ఫ్రాంక్‌ఫర్ట్ వేదిక మీద హోండా అద్భుతమైన ఆవిష్కరణ

Written By:

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగర వేదికగా జరుగుతున్న వాహన ప్రదర్శన వేదిక ఎన్నో అద్భుతావిష్కరణలకు నెలవవుతోంది. ఎన్నో కార్ల తయారీ సంస్థలు తమ భవిష్యత్ కార్లను కాన్సెప్ట్ దశలో ప్రదర్శించాయి.

అయితే, వీటిలో హోండా ఆవిష్కరించిన అర్బన్ ఇవి కాన్సెప్ట్ సరికొత్త రూపంలో ఉంది. ఎక్కువ వెడల్పు, తక్కువ పొడవుతో మనం ఇదివరకెన్నడూ చూడని రూపంలో అర్బన్ ఇవి కాన్సెప్ట్‌ను కొలువుదీర్చింది.

హోండా అర్బన్ ఎలక్ట్రిక్ వెహికల్

ప్రస్తుతం కాన్సెప్ట్ దశలో ప్రదర్శనకు వచ్చిన దీనిని పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ దశకు తీసుకెళ్లి 2019 నాటికి ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు హోండా వెల్లడించింది. అదే ఏడాది దిగ్గజ ప్యాసింజర్ కార్ల మార్కెట్లోకి అర్బన్ ఇవి కారును విడుదల చేయనుంది.

Recommended Video - Watch Now!
Volkswagen Launches Tenth Anniversary special Editions | In Telugu - DriveSpark తెలుగు
హోండా అర్బన్ ఎలక్ట్రిక్ వెహికల్

భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి నూతన సాంకేతి పరిజ్ఞానం మరియు సరికొత్త డిజైన్ లక్షణాలతో అత్యాధునిక ప్లాట్‌ఫామ్‌ మీద హోండా ఈ అర్బన్ ఇవి కాన్సెప్ట్ కారును నిర్మించింది.

హోండా అర్బన్ ఎలక్ట్రిక్ వెహికల్

హోండా అర్బన్ ఇవి వెహికల్ కొలతల పరంగా ప్రస్తుతం ఉన్న మోడళ్లతో పోల్చుకుంటే పూర్తి భిన్నంగా ఉంది. జాజ్ ప్రీమియం హ్యచ్‌బ్యాక్ కన్నా 100ఎమ్ఎమ్ తక్కువ పొడువుతో, 3895ఎమ్ఎమ్ వెడల్పును కలిగి ఉంది.

హోండా అర్బన్ ఎలక్ట్రిక్ వెహికల్

హోండా ఫ్యూచర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సరికొత్త స్టైలింగ్‌ను ప్రతిబింబించేలా ఫ్రంట్ గ్రిల్ మీద ఉన్న నీలి రంగు కాంతితో వెలిగే హోండా లైట్ సింబల్ కలదు. ఫ్రంట్ డిజైన్‌లో ఉన్న రెండు హెడ్ ల్యాంప్స్‌కు మధ్యలో హోండా చిహ్నానికి ఒకవైపున ఇంటరాక్టివ్ మెసేజ్ డిస్ల్పే కలదు. ఇది ఇతర డ్రైవర్లకు సూచనలు మరియు వాహనం యొక్క ఛార్జింగ్ స్టేటస్ గురించి సమాచారాన్ని సూచిస్తుంది.

హోండా అర్బన్ ఎలక్ట్రిక్ వెహికల్

హోండా అర్బన్ ఇవి కాన్సెప్ట్ ఇంటీరియర్‌లో అనవసరపు హంగులకు దూరంగా భవిష్యత్ ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉండనుందో రివీల్ చేసింది. ముందు వైపు డ్రైవర్‌కు చక్కటి విజిబిలిటి కల్పిస్తూ విశాలమైన ముందు అద్దం, ఫ్లోటింగ్ డ్యాష్ బోర్డ్, చిన్న పరిమాణంలో ఉన్న స్టీరింగ్ వీల్, సింపుల్‌గా కంట్రోల్ బటన్స్ మరియు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఇందులో ఉన్నాయి.

హోండా అర్బన్ ఎలక్ట్రిక్ వెహికల్

అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ల స్థానంలో చిన్న కెమెరాలను అందివ్వడం జరిగింది, వాటి ద్వారా ఇంటీరియర్‌లోని డ్యాష్‌ బోర్డులో వెనుక వైపును గమనించవచ్చు. కాన్సెప్ట్ రూపంలో ఉన్న అర్బన్ ఇవి కారులో నలుగురు ప్రయాణించే కెపాసిటి ఉన్నప్పటికీ, ప్రొడక్షన్ మోడల్ 5-సీటింగ్ లేఔట్లో వచ్చే అవకాశం ఉంది.

హోండా అర్బన్ ఎలక్ట్రిక్ వెహికల్

హోండా తమ అర్బన్ ఇవి ఎలక్ట్రిక్ వెహికల్ గురించిన సాంకేతిక వివరాలను వెల్లడించలేదు. అయితే, ఇందులో అధిక సామర్థ్యం ఉన్న తేలికపాటి బరువు గల బ్యాటరీ ఉన్నట్లు వెల్లడించింది. ఇంటిగ్రేటెడ్ హీట్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ వంటి ఫంక్షన్స్ ఇందులో ప్రత్యేకంగా నిలిచాయి.

హోండా అర్బన్ ఎలక్ట్రిక్ వెహికల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా అర్బన్ ఇవి కారు చూడటానికి ఓల్డ్ మోడల్ డిజైన్‍‌లో ఉన్నప్పటికీ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లో భవిష్యత్ రవాణా ప్రతిబింబిస్తోంది. ఫీచర్లను ప్రక్కపెడితే సాంకేతిక వివరాలు ఇందులో అతి ముఖ్యమైనవి. అయితే ఆ వివరాలను వెల్లడించడానికి హోండా నిరాకరించింది.

English summary
Read In Telugu: honda urban ev concept unveiled frankfurt motor show
Story first published: Friday, September 15, 2017, 15:03 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark