జిఎస్‌టిలో సవరణ: వాహన రంగంపై సెస్ ఎత్తివేసిన కేంద్రం

Written By:

నూతన పన్ను విధానం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనుగుణంగా కార్లు మరియు బైకుల మీద నిర్ధిష్ట పన్ను 28 శాతం తో పాటు వాహనాల రేంజ్ ఆధారంగా 1 నుండి 3 శాతం వరకు సెస్ చెల్లించాలని కేంద్రం ప్రభుత్వం జిఎస్‌టిలో పొందుపరించింది. అయితే అన్ని వాహననాల మీద నిర్ధిష్ట పన్ను 28 శాతం మినహాయిస్తే, ఎలాంటి సెస్ చెల్లించనవసరం లేదని ప్రకటించింది.

ఆటోమొబైల్స్‌పై సెస్ తొలగించిన కేంద్రం

పరిశ్రమల(డెవలప్‌మెంట్ మరియు రెగ్యులేషన్) చట్టం 1951 అనుగుణంగా, 2017 పన్ను విధింపు సవరణ చట్టం ప్రకారం - ఆటోమొబైల్స్ (కార్లు మరియు బైకులు) మీద ఎలాంటి సెస్ చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించింది.

ఆటోమొబైల్స్‌పై సెస్ తొలగించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జిఎస్‌టి మేరకు, 1,200సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న పెట్రోల్ కార్లు మీద 28 శాతం ట్యాక్స్‌తో పాటు 1 శాతం సెస్ చెల్లించాలి, అదే విధంగా 1,500సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న డీజల్ కార్లు మీద 28 శాతం ట్యాక్స్‌తో పాటు 3 శాతం సెస్ చెల్లించాల్సి ఉండేది.

ఆటోమొబైల్స్‌పై సెస్ తొలగించిన కేంద్రం

టూ వీలర్ల విషయానికి వస్తే, 350సీసీ కన్నా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లు 28 శాతం ట్యాక్స్ చెల్లిస్తూ, అదనంగా మూడు శాతం సెస్ చెల్లించాలని జిఎస్‌టిలో పొందుపరిచింది.

ఆటోమొబైల్స్‌పై సెస్ తొలగించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో జూలై 1, 2017 నుండి అమల్లోకి రానున్న జిఎస్‌టి ప్రకారం, కార్లు మరియు బైకులు రెండింటి మీద ఉన్న 28 శాతం ట్యాక్స్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. వీటి మీద ఉన్న సెస్‌ను పూర్తిగా తొలగించింది.

ఆటోమొబైల్స్‌పై సెస్ తొలగించిన కేంద్రం

వస్తు మరియు సేవల పన్ను సులభంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల సెస్‌లను ఎత్తివేస్తూ వస్తు సేవల పన్ను(GST)ను మరింత సులభతరం చేసే క్రమంలో వాహన రంగం మీద ఉన్న అన్ని రకాల సెస్ ఎత్తివేసింది.

ఆటోమొబైల్స్‌పై సెస్ తొలగించిన కేంద్రం

చిన్న కార్ల మీద సెస్ అధికంగా ఉండటంతో చిన్న కార్ల ఉత్పత్తి విక్రయాలతో పాటు ఎగుమతుల మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతున్న ఇండియన్ ఆటోమొబైల్ నిపుణులు ఆందోళన చెందారు. దీంతో దేశీయ చిన్న కార్ల పరిశ్రమ కుదేలయ్యే అవకాశం కూడా కనిపించింది.

English summary
Read In Telugu Government Withdraws Cess On Automobiles
Story first published: Thursday, June 8, 2017, 15:50 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark