ఇండియాలో మళ్లీ తన జాతకాన్ని పరీక్షించుకోనుంది

Written By:

జపాన్‌కు చెంది ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ దేశీయంగా విపణిలోకి తమ సివిక్‌ను రీలాంచ్ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంభందించి హోండా కార్స్ సిఇఒ, యోయిచిరో యుఎనో ఇండియాలో దీనిని మళ్లీ విడుదల చేయడానికి అవకాశం ఉన్నట్లు పరోక్ష సూచనలు చేసారు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
హోండా సివిక్

హోండా కార్స్ ఇండియా విభాగం మొదటి సారిగా 2006 లో సివిక్ సెడాన్ ను విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు దేశీయంగా మంచి ఫలితాలను సాధించింది. అయితే 2013 లో బలవంతంగా సివిక్ సెడాన్ కార్ల అమ్మకాలను హోండా నిలిపేసింది.

హోండా సివిక్

సివిక్ ఉన్న సెగ్మెంట్లోకి ఇతర కార్ల తయారీ సంస్థలు డీజల్ ఇంజన్‌లతో పోటీగా నూతన ఉత్పత్తులను విడుదల చేయడం, ఫలితంగా అమ్మకాలు నానాటికీ మందగించడంతో మార్కెట్ నుండి చివరికి తొలగించింది.

హోండా సివిక్

సివిక్ ఇండియాలో విడుదలకు సిద్దంగా ఉన్నట్లు హోండా కార్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పరోక్ష ప్రకటనలు చేసారు. ప్రస్తుతం హోండా పదవ తరానికి చెందిన సివిక్ ను అభివృద్ది చేసిందని. ఇందులో భవిష్యత్తుకు సరితూగే ఫీచర్లతో పాటు శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్‌లను కోరుకునే కస్టమర్లకు అనుగుణంగా నిర్మించినట్లు పేర్కొన్నారు.

హోండా సివిక్

ఇండియన్ మార్కెట్లోకి డి-సెగ్మెంట్లో ఉన్న హ్యుందాయ్ ఎలంట్రా మరియు టయోటా కరోలా ఆల్టిస్ సెడాన్ కార్లకు బలమైన పోటీని సృష్టించనుందని తెలిపారు.

హోండా సివిక్

సివిక్ సెడాన్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలయితే ప్రస్తుత హోండా లైనప్‌లో ఉన్న అకార్డ్ మరియు సిటి సెడాన్ మధ్య గల స్థానాన్ని భర్తీ చేయనుంది.

హోండా సివిక్

హోండా కార్స్ ఈ పదవ తరానికి చెందిన సివిక్ లో డిజైన్ పరంగా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఎక్ట్సీరియర్ డిజైన్ మీద దృష్టి సారిస్తూ, నూతన ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, ఆంగ్లపు సి-ఆకారంలో ఉన్న టెయిల్ ల్యాంప్స్ మరియు డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి.

హోండా సివిక్

అంతర్జాతీయ మార్కెట్లో హోండా సివిక్ సెడాన్ 1.8-లీటర్ పెట్రోల్, 2.0-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది.

హోండా సివిక్

అయితే ప్రత్యేకించి దేశీయ మార్కెట్ కోసం 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న ఐ-డిటిఇసి డీజల్ ఇంజన్‌ను అందివ్వనుంది. ఇది గరిష్టంగా 118బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

హోండా సివిక్

అంతే కాకుండా 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో పెట్రోల్ మరియు 1.8-లీటర్ సామర్థ్యం ఉన్న న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌లను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి విడుదలకు ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంది.

 

English summary
Also Read In Telugu: Honda Civic Is Preparing For A Comeback In India
Story first published: Tuesday, January 31, 2017, 18:31 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark