నచ్చిన హోండా కారును కొనేందుకు మంచి తరుణం: ఎందుకంటే ?

Written By:

ఇండియాలో పండుగ సీజన్ మొదలైన నేపథ్యంలో హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ది గ్రేట్ హోండా ఫెస్టివ్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా విక్రయ కేంద్రాలలో గ్రేట్ హోండా ఫెస్టివ్‌ను నిర్వహించనున్నారు. హోండా కారును కొనే ఆలోచన ఉన్నవారికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ది గ్రేట్ హోండా ఫెస్ట్

పండుగ ప్రమోషన్లలో భాగంగా హోండా తమ కస్టమర్లకు భారీ ఆఫర్లను అందుబాటులో ఉంచింది. అంతే కాకుండా హోండా నిర్వహిస్తున్న స్పేస్, ఎర్త్ మరియు ఓషియన్ అడ్వెంచర్ కాంటెస్ట్‌లో పాల్గొనే జంటలు ఉచిత అమెరికా ట్రిప్పుకు సెలక్ట్ అవ్వగలరు.

Recommended Video
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
ది గ్రేట్ హోండా ఫెస్ట్

ది గ్రేట్ హోండా ఫెస్టివ్ ‌లో అందించే ఆఫర్లు మరియు ప్రయోజనాలు సెప్టెంబర్ మొత్తం ఉండనున్నాయి. సెప్టెంబర్ 1 నుండి 31 వరకు హోండా కార్లను డెలివరీ తీసుకున్న వారికి మాత్రమే ఆఫర్లు లభించనున్నాయి.

ది గ్రేట్ హోండా ఫెస్ట్

సెప్టెంబర్‌లో హోండా కార్లను కొనేవారు ది గ్రేట్ హోండా ఫెస్టివ్‌లో పాల్గొనేందుకు హోండా అఫీషియల్ వెబ్‌సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాంటెస్ట్ విజేతలను సెప్టెంబర్ చివరలో హోండా ప్రకటించనుంది. కంప్యూటర్ ద్వారా లక్కీ డ్రా తీసి విజేతలను ఎంపిక చేయనున్నారు. కాంటెస్ట్ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఆడిటర్లను హోండా నియమించింది.

ది గ్రేట్ హోండా ఫెస్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కార్లను కొనుగోలు చేసే వారందరికీ ఒక శుభప్రదమైన సమయంగా సెప్టెంబర్ నెలను చెప్పుకోవచ్చు. నిజానికి పండుగ సీజన్ ప్రారంభమైతే తమ కలల కారును కొనుగోలు చేయాలనుకునే వారు ఎక్కువ. హోండా తమ ది గ్రేట్ హోండా ఫెస్టివ్ ద్వారా కస్టమర్లకు అత్యుత్తమ ఆఫర్లను అందించాడనికి సిద్దమైంది.

English summary
Read In Telugu: Honda Announces ‘The Great Honda Fest’ — The Perfect Time To Drive Home A Honda
Story first published: Saturday, September 2, 2017, 11:07 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark