జనవరి 10, 2017 రోజు కోసం ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్న హోండా

Written By:

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ గత ఏడాది మలిసంగంలో అమేజ్ కాంపాక్ట్ సెడాన్ మరియు బ్రియో హ్యాచ్‌బ్యాక్‌లను ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఇప్పుడు తమ మొబీలియో ఎమ్‌పివి వాహనాన్ని ఫేస్‌లిప్ట్ రూపంలో విడుదల చేయడానికి ఏర్పాట్లను సిద్దం చేస్తోంది.

హోండా మోటార్స్ తమ మొబీలియో ఎమ్‌పివి ని 2014 లో విడుదల చేసింది. అప్పటి నుండి మారుతి ఎర్టిగా ఎమ్‌పివికి గట్టి పోటీనిస్తూ వచ్చింది. అయితే విడుదలైన మూడేళ్ల తరువాత ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదలకు ముస్తాబవుతోంది.

జనవరి 10, 2017 నాటికి ప్రపంచ ప్రదర్శనకు రానున్న ఈ ఫేస్‌లిఫ్ట్ యొక్క టీజర్ ఫోటోలు ఇండోనేషియా వాహన పరిశ్రమలో చక్కర్లుకొట్టాయి. మరియు ఈ మొబీలియో ఫేస్‌లిఫ్ట్ మొదటి సారిగా ఇండోనేషియా మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది.

మొబీలియో ఫేస్‌లిఫ్ట్ టీజర్ ఫోటోల ప్రకారం ముందు వైపు డిజైన్‌లో భారీ మార్పులు సంతరించుకున్నాయి. ప్రత్యేకించి హెడ్ లైట్లు దాదాపుగా కొత్త స్టైల్లో పరిచయం కానున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న మోడల్ కన్నా పరిమాణం పరంగా చిన్నగా ఉండనున్నాయి.

సిటి సెడాన్ కారు తరహాలోని ఫ్రంట్ గ్రిల్ మరియు అచ్చం అందులో ఉన్న అవే క్రోమ్ ఫలకలను దీని ఫ్రంట్ గ్రిల్ మీద అందించారు. మరియు డిజైన్ పరంగా ఎక్కువ గాలిని గ్రహించే విధంగా బంపర్‌ను కోణియాకృతిలో తీర్చిదిద్దారు. ఇందులోనే ఆకర్షణీయంగా ఫాగ్ ల్యాంప్స్ అందివ్వడం జరిగింది.

అంతర్జాతీయ మార్కెట్ కోసం అప్‌డేట్స్ నిర్వహించి ఫేస్‌లిఫ్ట్ రూపంలో పరిచయం కానున్న ఈ మొబీలియో ఇంటీరియర్ మరియు డ్యాష్‌బోర్డ్ దాదాపుగా అనేక మార్పులకు గురైంది. పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లను హెడ్ లైట్లలో క్రింది బాగాన ఇముడింపచేయడం జరిగింది.

విడుదలైనప్పటి నుండి మొదటి సారిగా అప్‌డేట్స్‌కు గురవుతున్నట్లు సూచించే టీజర్ ఫోటోల ప్రకారం ఇంటీరియర్ వివరాలను దాదాపుగా గోప్యంగా ఉంచారు. అమ్మకాల పరంగా హోండా లైనప్‌లో మొబీలియో వెనుకంజలో ఉంది. ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేస్తే అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ దేశీయంగా ఈ ఫేస్‌లిఫ్ట్ మొబీలియోతో పాటు ఫేస్‌లిఫ్ట్ సిటి సెడాన్ మరియు జాజ్ ను నిర్మించిన వేదిక ఆధారంగా రూపొందించబడిన డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ను కూడా విడుదల చేయనుంది.

బడ్జెట్ ధరతో 2017 లో విడుదల కానున్న స్పోర్టివ్ బైకులు
2017 లో విడుదల కానున్న ఉత్తేజకరమైన బైకుల గురించి మరియు అంచనాతో విడుదల , ధర వివరాలు మీ కోసం....

 

English summary
Honda Mobilio Facelift Teased Ahead Of Global Unveil
Story first published: Monday, January 9, 2017, 18:45 [IST]
Please Wait while comments are loading...

Latest Photos