జిఎస్‌టి ప్రభావం: హోండా కార్లపై గరిష్టంగా రూ. 1.31 లక్షల వరకు తగ్గిన ధరలు

Written By:

జపాన్ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా విభాగం, దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన జిఎస్‌టి ఆధారంగా అన్ని మోడళ్ల మీద జిఎస్‌టి ఆధారంగా ధరలు తగ్గించింది. ధరల తగ్గింపు అనంతరం సవరించిన అన్ని కార్ల ధరలను తక్షణమే అమల్లోకి తెచ్చినట్లు హోండా పేర్కొంది.

హోండా కార్ల పై తగ్గిన ధరలు

హోండా ఇండియా లైనప్‌లోని ప్రారంభ మోడల్ బ్రియో హ్యాచ్‌బ్యాక్ మీద గరిష్టంగా రూ. 12,279 లు తగ్గించగా, బ్రియో ఆధారిత కాంపాక్ట్ సెడాన్ అమేజ్ మీద గరిష్టంగా రూ. 14,825 ల వరకు తగ్గించడం జరిగింది.

హోండా కార్ల పై తగ్గిన ధరలు

హోండా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ జాజ్ మీద రూ. 10,031 లు, ఈ మధ్యనే విపణిలోకి విడుదల చేసిన డబ్ల్యూఆర్-వి కాంపాక్ట్ క్రాసోవర్ ఎస్‌యూవీ మీద రూ. 10,064 లు అదే విధంగా బిఆర్-వి ఎస్‌యూవీ మీద రూ. 30,387 ల వరకు తగ్గించబడింది.

హోండా కార్ల పై తగ్గిన ధరలు

హోండాకు మంచి విక్రయాలు సాధించిపెడుతూ, దేశీయ మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో అత్యుత్త ఫలితాలు కనబరుస్తున్న సిటి సెడాన్ లోని అన్ని వేరియంట్ల మీద రూ. 16,510 ల నుండి గరిష్టంగా రూ. 28,005 ల వరకు తగ్గించడం జరిగింది.

హోండా కార్ల పై తగ్గిన ధరలు

ప్రీమియమ్ ఎస్‌యూవీ అయిన సిఆర్-వి మీద గరిష్టంగా రూ. 1,31,663 ల వరకు తగ్గించగా, తమ అకార్డ్ హైబ్రిడ్ కారు ధరల సవరణ ఇంకా పూర్తి చేయలేదు. తగ్గించబడిన అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి. ఈ ధరల తగ్గింపు వివిధ నగరాల మధ్య వ్యత్యాసం ఉండవచ్చు.

హోండా కార్ల పై తగ్గిన ధరలు

ప్యాసింజర్ కార్ల మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి, పోర్డ్, టయోటా లతో పాటు జాగ్వార్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి మరియు మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలు కూడా తమ అన్ని మోడళ్ల మీద జిఎస్‌టికి అనుగుణంగా ధరల సవరణ చేపట్టి జిఎస్‌టి ప్రతిఫలాలను అందిస్తున్నాయి.

English summary
Read In Telugu: GST Effect Honda Cars Cuts Vehicle Prices
Story first published: Tuesday, July 4, 2017, 17:14 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark