హోండా ప్రివిలేజ్ ఎడిషన్ విడుదల: ప్రారంభ ధర రూ. 7.36 లక్షలు

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రివిలేజ్ ఎడిషన్‌లో విడుదల చేసింది. జాజ్ ప్రివిలేజ్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 7.36 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

By Anil

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రివిలేజ్ ఎడిషన్‌లో విడుదల చేసింది. జాజ్ ప్రివిలేజ్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 7.36 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

హోండా ప్రివిలేజ్ ఎడిషన్

హోండా లైనప్‌లో ఉన్న ఎమ్‌పీవీ శ్రేణిలోని "వి" వేరియంట్ ఆధారంగా జాజ్ ప్రివిలేజ్ ఎడిషన్‌ను అభివృద్ది చేసింది. ఎక్ట్సీరియర్ పరంగా అనేక ఫీచర్లును ఇందులో కల్పించింది. స్పోర్టివ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, భద్రత మరియు కంఫర్ట్ పరంగా దృష్టి సారిస్తూ రెగ్యులర్ జాజ్‌తో పోల్చితే విభిన్నమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Recommended Video

Tata Nexon Review: Specs
హోండా ప్రివిలేజ్ ఎడిషన్

జాజ్ ప్రివిలేజ్ ఎడిషన్ ఎక్ట్సీరియర్ మీద ప్రివిలేజ్ ఎడిషన్‌ను సూచించే ప్రత్యేక బ్యాడ్జింగ్ కలదు. మరియు అదనంగా ఇందులో పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. బీజి రంగులో ఉన్న సీట్ కవర్లు, శాటిలైట్ న్యావిగేషన్ గల 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 1.జిబి ఇంటర్నల్ స్టోరేజ్, మిర్రర్ లింక్ మరియు వాయిస్ కమాండ్‌లను సపోర్ట్ చేస్తుంది.

హోండా ప్రివిలేజ్ ఎడిషన్

జాజ్ ప్రివిలేజ్ ఎడిషన్‌లోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ బ్లూటూత్, యుఎస్‌బి స్లాట్లు, మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్లు, మీడియా మరియు హెచ్‌డిఎమ్‌ఐ-ఇన్ పోర్ట్ లను కలిగి ఉంది.

హోండా ప్రివిలేజ్ ఎడిషన్

హోండా జాజ్ ప్రివిలేజ్ ఎడిషన్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రివర్స్ కెమెరా, అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ పవర్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం ఉన్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లు ఉన్నాయి. జాజ్ ప్రివిలేజ్ ఎడిషన్‌లోని పెట్రోల్ వేరియంట్లలో డ్రైవర్ మ్యాన్యువల్‌గా గేర్లను మార్చడం కోసం పెడల్ షిఫ్టర్లు ఉన్నాయి.

హోండా ప్రివిలేజ్ ఎడిషన్

సాంకేతికంగా హోండా జాజ్ ప్రివిలేజ్ ఎడిషన్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఇందులోని శక్తివంతమైన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 6,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 89బిహెచ్‌పి పవర్ మరియు 4,800ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 110ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

  • జాజ్ ప్రివిలేజ్ ఎడిషన్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్ 19కిమీ/లీ
  • జాజ్ ప్రివిలేజ్ ఎడిషన్ పెట్రోల్ మ్యాన్యువల్ వేరియంట్ మైలేజ్ 18.2 కిమీ/లీ
  • హోండా ప్రివిలేజ్ ఎడిషన్

    జాజ్ ప్రివిలేజ్ ఎడిషన్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌లోని 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ 3,600ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 98బిహెచ్‌పి పవర్ మరియు 1,750ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి అవుతుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల జాజ్ ప్రివిలేజ్ ఎడిషన్ మైలేజ్ 27.3 కిమీ/లీ.

    హోండా ప్రివిలేజ్ ఎడిషన్

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    రెగ్యులర్ వెర్షన్ జాజ్‌తో పోల్చుకుంటే ప్రివిలేజ్ ఎడిషన్‌లో అనేక అదనపు ఫీచర్లు ఉన్నాయి. పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జాజ్‍లోని విభిన్న ఎడిషన్‌ ఎంచుకునే కస్టమర్లకు అనుగుణంగా హోండా జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రివిలేజ్ ఎడిషన్‌లో పరిచయం చేసింది.

Most Read Articles

English summary
Read In Telugu: Honda Jazz Privilege Edition Launched in India; Prices Start At Rs 7.36 Lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X