2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఇంజన్ మరియు స్పెసిఫికేషన్ల కోసం.....

Written By:

జపాన్‌కు చెందిన ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి ఫేస్‌లిఫ్ట్ సిటి సెడాన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు హోండా ప్రతినిధులు తెలిపారు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ లోని వేరియంట్ల వివరాలు

2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ లోని వేరియంట్ల వివరాలు

సరికొత్త హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ ఐదు విభిన్న వేరియంట్లలో లభించును. అవి, ఎస్, ఎస్‌వి, వి, విఎక్స్, జడ్ఎక్స్. వీటిలో ప్రారంభ వేరియంట్ ఎస్ లో డీజల్ ఇంజన్ ఆప్షన్ లేదు మరియు అన్ని డీజల్ వేరియంట్లు కూడా మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభించును. ఎస్‌వి, వి, మరియు విఎక్స్ పెట్రోల్ వేరియంట్లు కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్ (ఆటోమేటిక్) తో లభించును.

2017 హోండా సిటి పెట్రోల్ వేరియంట్ల ధరలు

2017 హోండా సిటి పెట్రోల్ వేరియంట్ల ధరలు

 • ఎస్ ధర రూ. 8,49,990 లు
 • ఎస్‌వి ధర రూ. 9,53,990 లు
 • వి ధర రూ. 9,99,990 లు
 • వి సివిటి ధర రూ. 11,53,990 లు
 • విఎక్స్ ధర రూ. 11,64,990 లు
 • విఎక్స్ సివిటి ధర రూ. 12,84,990 లు
 • జడ్ఎక్స్ సివిటి ధర రూ. 13,52,990 లు
2017 హోండా సిటి డీజల్ వేరియంట్ల ధరలు

2017 హోండా సిటి డీజల్ వేరియంట్ల ధరలు

 • ఎస్‌వి ధర రూ. 10,75,990 లు
 • వి ధర రూ. 11,55,990 లు
 • విఎక్స్ ధర రూ. 12,86,990 లు
 • జడ్ఎక్స్ ధర రూ. 13,56,990 లు
అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.
హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ ఇంజన్ వివరాలు

హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ ఇంజన్ వివరాలు

2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్‌లో 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్ కలదు.దీనిని మునుపటి సిటి సెడాన్ ఫేస్‌లిఫ్ట్‌లో గుర్తించవచ్చు. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా పెడల్ షిఫ్టర్స్ అనుసంధానం ఉన్న 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లను ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు.

2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్
 • పెట్రోల్ ఇంజన్ సామర్థ్యం - 1,497సీసీ
 • పవర్ - 6,600ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 117బిహెచ్‌పి పవర్
 • టార్క్ - 4,600ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 145ఎన్ఎమ్ టార్క్
 • మైలేజ్ - 17.4 కిమీ/లీ
హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ డీజల్ ఇంజన్ వివరాలు

హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ డీజల్ ఇంజన్ వివరాలు

పెట్రోల్ వేరియంట్ తరహాలోనే ఇందులో 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న ఐ-డిటిఇసి డీజల్ ఇంజన్ కలదు. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో ఎంచుకోవచ్చు.

2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్
 • ఇంజన్ సామర్థ్యం - 1,498సీసీ
 • పవర్ - 3,600ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 98బిహెచ్‌పి పవర్
 • టార్క్- 1,750ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 200ఎన్ఎమ్ టార్క్
 • మైలేజ్ - 25.6కిమీ/లీ
2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ డిజైన్

2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ డిజైన్

హోండా మోటార్స్ ఈ ఫేస్‌లిఫ్ట్ సిటి సెడాన్ లో ముందు వైపు డిజైన్ మార్పునకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో అమ్మకాల్లో ఉన్న సివిక్ సెడాన్ శైలిలో ముందు వైపు భాగాన్ని తీర్చిదిద్దింది. ఈ సెగ్మెంట్లో డిజైన్ పరంగా మొదటి స్థానంలో నిలవడానికి డిజైన్ ఒక ప్రధానం అంశం.

2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్

సరికొత్త సివిక్ సెడాన్ ప్రేరిత ముఖ భాగంలో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల ఇముడింపుతో ఉన్న ఎల్ఇడి హెడ్ లైట్లు, అత్యాదునిక ఫ్రంట్ గ్రిల్ ను రీ డిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్‌కు పై భాగంలో అమర్చడం జరిగింది.

2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్

వెనుక వైపు డిజైన్‌కు కూడా అధిక ప్రాధాన్యతనిచ్చారు. చిన్న పరిమాణంలో ఉన్న స్పాయిలర్ ను డిక్కీ డోరు పై భాగంలో అందించారు. దీనికి ఇరువైపులా ఆకర్షణీయమైన టెయిల్ లైట్ డిజైన్ తీరును పరిశీలించవచ్చు. ఇది 16-అంగుళాల పరిమాణం ఉన్న డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ మీద నడుస్తుంది.

ఫీచర్లు

ఫీచర్లు

సరికొత్త సిటి సెడాన్ లోని ఫీచర్ల విషయానికి వస్తే, 7-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇందులో టర్న్ బై టర్న్ న్యావిగేషన్, మాటలను గుర్తుపట్టే ఫీచర్, మిర్రర్ లింక్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి, హెచ్‌డిఎమ్ఐ-ఇన్ పోర్ట్ మరియు మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్ అధే విధంగా వైఫై యుఎస్‌బి వంటివి ఉన్నాయి.

2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్

ఫేస్‌లిఫ్ట్ సిటి సెడాన్ రియర్ వ్యూవ్ కెమెరా, ఒక్క సారి టచ్ చేయగానే ఒపెన్ మరియు క్లోజ్ అయ్యే ఎలక్ట్రిక్ సన్ రూఫ్, మ్యాన్యువల్‌గా డ్రైవర్ సీటు ఎత్తును సర్దుబాటు చేసుకునే అవకాశం, టచ్ ప్యానల్ గల ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ (వాతావరణ నియంత్రిక)

భద్రత పరమైన ఫీచర్లు

భద్రత పరమైన ఫీచర్లు

భద్రత పరంగా సరికొత్త 2017 సిటి సెడాన్ ఫేస్‌లిఫ్ట్‌లో స్పోర్ట్స్ డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఐఎస్ఒఫిక్స్ సీట్ మౌంట్స్ కలవు. టాప్ ఎండ్ వేరియంట్లో స్టాండర్డ్‌గా ముందు వైపు, ప్రక్క వైపుల (కర్టన్ సైడ్) ఎయిర్ బ్యాగులను అందించారు.

2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్

సరికొత్త 2017 సిటి సెడాన్ ఫేస్‌లిఫ్ట్ ఐదు విభిన్న రంగుల్లో లభించును. అవి, వైట్ ఆర్చిడ్ పర్ల్, కార్నేలియన్ రెడ్ పర్ల్, మోడ్రన్ స్టీల్ మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, మరియు ఆల్‌బాస్టర్ సిల్వర్ మెటాలిక్. అంతే కాకుండా క్రోమ్, యుటిలిటి మరియు స్టైల్ అనే మూడు యాక్ససరీ ప్యాకేజీలు ఉన్నాయి.

2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్

మరిన్ని నూతన 2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ సెడాన్ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

 
English summary
2017 Honda City Launched In India; Prices Start At Rs. 8.49 Lakh
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark