హోండా సిఆర్-వి డీజల్ ఇండియా విడుదల వివరాలు

Written By:

జపాన్ దిగ్గజం హోండా మోటార్స్ ఐదవ తరానికి చెందిన సిఆర్-వి ప్రీమియమ్ ఎస్‌యూవీ ఇండియాలో విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, సిఆర్-విని వచ్చే ఏడాది

ప్రారంభం నాటికి విడుదల చేయనున్నట్లు తెలిసింది.

హోండా సిఆర్-వి డీజల్ ఇండియా విడుదల వివరాలు

ఆసియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్న మోడల్‌నే ఇండియాకు తీసుకురానున్నట్లు సమాచారం. ఈ సిఆర్-వి ఇదివరకే ఉన్న ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానిత, 190బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 2.4-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడా రానుంది.

హోండా సిఆర్-వి డీజల్ ఇండియా విడుదల వివరాలు

కానీ సిఆర్-వి ను ఎంచుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్ ఏమిటంటే, అప్ కమింగ్ సిఆర్-వి ఎస్‌యూవీ డీజల్ ఇంజన్ వేరియంట్లో రానుంది. 158బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.6-లీటర్ ఐ-డిటిఇసి డీజల్ ఇంజన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది.

హోండా సిఆర్-వి డీజల్ ఇండియా విడుదల వివరాలు

సిఆర్-వి లను ఇండియాలోనే అసెంబుల్ చేయనుంది. ఇలా చేయడం ద్వారా తయారీ భారం తగ్గడంతో తక్కువ ధరలకే సిఆర్-వి లను విడుదల చేయవచ్చు.హోండా ఈ సిఆర్-విలోని డీజల్ మరియు పెట్రోల్ ఇంజన్‌ వేరియంట్లలో ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ పరిచయం చేయనుంది.

హోండా సిఆర్-వి డీజల్ ఇండియా విడుదల వివరాలు

డిజైన్ విషయానికి అంతర్జాతీయ విపణిలో ఉన్న సిఆర్-వి తరహాలోనే ఇండియన్ మోడల్ ఉంటుంది. అవుట్ గోయింగ్ మోడల్‌తో పోల్చుకుంటే, అప్ కమింగ్ సిఆర్-వి మరింత షార్పు లుక్‌లో ఉంది. గాలి ద్వారా కలిగే ఘర్షణను నివారించడానికి ఆటోమేటిక్ షటర్ గ్రిల్ టెక్నాలజీ హోండా ఇందులో పరిచయం చేసింది.

హోండా సిఆర్-వి డీజల్ ఇండియా విడుదల వివరాలు

సరికొత్త హోండా సిఆర్-వి ఇంటీరియర్ విషయానికి వస్తే, 7-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, హీటెడ్ వింగ్ మిర్రర్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వంటి ఫీచర్లున్నాయి.

హోండా సిఆర్-వి డీజల్ ఇండియా విడుదల వివరాలు

ఐదవ తరానికి చెందిన హోండా సిఆర్-వి ఎస్‌యూవీ పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి విడుదలయితే, విపణిలో ఉన్న హ్యుందాయ్ టక్సన్, వోక్స్‌వ్యాగన్ టిగువాన్, మరియు జీప్ కంపాస్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియాలో తయారయ్యే 1.6-లీటర్ డీజల్ ఇంజన్‌లను డిమాండ్ అధికంగా ఉన్న మార్కెట్లకు ఎగుమతి చేస్తామని హోండా మోటార్స్ ఇది వరకే ప్రకటచింది. ఏదేమయినప్పటికీ, హోండా సిఆర్-వి దేశీయంగా గట్టి పోటీని ఎదుర్కోక తప్పదు.

English summary
Read In Telugu Honda CR-V Diesel India Launch Details Revealed
Story first published: Friday, June 23, 2017, 8:30 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark