ఇండియన్ మార్కెట్ కోసం హోండా తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ కారు ఇదే

Written By:

హోండా మోటార్స్ ఇండియన్ మార్కెట్ కోసం అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తోంది. ఇప్పుడు ఈ స్మాల్ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు రివీల్ అయ్యాయి.

హోండా ఎలక్ట్రిక్ కార్లు

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, హోండా మోటార్స్ తమ స్మాల్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ బ్రియో ఆధారంగా ఎలక్ట్రిక్ కారును అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది. దీనితో పాటు ఎలక్ట్రిక్ కార్లకు అవసరమయ్యే లిథియం అయాన్ బ్యాటరీ ప్రొడక్షన్ ప్లాంటు ఏర్పాటుకు సన్నద్దమవుతోంది.

Recommended Video - Watch Now!
Maruti Suzuki Electric Car India Launch Details - DriveSpark
హోండా ఎలక్ట్రిక్ కార్లు

అంతే కాకుండా తమ ఎలక్ట్రిక్ కార్లను పూర్తిగా దేశీయంగానే ఉత్పత్తి చేయనున్నట్లు రిపోర్ట్స్ ద్వారా తెలిసింది. కంపెనీ ప్రకటన మేరకు, 2030 నాటికి తమ మొత్తం విక్రయాల్లో 65 శాతం ఎలక్ట్రిక్ కార్ సేల్స్ ఇందులో 15 ప్యూర్ ఎలక్ట్రిక్ కార్ సేల్స్‌ను సాధించే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు పేర్కొంది.

హోండా ఎలక్ట్రిక్ కార్లు

భారత ప్రభుత్వం 2030 నుండి కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయాలకు అనుమతించే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ కారణంచేతనే హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని చూస్తోంది.

హోండా ఎలక్ట్రిక్ కార్లు

హోండా ఇటీవలె కొన్ని ఎలక్ట్రిక్ కార్లను కాన్సెప్ట్ దశలో ఆవిష్కరించింది. అర్బన్ ఎలక్ట్రిక్ వెహికల్ మరియు స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించింది. భవిష్యత్తులో ఈ రెండింటిని ప్రొడక్షన్ దశకు తీసుకురానుంది. వీటికి అదనంగా బ్రియో ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా సిద్దం చేస్తోంది.

హోండా ఎలక్ట్రిక్ కార్లు

హోండా తమ ఎలక్ట్రిక్ కార్లను ఎప్పుడు పరిచయం చేస్తుందనే విషయం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, 2020 నాటికి తమ తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. తక్కువ ధరకే అందుబాటులో ఉంచేందుకు దేశీయంగా తయారైన విడి భాగాలతో దేశీయంగానే తమ ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయనుంది.

Trending On DriveSpark Telugu:

మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు: విడుదల వివరాలు!!

9-సీటింగ్ కెపాసిటి గల టియువి300 ప్లస్ 9.46 లక్షలకే

మొత్తం డబ్బు చెల్లించి నాలుగు నెలలైనా కారు డెలివరీకి ససేమిరా అంటున్న డీలర్

హోండా ఎలక్ట్రిక్ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పరంగా ఎక్కువ అవకాశాలున్న దేశాల్లో ఇండియా ఒకటి. ఇప్పటికే పలు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వెహికల్ పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసుకుంటున్నాయి. ఇప్పుడు జపాన్ దిగ్గజం హోండా కూడా విపణిలోకి అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని చూస్తోంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Honda Plans To Launch Brio-Based Electric Car In India
Story first published: Thursday, December 28, 2017, 10:30 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark