హోండా డబ్ల్యూఆర్-వి కి వస్తున్న ఆదరణ చూస్తే షాక్ తింటారు

Written By:

హోండా మోటార్స్ భారీ అంచనాల మధ్య విడుదల చేసిన డబ్ల్యూఆర్-వి (WR-V) క్రాసోవర్ ఎస్‌యూవీకి భారీ స్పందన లభిస్తోంది. విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 7,000 లకు పైబడి బుకింగ్స్ నమోదు కాగా, అందులో ఇప్పటికే 3,833 యూనిట్లను డెలివరీ కూడా చేసినట్లు హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ వివరాలు

హోండా తెలిపిన గణాంకాల ప్రకారం, విడుదలైన కేవలం 23 రోజుల్లోనే డబ్ల్యూఆర్-వి మీద 7,000 లకు పైబడి బుకింగ్స్ నమోదైనట్లు తెలిసింది. మొదటినెలలోనే 3,833 యూనిట్లను డెలివరీ చేసినట్లు హోండా తెలిపింది.

 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ వివరాలు

డబ్ల్యూఆర్-వి పూర్తిగా తమ జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా అభివృద్ది చేయబడింది. గతంలో హోండా మోటార్స్ ఎస్‌యూవీల సెగ్మెంట్లోకి మొబీలియో మరియు బిఆర్-వి వాహనాలను విడుదల చేసింది.

 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ వివరాలు

దేశీయంగా యుటిలిటి వాహనాల మార్కెట్ పుంజుకుంటున్న నేపథ్యంలో హోండా మోటార్స్ ఎస్‌యూవీ సెగ్మెంట్ మీద పూర్తిగా దృష్టిపెట్టింది. అందులో భాగంగానే డబ్ల్యూఆర్-వి ను క్రాసోవర్ ఎస్‌యూవీగా అందుబాటులోకి తెచ్చి మంచి సక్సెస్ సాధించింది.

 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ వివరాలు

హోండా కార్స్ ఇండియా సిఇఒ మరియు ప్రెసిడెంట్ యోఇచిరో యుఎనో మాట్లాడుతూ, హోండా ఎంట్రీ లెవల్ వేరియంట్ల రూపకల్పన మీద దృష్టి సారించింది. మరియు హోండా పోర్ట్‌ఫోలియోలోని అన్ని వేరియంట్లకు ప్రీమియమ్ లుక్ తీసుకొస్తున్నట్లు పేర్కొన్నాడు.

 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ వివరాలు

డబ్ల్యూఆర్-వి కాంపాక్ట్ క్రాసోవర్ ఎస్‌యూవీలో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 89బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ వివరాలు

హోండా డబ్ల్యూఆర్-వి లోని 1.5-లీటర్ సామర్థ్యం గల ఐ-డిటిఇసి డీజల్ ఇంజన్ గరిష్టంగా 99బిహెచ్‌పి వరకు పవర్ ఉత్పత్తి చేయును. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్లో ఎంచుకోవచ్చు.

 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ వివరాలు

హోండా డబ్ల్యూఆర్-వి లోని టాప్ ఎండ్ వేరియంట్లో సన్ రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు పుష్ బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ లేదు.

 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ వివరాలు

డబ్ల్యూఆర్-వి క్రాసోవర్‌లో అందించిన 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ నూతనంగా డెవలప్ చేసినది హోండా తెలిపింది. తద్వారా సాధారణ వేరియంట్ల కంటే ఇది ఎక్కువ మైలేజ్ ఇవ్వడంలో సహాయపడుతుందని హోండా తెలిపింది.

 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ వివరాలు

హోండా డబ్ల్యూఆర్-వి కాంపాక్ట్ క్రాసోవర్ ఎస్‌యూవీ ధరల శ్రేణి 7.75 లక్షల నుండి 10 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరగా ఉంది.

 
English summary
Honda WR-V Garners 7,000 Bookings In A Very Short Period
Story first published: Monday, April 10, 2017, 15:04 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark