మొబీలియోకు శాశ్వతంగా వీడ్కోలు పలికిన హోండా

Written By:

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా మోటార్స్ ఇండియా లైనప్ నుండి మొబీలియోను శాశ్వతంగా తొలగించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఎమ్‌పీవీ సెగ్మెంట్‌ను శాసించాలనే లక్ష్యంతో హోండా ప్రవేశపెట్టిన మొబీలియో అందుకు తగిన విధంగా సేల్స్ సాధించడంలో విఫలమయ్యింది.

మార్కెట్ నుండి మొబీలియోను తొలగించిన హోండా

2014 లో విడుదలైన హోండా మొబీలియో దేశీయ విపణిలో తనదైన ముద్రవేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే తమ అధికారిక వెబ్‌సైట్ నుండి తొలగించింది హోండా. అయితే అధికారికంగా మొబీలియోను తొలగించిన విషయాన్ని హోండా ఇంకా స్పష్టం చేయలేదు.

మార్కెట్ నుండి మొబీలియోను తొలగించిన హోండా

బ్రియో హ్యాచ్‌బ్యాక్ ఆధారంతో మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పీవీ పోటీగా వచ్చిన మొబీలియో ఇండియన్స్‌ను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఆర్ఎస్ వేరియంట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ మొబీలియోను నెట్టుకురావడం మరింత కష్టతరమైంది.

మార్కెట్ నుండి మొబీలియోను తొలగించిన హోండా

అధిక సంఖ్యలో కార్లను విక్రయించాలనే ఉద్దేశంతో కాకుండా, మంచి నిర్మాణ విలువలతో ఖరీదైన ఉత్పత్తుల మీద దృష్టి సారించినట్లు హోండా ఓ ప్రకటనలో తెలిపింది. అందులో భాగంగానే చిన్న కార్ల మార్కెట్‌ను ప్రక్కనపెట్టి సిటి, జాజ్, బిఆర్-వి మరియు డబ్ల్యూఆర్-వి వంటి మోడళ్లను ప్రవేశపెట్టింది.

మార్కెట్ నుండి మొబీలియోను తొలగించిన హోండా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మొబీలియో ఎమ్‌పీవీ ఆశించిన మేర విక్రయాలు సాధించడంలేదని హోండా మోటార్స్ ఇండియన్ మార్కెట్ నుండి తొలగించింది. అయితే ప్రస్తుతం మొబీలియోను ఎంచుకున్న కస్టమర్లకు సర్వీస్ మరియు స్పేర్ పార్ట్స్ లభ్యతపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

English summary
Read In Telugu Honda Mobilio discontinued In Indi
Story first published: Thursday, July 6, 2017, 12:47 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark