అరుదైన మైలు రాయిని సాధించిన హోండా సిటి

Written By:

జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ యొక్క ఇండియా లైనప్‌లోని నాలుగవ తరానికి చెందిన సిటి సెడాన్ అరుదైన మైలు రాయిని సాధించింది. కేవలం ఒక్క ఫోర్త్ జనరేషన్ సిటి సెడాన్ 2.5 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడుపోయింది.

హోండా సిటి సెడాన్

హోండా తమ ఫోర్త్ జనరేషన్ సిటి కారును 2014 జనవరిలో విడుదల చేసింది. సుమారుగా మూడేళ్లలో రెండున్న లక్షల యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. కొంత కాలానికి నాలుగవ తరానికి చెందిన సిటిలో సరికొత్త ఐ-డిటిఇసి డీజల్ మరియు నూతన సిటివి టెక్నాలజీ గల ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేసింది.

హోండా సిటి సెడాన్

అంతే కాకుండా, కస్టమర్లు సిటి సెడాన్ కారును ఎంచుకోవడంలో ఎన్నో మార్పులు జరిగాయి. మొత్తం సిటి కారును ఎంచుకున్న మొత్తం కస్టమర్లలో 30 శాతం మంది ఎక్కువ ఇంధన సామర్థ్యం ఉన్న ఆటోమేటిక్ వేరియంట్లను ఎంచుకున్నారు.

హోండా సిటి సెడాన్

హోండా మోటార్ ఇండియా ప్రెసిడెంట్ మరియు సిఇఒ, యోయిచిరో యెనో మాట్లాడుతూ, హోండా సంస్థకు సిటి సెడాన్ పిల్లర్ లాంటిదని తెలిపాడు. హోండా యొక్క వ్యాపార మరియు సక్సెస్‌లో సిటి కారు కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నాడు. నాలుగవ తరానికి చెందిన సిటిలో కస్టమర్లు కోనుకునే రీతిలో ప్రీమియమ్ ఫీచర్లను అందివ్వడం జరిగిందని చెప్పుకొచ్చాడు."

హోండా సిటి సెడాన్

హోండా తొలిసారిగా 1998లో సిటి సెడాన్ కారును దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టింది. తొలినాళ్ల నుండి ఇప్పటి వరకు 6,80,000 యూనిట్ల సిటి కార్లను విక్రయించింది హోండా. హోండా ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తున్న సిటి కార్ల మొత్తం విక్రయాల్లో 25 శాతం ఇండియా నుండే కావడం గమనార్హం.

హోండా సిటి సెడాన్

అంతర్జాతీయంగా, సుమారుగా 60 దేశాల్లో లభిస్తున్న సిటి సెడాన్ కార్ల విక్రయాలను కలుపుకుంటే రికార్డు స్థాయిలో 35 లక్షల వరకు అమ్ముడుపోయాయి. వీటిలో ఫోర్త్ జనరేషన్ సిటి కార్లే పది లక్షల వరకు ఉన్నాయి.

హోండా సిటి సెడాన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా సిటి కారును అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో నిర్మిస్తోంది. ఇండియాలో సిటి సెడాన్‌కు తీవ్రపోటి ఉన్నప్పటికీ నాణ్యత మరియు ప్రీమియమ్ ఫీచర్ల కారణంగా ఎంతో మంది కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది.

English summary
Read In Telugu Fourth-Generation Honda City Crosses A Significant Milestone
Story first published: Saturday, July 1, 2017, 10:50 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark