కార్ల మీద భారీగా GST పెంపునకు ఆమోదం తెలిపిన కేంద్రం: అమలయ్యేలోపే నచ్చిన కారు కొనేసుకోండి...!!

Written By:

నాలుగు మీటర్ల కన్నా ఎక్కువ పొడవున్న కార్లు మరియు ఎస్‌యూవీల మీద ప్రస్తుతం ఉన్న 15 శాతం జిఎస్‌టి సెస్‌ను 25 శాతానికి పెంచడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

దేశ ఆర్థిక రంగంలో కీలకమైన పన్ను విధానాన్నే మార్చేస్తూ, జూలై 1, 2017 నుండి నూతన పన్ను విధానం వస్తు మరియు సేవల పన్ను(GST)ను కేంద్రం అమల్లోకి తెచ్చింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఎక్సైజ్ డ్యూటి, సర్వీస్ ట్యాక్స్ మరియు మరియు వ్యాట్ వంటి ట్యాక్సులను జిఎస్‌టి భర్తీ చేసింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
 కార్ల మీద భారీగా GST పెంపునకు ఆమోదం

కేంద్రం కొత్త పన్ను విధానాన్న అమలు చేయడంతో లగ్జరీ కార్లు, ఎస్‌యూవీలు మరియు పెద్ద కార్ల మీద లక్ష రుపాయల నుండి 3 లక్షల వరకు ధరలు తగ్గాయి. అయితే ఇప్పుడు మళ్లీ జిఎస్‌టి సెస్ పెంపుకు జిఎస్‌టి మండలి నిర్ణయం తీసుకుంది.

Recommended Video
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
 కార్ల మీద భారీగా GST పెంపునకు ఆమోదం

జిఎస్‌టి సెస్ పెంపు అంటే ఏమిటి ? కార్ల ధరల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది ?

చిన్న కార్లు మినహాయిస్తే అన్ని మిడ్ సైజ్ కార్లు, లగ్జరీ కార్లు మరియు ఎస్‌యూవీల మీద ప్రస్తుతం ఉన్న జిఎస్‌టి ట్యాక్స్‌ మరో పది శాతం మేర పెరుగుతోంది. ఈ వాహనాలకు ఉదాహరణగా, హోండా సిటి, హ్యుందాయ్ వెర్నా, టాటా హెక్సా, టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు లగ్జరీ కార్ల సంస్థలైన ఆడి, మెర్సిడెస్ బెంజ్ మరియు బిఎమ్‌డబ్ల్యూ వంటి కార్ల ధరలు మళ్లీ పెరగనున్నాయి.

 కార్ల మీద భారీగా GST పెంపునకు ఆమోదం

2017 జిఎస్‌టి చట్టం లోని సెక్షన్ 8 ప్రకారం పునసమీక్షించిన జిఎస్‌టిని అమలు చేసేందుకు జిఎస్‌టి సవరణ బిల్లును ప్రవేశపెట్టాలి. దీనిని చట్టపరంగా అమలు చేసేందుకు పార్లమెంటు ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. అయితే పార్లమెంట్ సమావేశాలు లేకపోవడంతో జిఎస్‌టిలో జరిగిన మార్పులు అమలయ్యేందుకు మరో ఆరు నెలలు సమయం పడుతుంది.

 కార్ల మీద భారీగా GST పెంపునకు ఆమోదం

సెడాన్లు మరియు ఎస్‌యూవీల మీదే జిఎస్‌టి సెస్ పెంపు ఎందుకు ?

ప్యాసింజర్ కార్ల మీద గరిష్ట జిఎస్‌టి రేటు 28 శాం మరియు 1 నుండి 15 శాతం వరకు సెస్‌ను జిఎస్‌టి అమలు చేసినపుడు కేంద్రం నిర్ణయించింది. అయితే, రిపోర్ట్స్ ప్రకారం, జిఎస్‌టి అమలు చేసిన తరువాత కార్ల మీద ఉన్న ట్యాక్స్, జిఎస్‌టి ముందు అమలయ్యే ట్యాక్స్‌తో పోల్చుకుంటే తక్కువగా ఉందని తెలిసింది.

 కార్ల మీద భారీగా GST పెంపునకు ఆమోదం

జిఎస్‌టి నిర్ణయించడంలో ఉన్న అసమానతలను సరిచేసేందుకు జిఎస్‌టి కౌన్సిల్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మరియు రాష్ట్ర ప్రతినిధులకు ఆగష్టు 5, 2017 న జరిగిన సమావేశంలో జిఎస్‌టి పెంపు గురించి వివరించింది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం పైన తెలిపిన కార్ల మీద ఉన్న 15 శాతం జిఎస్‌టి సెస్సును 25 కి పెంచడానికి ఆమోదం లభించింది.

 కార్ల మీద భారీగా GST పెంపునకు ఆమోదం

పెరిగిన జిఎస్‌టి సెస్ ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది ?

జిఎస్‌టి చట్ట సవరణలో మార్పులు జరిపితే, దాని అమలుకు జిఎస్‌టి మండలి ఒక తేదీని వెల్లడిస్తుంది. సెప్టెంబర్ 9, 2017 న జరగనున్న సమావేశంలో దీని గురించి కీలక నిర్ణయాలు మరియు పెరిగిన జిఎస్‌టి అమలయ్యే తేదీ వివరాలను వెల్లడించనుంది.

 కార్ల మీద భారీగా GST పెంపునకు ఆమోదం

నాలుగు మీటర్ల పొడవులోపు ఉన్న మరియు 1200సీసీ కన్నా తక్కువ ఇంజన్ కెపాసిటి ఉన్న పెట్రోల్ కార్ల మీద 28 శాతం జిఎస్‌టి రేటు మరియు 1 శాతం జిఎస్‌టి సెస్ ఉంది. అదే విధంగా నాలుగు మీటర్ల లోపు పొడవున్న మరియు 1500సీసీ కన్నా తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న డీజల్ కార్ల మీద 28 శాతం జిఎస్‌టి రేటుతో పాటు 3 శాతం జిఎస్‌టి సెస్ ఉంది.

 కార్ల మీద భారీగా GST పెంపునకు ఆమోదం

నాలుగు మీటర్ల కన్నా అధిక పొడవున్న మరియు ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న సెడాన్, ఎస్‌యూవీ వాహనాల మీద 28 శాతం జిఎస్‌టి రేటుతో పాటు 15 శాతం జిఎస్‌టి సెస్ అమలవుతుండేది. అయితే జిఎస్‌టి మండలి తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న ఈ 15 శాతం జిఎస్‌టి సెస్ 25 శాతానికి పెరగనుంది. కాబట్టి పొడవాటి మరియు పెద్ద కార్ల మీద మొత్తం ట్యాక్స్ 53 శాతానికి పెరగనుంది.

 కార్ల మీద భారీగా GST పెంపునకు ఆమోదం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పెరిగిన జిఎస్‌‌టి సెస్ అమలవ్వడానికి మరికొంత సమయం పట్టనుంది. కాబట్టి నూతన జిఎస్‌టి కారణంగా కార్ల ధరలు పెరిగిలోపే మీకు నచ్చిన ఎస్‌యూవీ లేదా కారును వెంటనే ఎంచుకోండి.

English summary
Read In Telugu: Union Cabinet Approves Hike In GST Cess On Sedans And SUVs
Story first published: Thursday, August 31, 2017, 12:29 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark