కెటిగిరీలుగా విభజించి ఒక్కో కెటగిరీ మీద అదనపు సెస్ విధించింది. ప్రస్తుతం హైబ్రిడ్ ఉత్పత్తుల మీద 28 శాతం ట్యాక్స్ మరియు 15 శాతం సెస్ కలుపుకొని మొత్తం 43 ట్యాక్స్ ఉంది. దీంతో అదనంగా విధించిన 15 శాతం సెస్‌ను తొలగించే అవకాశం ఉంది.

హైబ్రిడ్ కార్ల మీద జిఎస్‌టి తగ్గించనున్న కేంద్రం

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మారుతి సుజు, టయోటా మరియు మహీంద్రా ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు హైబ్రిడ్ వాహనాలను విక్రయిస్తున్నారు. జిఎస్‌టి అమలైన తరువాత ఈ వాహనాల ధరలు గరిష్టంగా రూ. 1.5 లక్షలు పెరిగాయి. ఒకవేళ 15 శాతం మినహాయింపు అమల్లోకి వస్తే, హైబ్రిడ్ కార్ల పాత ధరల కన్నా మరింత తగ్గిపోనున్నాయి.

హైబ్రిడ్ కార్ల మీద జిఎస్‌టి తగ్గించనున్న కేంద్రం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పెట్రోల్ మరియు డీజల్ ఇంధనంతో నడిచే వాహనాలతో పోల్చుకుంటే హైబ్రిడ్ వాహనాలు తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయి. అయితే కాలుష్య కారకవాహనాల మీద ట్యాక్స్ తగ్గించడం మరియు పర్యావరణహితమైన వాహనాల మీద ట్యాక్స్ పెంచడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే రానున్న ఆగష్టు 5, 2017 సమావేశంలో హైబ్రిడ్ వాహనాల మీద 15 శాతం సెస్ మినహాయింపు చేస్తే, ఎకో ఫ్రెండ్లీ వాహనాల వినియోగంపైప్రజలను చైతన్యపరచవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: Government Planning To Remove 15 Percent cess On Hybrid Cars
Story first published: Friday, July 28, 2017, 19:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X