హోండా బిఆర్-విలో మరో విప్లవాత్మక ఫీచర్
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తమ 7-సీటర్ బిఆర్-వి ఎస్‌యూవీలో సరికొత్త 7-అంగుళాల పరిమాణం ఉన్న డిజిప్యాడ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించింది.
హోండా కార్స్ ఇండియా తమ 7-సీటర్ బిఆర్-వి ఎస్‌యూవీలో సరికొత్త 7-అంగుళాల పరిమాణం ఉన్న డిజిప్యాడ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించింది. ఈ ఫీచర్ బిఆర్-వి టాప్ ఎండ్ వేరియంట్ విఎక్స్(VX)లో మాత్రమే లభిస్తున్నట్లు హోండా తెలిపింది.

బిఆర్-వి టాప్ స్పెక్ వేరియంట్లో లభించే డిజిప్యాడ్ 7-ఇంచెస్ అడ్వాన్స్‌డ్ టచ్ స్క్రీన్ ఆడియో వీడియో న్యావిగేషన్ (AVN)సిస్టమ్ హోండా వారి విప్లవాత్మక ఫీచర్. ప్రస్తుతం హోండాకు భారీ విక్రయాలు సాధించిపెడుతున్న సిటి మరియు డబ్ల్యూఆర్-వి కార్లలో కూడా ఈ ఫీచర్ కలదు.

ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో 1.5జిబి మెమొరీ గల త్రీడి న్యావిగేషన్ సిస్టమ్, స్మార్ట్ ఫోన్‌ల కోసం మిర్రర్ లింక్ సపోర్ట్, వాయిస్ కమాండ్ ఫీచర్, బ్లూటూత్, ఏఎమ్/ఎఫ్ఎమ్, ఎమ్‌పి3, రెండు యుఎస్‌బి స్లాట్లతో పాటు హెచ్‌డిఎమ్ఐ-ఇన్ పోర్ట్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

ఇదే కాకుండా, బిఆర్-వి లోని ఎస్ వేరియంట్ మరియు టాప్ ఎండ్ వేరియంట్లలో రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.
- అప్‌డేటెడ్ బిఆర్-వి విఎక్స్ మ్యాన్యువల్ పెట్రోల్ ధర రూ. 12.27 లక్షలు మరియు
- బిఆర్-వి విఎక్స్ మ్యాన్యువల్ డీజల్ వేరియంట్ ధర రూ. 13.22 లక్షలు, (రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.) బిఆర్-విపెట్రోల్ మరియు సివిటి వేరియంట్లలో ఏవిఎన్ సిస్టమ్ అందివ్వలేదు.
Recommended Video


సాంకేతికంగా హోండా బిఆర్-వి పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు వరుసగా 117బిహెచ్‌పి పవర్ మరియు 99బిహెచ్‍పి పవర్ ఉత్పత్తి చేస్తాయి. వీటిలో పెట్రోల్ వేరియంట్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో, డీజల్ వేరియంట్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభించును.

హోండా బిఆర్-వి లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, 16-అంగుళాల పరిమాణం ఉన్న డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, మూడు వరుసల సీటింగ్, టాప్ ఎండ్ వేరియంట్లో లెథర్ అప్‌హోల్‌స్ట్రే ఉన్నాయి.

భద్రత పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లను అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా అందిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
హోండా మోటార్స్ తమ విప్లవాత్మక డిజిప్యాడ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఫీచరను సిటి, డబ్ల్యూఆర్-వి తర్వాత మూడవ మోడల్‌గా బిఆర్-విలో అందించింది. దీంతో పాటు రియర్ పార్కింగ్ సెన్సార్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
6 లేదా 7 మంది కూర్చునే సీటింగ్ సామర్థ్యం, మంచి ఎంటర్‌టైన్‍మెంట్ మరియు సేఫ్టీ ఫీచర్లతో ఉన్న బిఆర్-వి గొప్ప ఎంపిక చెప్పవచ్చు...


Click it and Unblock the Notifications








