ఒక్క భారత్‌లోనే రోడ్డెక్కిన 7 లక్షల సిటి కార్లు

Written By:

భారతదేశపు మోస్ట్ పాపులర్ సెడాన్ కారు ఏదో తెలుసా....? హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్ అనుకుంటే పొరబడినట్లే... ఎందుకుంటే భారతదేశపు మోస్ట్ పాపులర్ మరియు బెస్ట్ సెల్లింగ్ సెడాన్ కారుగా హోండా సిటి మొదటి స్థానంలో నిలిచింది.

మీరు నమ్మినా... నమ్మకపోయినా... ఇది అక్షరాలా నిజం. విపణిలోకి హోండా సిటి విడుదలైనప్పటి నుండి 7 లక్షల సిటి సెడాన్ కార్లు భారతీయ రోడ్లెక్కాయి.

హోండా సిటి సెడాన్

ఏడు లక్షల సేల్స్ మైలురాయితో భారత దేశపు అతి పెద్ద బెస్ట్ సెల్లింగ్ సెడాన్ కారుగా హోండా సిటి మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన సిటి సెడాన్ సేల్స్‌తో భారత్ వాటా 25 శాతంగా ఉంది.

Recommended Video - Watch Now!
[Telugu] Volkswagen Passat Launched In India - DriveSpark
హోండా సిటి సెడాన్

హోండా మోటార్స్ తొలి సిటి సెడాన్ కారును 1998లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ యొక్క బెస్ట్ సెల్లింగ్ కారుగా ఎప్పుడు మొదటి స్థానంలోనే నిలిచేది.

హోండా సిటి సెడాన్

ప్రస్తుతం హోండా నాలుగవ తరానికి సిటి సెడాన్ కారు ఇండియాలో అందుబాటులో ఉంచింది. కేవలం ఒక్క నాలుగవ తరానికి చెందిన సిటి సెడాన్ కారే 2.7 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడుపోయింది.

హోండా సిటి సెడాన్

2017లో హోండా ఫేస్‌లిఫ్ట్ సిటి సెడాన్ కారు విడుదల చేసింది. కాస్మొటిక్ మార్పులతో, 7-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, మరియు టెయిల్ ల్యాంప్స్‌కు ఎల్ఇడి ఇన్సర్ట్స్ వంటి అధునాతన ఫీచర్లను అందించింది.

హోండా సిటి సెడాన్

హోండా సిటి టాప్ ఎండ్ వేరియంట్ జడ్ఎక్స్ లో రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆరు ఎయిర్ బ్యాగులు, బూట్ లిడ్ స్పాయిలర్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

హోండా సిటి సెడాన్

ప్రస్తుతం ఇండియా యొక్క మోస్ట్ పాపులర్ మిడ్ సైజ్ సెడాన్ సిటి పెట్రల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించును. సిటిలోని 1.5-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వెర్షన్‌లను 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

హోండా సిటి సెడాన్

తాజాగా హోండా ఇండోనేషియా సేల్స్‌ను హోండా ఇండియా సేల్స్ అధిగమించడంతో ఆసియా దేశాల్లో హోండా మోటార్స్‌కు భారత్ అతి ముఖ్యమైన మార్కెట్‌గా నిలిచింది. హోండా ఇండియన్ మార్కెట్లోకి ఆరు కొత్త మోడళ్లను విడుదల చేసే ప్రణాళికల్లో ఉంది. వీటిలో హైబ్రిడ్ మోడళ్లు మరియు ఐదవ తరానికి చెందిన సిటి ఉన్నాయి.

హోండా సిటి సెడాన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

విపరీతమైన పోటీ ఉన్న మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సియాజ్ వంటి మోడళ్లను ఎదుర్కొని భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ మరియు మోస్ట్ పాపులర్ సెడాన్ కారుగా రాణించడం అంత తేలిక కాదు.

అయితే, హోండా తమ అధునాతన పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు సిటి సెడాన్ కొత్త వెర్షన్‌లో విడుదల చేస్తూ, కొత్త ఫీచర్లను, అత్యుత్తమ నిర్మాణ నాణ్యతమ, భద్రత ఫీచర్లు, ఇంటీరియర్ ఫీచర్లు మరియు శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్‌లతో సెగ్మెంట్ లీడర్‌గా ఎదిగి ఏడు లక్షల మంది ఇండియన్ కస్టమర్ల హృదయాలను దోచుకుంది.

English summary
Read In Telugu: Honda City Is The Most Popular Sedan In India
Story first published: Tuesday, October 31, 2017, 18:35 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark