దేశవ్యాప్తంగా మెగా సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్న హోండా కార్స్ ఇండియా

Written By:

దేశీయ విపణిలో దాదాపు అన్ని సెగ్మెంట్లలో అత్యుత్తమ అమ్మకాలు సాగిస్తోన్న ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, దేశ వ్యాప్తంగా ఉండే హోండా కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఏడు రోజుల పాటు మెగా సర్వీస్ క్యాంపును ప్రారంభించనుంది. ఇది జనవరి 19 నుండి 25, 2017 మధ్య నిర్వహించనున్నట్లు హోండా ప్రకటించింది.

హోండా మెగా సర్వీస్ క్యాంప్

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ నిర్వహించ తలపెట్టిన మెగా సర్వీస్ క్యాంపు సాగే వారం రోజుల పాటు కస్టమర్లకు వివిధ లాభాలను చేకూర్చనుంది. ఈ క్యాంప్ దేశవ్యాప్తంగా ఉన్న 220 నగరాలలో ఉన్న 331 డీలర్ల వద్ద ఏడు రోజుల పాటు ఉంటుంది.

హోండా మెగా సర్వీస్ క్యాంప్

హోండా కార్స్ ఇండియా వినియోగదారులు 50 పాయింట్ కార్ చెకప్ చేయించుకోవచ్చు, సర్వీస్ మరియు విడి పరికరాల మీద డిస్కౌంట్, అదే విధంగా విలువైన సర్వీసుల మీద 15 శాతం రాయితీ కూడా కల్పిస్తోంది.

హోండా మెగా సర్వీస్ క్యాంప్

పైన తెలిపిన ఆఫర్లను మినహాయిస్తే రోడ్ సైడ్ అసిస్ట్, పొడగించబడిన వారంటీ, కొత్త టైర్లు మరియు బ్యాటరీ కొనుగోలు మీద ఆకర్షణీయమైన స్కీమ్స్ అందుబాటులో ఉంచింది.

హోండా మెగా సర్వీస్ క్యాంప్

ఈ క్యాంపు గురించి హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ మరియు సిఇఒ యోయిచిరో యుఎనొ మాట్లాడుతూ, హోండా కార్లను కొనుగోలు చేయడానికి ముందే కాకుండా కొనుగోలు చేసిన తరువాత కూడా కస్టమర్లకు ఆఫర్లను మరియు డిస్కౌంట్లను దేశవ్యాప్తంగా సర్వీస్ క్యాంపు ద్వారా అందిస్తున్నట్లు తెలిపాడు.

హోండా మెగా సర్వీస్ క్యాంప్

కస్టమర్లకు హోండా సంస్థ మీద మరింత నమ్మకాన్ని మరియు మరింత ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవడానికి ఇలాంటి సర్వీస్ క్యాంపులు ఎంతగానో సహకరిస్తాయని తెలిపాడు. హోండా కస్టమర్లందరూ ఈ క్యాంపు లోని సర్వీసులను వినియోగించుకుంటారనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

హోండా మెగా సర్వీస్ క్యాంప్

రూ. 11.99 లక్షల ప్రారంభ ధరతో టాటా హెక్సా విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

టాటా మోటార్స్ తమ లైనప్‌లోకి శక్తివంతమైన మరియు అతి ముఖ్యమైన వాహనం హెక్సా ను నేడు (జనవరి 18, 2017) ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. హెక్సా ఇంజన్, ధరలు, ఫీచర్ల మరియు ఫోటోలు....

హోండా మెగా సర్వీస్ క్యాంప్

రూ. 3.5 లక్షల ప్రారంభ ధరతో హ్యుందాయ్ శాంట్రో

హ్యుందాయ్ మోటార్స్ తమ నెక్ట్స్ జనరేషన్ శాంట్రో కారును 2018 నాటికి రూ. 3.5 లక్షల ప్రారంభ ధరతో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం.

హోండా మెగా సర్వీస్ క్యాంప్

నాలుగు కార్లను మార్కెట్ నుండి తొలగించిన మారుతి సుజుకి

సెలెరియో డీజల్, వ్యాగన్ ఆర్, ఆమ్ని కార్గో మరియు ఇఎకో కార్గో కార్లను మార్కెట్ నుండి తొలగించిన మారుతి సుజుకి.

 

English summary
Honda Cars India To Organise Mega Service Camp Across The Country
Please Wait while comments are loading...

Latest Photos