విడుదలైన నెల రోజులలోపే 12,000 పైగాకు బుకింగ్స్

కేవలం విడుదలైన నెలరోజుల్లోనే హోండా డబ్ల్యూఆర్‌-వి మీద 12,000 లకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. హోండా దీనిని మార్చి 2017 లో ప్రారంభంలో విపణిలోకి విడుదల చేసింది.

By Anil

హోండా కార్ ఇండియా యొక్క పూర్వ వైభవం డబ్ల్యూఆర్‌-వి విడుదలతో మళ్లీ వెనక్కి వచ్చిందిని చెప్పవచ్చు. జపాన్ దిగ్గజం ఈ క్రాసోవర్ వెహికల్‌ విడుదల చేసిన కేవలం 30 రోజుల్లో 12,000 లకు పైగా బుకింగ్స్ వచ్చాయి.

భారీ బుకింగ్స్ నమోదు చేసుకున్న హోండా డబ్ల్యూఆర్‌-వి

ఆ తరువాత నెల ఏప్రిల్‌లో 3,000 లకు పైగా డబ్ల్యూఆర్-వి యూనిట్లను హోండా విక్రయించేసింది. తమ బెస్ట్ సెల్లింగ్ మోడల్ సిటి సెడాన్ తరువాత స్థానంలో డబ్ల్యూఆర్-వి నిలిచింది.

భారీ బుకింగ్స్ నమోదు చేసుకున్న హోండా డబ్ల్యూఆర్‌-వి

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తోంది.

భారీ బుకింగ్స్ నమోదు చేసుకున్న హోండా డబ్ల్యూఆర్‌-వి

విడుదల సమయంలో డబ్ల్యూఆర్-వి గురించి పట్టించుకోని పోటీదారులకు ఇప్పుడు చెమటలు పుట్టిస్తోందని చెప్పాలి. మార్కెట్ వర్గాలు ఊహించిన స్థాయిలో విక్రయాలు సాధించింది. హోండా అంచనాలను పెంచేస్తోంది.

భారీ బుకింగ్స్ నమోదు చేసుకున్న హోండా డబ్ల్యూఆర్‌-వి

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో భారీ పోటీ ఉన్న నేపథ్యంలో పోటీదారుల ఉత్పత్తులకు దడ పుట్టిస్తున్న డబ్ల్యూఆర్-వి నిజానికి బ్రిజా మరియు ఎకోస్పోర్ట్‌లతో ఏ మాత్రం పోలిక ఉండదు. అయితే భారత దేశపు ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ అంటే ఇదే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

భారీ బుకింగ్స్ నమోదు చేసుకున్న హోండా డబ్ల్యూఆర్‌-వి

హోండా మోటార్స్ ఈ డబ్ల్యూఆర్-వి మీద అదనపు ఫీచర్లు అందించడం మీద ఎక్కువగా దృష్టిసారించింది. పోటీదారులతో పోల్చుకుంటే విశాలమైన క్యాబిన్ స్పేస్ దీన సొంతం. మరియు ఈ సెగ్మెంట్లో మొదటి సారిగా ఎలక్ట్రిక్ సన్ రూఫ్ టాప్ గల మోడల్ కూడా ఇదే.

భారీ బుకింగ్స్ నమోదు చేసుకున్న హోండా డబ్ల్యూఆర్‌-వి

ఇంటీరియర్‌లో 7-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు, ఇందులో ఇంటర్నెట్ కోసం వై-ఫై, క్రూయిజ్ కంట్రోల్, ఇంజన్ స్టార్ట్ మరియు స్టాప్ బటన్ వంటి ఫీచర్లను అందివ్వడం జరిగింది.

భారీ బుకింగ్స్ నమోదు చేసుకున్న హోండా డబ్ల్యూఆర్‌-వి

భద్రత పరంగా హోండా తమ డబ్ల్యూఆర్-విలో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు స్టాండర్డ్‌గా డ్యూయల్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.

భారీ బుకింగ్స్ నమోదు చేసుకున్న హోండా డబ్ల్యూఆర్‌-వి

హోండా డబ్ల్యూఆర్-వి పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తోంది. అవి, 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న ఐ-విటిఇసి పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న ఐ-డిటిఇసి డీజల్.

భారీ బుకింగ్స్ నమోదు చేసుకున్న హోండా డబ్ల్యూఆర్‌-వి

సాంకేతికంగా పెట్రోల్ డబ్ల్యూఆర్-వి గరిష్టంగా 89బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరియు డీజల్ వేరియంట్ డబ్ల్యూఆర్-వి గరిష్టంగా 99బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

డబ్ల్యూఆర్-వి మైలేజ్ వివరాలు

డబ్ల్యూఆర్-వి మైలేజ్ వివరాలు

  • పెట్రోల్ వేరియంట్ - 17.5 కిమీ/లీ
  • డీజల్ వేరియంట్ - 25.5కిమీ/లీ
  • భారీ బుకింగ్స్ నమోదు చేసుకున్న హోండా డబ్ల్యూఆర్‌-వి

    హోండా డబ్ల్యూఆర్-వి ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.75 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu To Know About Honda WR-V Overwhelming Bookings Since Launch. Honda WR-V Engine, Mileage, Features, Price, Photos and More.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X