2017 హోండా అమేజ్ ప్రివిలేజ్ ఎడిషన్ విడుదల: ధర రూ. 6.49 లక్షలు

హోండా మోటార్స్ విపణిలోకి 2017 అమేజ్ ప్రివిలేజ్ ఎడిషన్ విడుదల చేసింది. రూ. 6.49 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌ను ప్రివిలేజ్ ఎడిషన్‌లో విడుదల చేసిన హోండా ప్రకటించింది.

By Anil

హోండా మోటార్స్ విపణిలోకి 2017 అమేజ్ ప్రివిలేజ్ ఎడిషన్ విడుదల చేసింది. రూ. 6.49 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌ను ప్రివిలేజ్ ఎడిషన్‌లో విడుదల చేసిన హోండా ప్రకటించింది.

2017 హోండా అమేజ్ ప్రివిలేజ్ ఎడిషన్ విడుదల

జపాన్ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్‌లో అమేజ్ ఒక బెస్ట్ సెల్లింగ్ కారు. అమేజ్‌ను 2013లో తొలిసారిగా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన అమేజ్ ప్రివిలేజ్ ఎడిషన్‌లో హోండా వారి డిజిప్యాడ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సరికొత్త బాడీ గ్రాఫిక్స్, ప్రివిలేజ్ ఎడిషన్‌ను సూచించే చిహ్నం వంటివి ఉన్నాయి.

2017 హోండా అమేజ్ ప్రివిలేజ్ ఎడిషన్ విడుదల

హోండా అమేజ్ ప్రివిలేజ్ ఎడిషన్ ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి...

  • హోండా అమేజ్ ప్రివిలేజ్ ఎడిషన్ పెట్రోల్ ధర రూ. 6,48,888 లు
  • హోండా అమేజ్ ప్రివిలేజ్ ఎడిషన్ డీజల్ ధర రూ. 7,73,631 లు
  • 2017 హోండా అమేజ్ ప్రివిలేజ్ ఎడిషన్ విడుదల

    అమేజ్ ఇంజన్, స్పెసిఫికేషన్స్ మరియు మైలేజ్...

    హోండా అమేజ్ ప్రివిలేజ్ ఎడిషన్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తోంది. పెట్రోల్ వెర్షన్ అమేజ్‌లో 88బిహెచ్‌పి పవర్ మరియు 109ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ గల 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ కలదు.

    2017 హోండా అమేజ్ ప్రివిలేజ్ ఎడిషన్ విడుదల

    అమేజ్ ప్రివిలేజ్ ఎడిషన్‌లోని డీజల్ వెర్షన్‌లో 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కలదు, 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 99బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

    హోండా ప్రకటించిన వివరాల ప్రకారం, అమేజ్ ప్రివిలేజ్ ఎడిషన్ లోని పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 17.8కిలోమీటర్లు మరియు డీజల్ వేరియంట్ లీటర్‌కు 25.8కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలవు.

    2017 హోండా అమేజ్ ప్రివిలేజ్ ఎడిషన్ విడుదల

    డిజైన్ మరియు ఫీచర్లు

    హోండా అమేజ్ ప్రివిలేజ్ ఎడిషన్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దాదాపు రెగ్యులర్ వెర్షన్‌ అమేజ్‌నే పోలి ఉంటుంది. అయితే ఎక్ట్సీరియర్ మీద న్యూ బాడీ గ్రాఫిక్స్ అదే విధంగా ప్రిలేజ్ ఎడిషన్ సూచించే చిహ్నాన్ని అందివ్వడం జరిగింది.

    అయితే ఇంటీరియర్‌లో ఎన్నో కొత్త ఫీచర్లను అందివ్వడం జరిగింది. ప్రత్యేకించి హోండా వారి సరికొత్త 7-అంగుళాల డిజిప్యాడ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రివిలేజ్ ఎడిషన్‌ను సూచించే బీజి కలర్ సీట్ కవర్లు, డ్రైవర్ సైడ్ ఆర్మ్ రెస్ట్ అదే విధంగా రియర్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి.

    2017 హోండా అమేజ్ ప్రివిలేజ్ ఎడిషన్ విడుదల

    అమేజ్ప్రివిలేజ్ ఎడిషన్ లోని డిజిప్యాడ్ ఫీచర్లు....

    • శాటిలైట్‌తో లింక్ అయిన ఇన్ బిల్ట్ త్రీడి న్యావిగేషన్
    • ఇంటర్నల్ మీడియా మెమొరీలో 1.5జిబి మై స్టోరేజ్
    • మిర్రర్ లింక్ సపోర్ట్ గల స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి
    • ఆప్షనల్ వైఫై కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఇ-మెయిల్ మరియు లైవ్ ట్రాఫిక్ వంటి వాటిని యాక్సెస్ చేయవచ్చు.
    • మీడియా, న్యావిగేషన్ మరియు కాలింగ్ కోసం వాయిస్ కమాండ్
    • స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్ ఆక్టివేషన్
    • హ్యాండ్స్ ఫ్రీ టెలిఫోన్ మరియు ఆడియో కోసం బ్లూటూత్
    • ఏఎమ్/ఎఫ్ఎమ్ డిజిటల్ రేడియో ట్యూనర్ మరియు MP3/WAV, iPod/iPhone సపోర్ట్ కలదు.
    • రెండు యుఎస్‌బి స్లాట్లు, రెండు మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్లు, మరియు హెచ్‌డిఎమ్‌ఐ-ఇన్ పోర్ట్ కలదు.
    • 2017 హోండా అమేజ్ ప్రివిలేజ్ ఎడిషన్ విడుదల

      రెగ్యులర్ వెర్షన్ అమేజ్ లోని ఎస్(ఒ) మ్యాన్యువల్ వేరియంట్ ఆధారంగా అమేజ్ ప్రివిలేజ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టారు. ఈ రెండింటి మధ్య ధర వ్యత్యాసం కేవలం రూ. 10,000 లు మాత్రమే.

      హోండా అమేజ్‌ ప్రివిలేజ్ ఎడిషన్ ఎస్(ఒ) మ్యాన్యువల్ వేరియంట్లోని డీజల్ వెర్షన్‌లో భద్రత పరంగా, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు మరియు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. అయితే పెట్రోల్ వెర్షన్‌లో ఇవి మిస్సయ్యాయి.

      హోండా అమేజ్ ప్రస్తుతం విపణిలో ఉన్న మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఎక్సెంట్, వోక్స్‌వ్యాగన్ అమియో, టాటా టిగోర్ మరియు ఫోర్డ్ ఆస్పైర్ లకు పోటీగా ఉంది. మీ నగరంలో మీకు నచ్చిన కార్ల ధరలు ఇక్కడ తెలుసుకోండి....

Most Read Articles

English summary
Read In Telugu: 2017 Honda Amaze Privilege Edition Launched In India; Prices Start From Rs 6.49 Lakh
Story first published: Wednesday, July 19, 2017, 11:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X